RamNath Kovind : 7న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాక
Chittoor: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఒక రోజు పర్యటనలో భాగంగా ఈ నెల 7వ తేదీన ఆదివారం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. ఈ పర్యటనలో రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలకనున్నారని పేర్కొన్నారు.
మదనపల్లె హెలిప్యాడ్‌కు చేరుకోనున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 7న బెంగుళూరు విమానాశ్రయం నుండి వైమానిక దళ హెలికాఫ్టర్ లో మధ్యాహ్నం 12.10 గంటలకు మదనపల్లెలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు. రోడ్డు మార్గాన ఆశ్రమం చేరుకుని మధ్యాహ్నం 12.30 గంటల నుండి సత్సంగ్ ఆశ్రమం శంఖుస్థాపన, భారత్ యోగా విద్యా కేంద్రం ప్రారంభం, సత్ సంఘ్ విద్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం, ఆసుపత్రికి శంకుస్థాపన కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు ఆశ్రమం నుండి మదనపల్లె హెలిప్యాడ్ చేరుకుని సదుం మండలం లోపి పీపుల్ గ్రూవ్ స్కూల్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నకు మధ్యాహ్నం 3.40 గంటలకు చేరుకుని స్కూల్ ఆవరణంలో మొక్కలు నాటి, ఆడిటోరియం లో ఉపాధ్యయులు, మరియు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.
సాయంత్రం తిరిగి బెంగుళూరుకు!
పర్యటన అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్(RamNath Kovind) సాయంత్రం 4.50 గంటలకు అక్కడి నుండి హెలికాఫ్టర్ లో బెంగుళూరు తిరుగు ప్రయాణం కానున్నారని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. అయితే రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హెలికాఫ్టర్‌లో చిప్పిలి హెలిప్యాడ్ కు 11.15 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుండి ఆశ్రమం చేరుకుని రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. వారితో పాటు కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం 5 గంటలకు హెలిప్యాడ్ నుండి గన్నవరం తిరుగు ప్రయాణం కానున్నారు.


సీఎం వై.ఎస్ జగన్ పర్యటన
రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి ఉదయం 11.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హెలికాఫ్టర్‌లో చిప్పిలి హెలిప్యాడ్ కు 11.45 గంటలకు చేరుకుంటారు. మనదపల్లె బి.టి కళాశాలలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్(RamNath Kovind) కు స్వాగతం పలుకుతారు. అనంతరం చిప్పిలి హెలిప్యాడ్ నుండి మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని మధ్యాహ్నం 1.05 గంటలకు గన్నవరం తిరుగు ప్రయాణం కానున్నారని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.
ఇది చదవండి:యూనివర్శిటీ వైస్ చాన్సలర్ పోస్టులను భర్తీ చేయాండి: గవర్నర్
ఇది చదవండి:తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్
ఇది చదవండి:నందిగామ నియోజకవర్గంలో టిడిపి ఖాతాలోకి గోకరాజుపల్లి
ఇది చదవండి:భవనంపై నుంచి పసిపాపతో దూకి తల్లి ఆత్మహత్య
ఇది చదవండి:మొట్ట మొదటి సారి మెట్రోలో గుండె తరలింపు!
ఇది చదవండి: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ (మెడిక్లాసిక్) పాలసీ గురించి తెలుసుకోండి!
ఇది చదవండి: టిడిపి నేత పట్టాభిపై కారుదాడి, గాయాలు
ఇది చదవండి: అచ్చెన్నాయుడు అరెస్టు | నిమ్మాడలో ఉద్రిక్తత