Ram Pothineni: హీరో రామ్ కు ఇలాంటి క‌ళ‌లు కూడా ఉన్నాయా!

Ram Pothineni | Tollywood హీరో రామ్ పోతినేని ఒక ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఎప్పుడూ హీరో పాత్ర‌లోనే కాకుండా ఇప్పుడు hair style fashion చేసే డిజైన‌ర్గా మారిన‌ట్టు తెలుస్తోంది. కాక‌పోతే నిజంగా కాదండోయ్‌. కేవ‌లం కొద్ది నిమిషాలు పాత్ర‌మే అలా చేశారు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కుంటూ గుర్తింపు తెచ్చుకొని యువ‌ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న హీరో రామ్ ఇప్పుడు THE Warrior మూవీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ప‌నులు న‌డుస్తున్నాయి.

ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ అయిన Shekar Master త‌ల‌కు ఒక fashion సెలూన్‌లో హీరో రామ్(Ram Pothineni) స్ప్రే చేస్తూ క‌నిపించాడు. శేఖ‌ర్ మాస్టార్ ది వారియ‌ర్ సినిమాలో కొరయోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల ఒక సాంగ్ కూడా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా కొద్ది నిమిషాలు హీరో రామ్ శేఖ‌ర్ మాస్టార్ త‌ల‌కు స్ప్రే కొడుతూ కాస్త స్టైలీష్‌గా తయారు చేశారు. హీరో రామ్ చేస్తున్న పనిని అక్క‌డే ఉన్న హీరోయిన్ Krithi Shetty చూస్తూ ఉండిపోయింది.

Ram Pothineni

మొత్తంగా Warrior మూవీలో హీరో రామ్ పోతినేని ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్లుగా కీర్తి శెట్టి, అక్ష‌ర గౌడ న‌టిస్తున్నారు. హీరో ఆది పినిశెట్టి, న‌దియా కూడా న‌టిస్తున్నారు. డైరెక్ట‌ర్ ఎన్‌.Linguసామి ఆధ్వ‌ర్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా జూలై 14, 2022న ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *