Ramnath kovind speech న్యూఢిల్లీ: భారతదేశంలో మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. బుధవారం దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జాతిని ఉద్దేశించి వారు మంగళవారం అర్థరాత్రి(బుధవారం) దేశ ప్రజలను ఉద్దేశించి(Ramnath kovind speech) ప్రసంగించారు.
వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలి!
దేశం కోసం ఎంతో మంది స్వాంతంత్య్ర సమర యోధుల పోరాటాన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరం గుర్తు చేసుకోవాలన్నారు. మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని కొనియాడారు. రిపబ్లిక్ డే దినోత్సవం జరుపుకోవడం మన ఐక్యతకు నిదర్శమని అన్నారు. సరికొత్త ఆర్థిక విధానాలు చేపట్టిన టాప్-50 దేశాల జాబితాలో భారత్ చోటు సంపాదించుకోవడం గర్వకారణమని తెలిపారు. ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోందన్నారు. దీనికి సంబంధించిన ప్రోటోకాల్స్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రతిఒక్కరూ కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
డాక్టర్లు, హెల్త్ వర్కర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ రోగులను రక్షించిన విషయాన్ని స్మరించుకోవాలని సూచించారు. కోవిడ్ మహమ్మారి వచ్చిన తొలి ఏడాదిలోనే మన హెల్త్ కేర్ సిస్టమ్‌ను బలోపేతం చేసుకోవడమే కాకుండా, ఆ మరుసటి ఏడాది వ్యాక్సిన్ డ్రైవ్‌ను విజయవంతం చేయడం మన బలానికి సంకేతం అని రాష్ట్రపతి తన ప్రసంగంలో తెలిపారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!