Ram Charan Help: తండ్రికి మించి సేవా గుణం కొడుకు ఉండ‌టం గ‌ర్వ‌కార‌ణం!

movie news

Ram Charan Help | మెగ‌స్టార్ హీరో చిరంజీవి వార‌సుడిగా సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు రామ్‌చ‌ర‌ణ్‌. అన‌తి కాలంలోని వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతూ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక స్టార్ ఇమేజ్‌ను సంపాదించారు. కొద్ది సేపు సినిమా రంగాన్ని ప‌క్క‌న పెడితే రామ్‌చ‌ర‌ణ్‌కు త‌న తండ్రి చిరంజీవిలాగే సేవాదృక్ప‌థంతో మంచి మ‌న‌సును క‌లిగి ఉన్నారు. త‌న తండ్రి ప్రారంభించిన చిరంజీవి సేవా ట్ర‌స్ట్ ద్వారా రామ్‌చ‌ర‌ణ్ ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఆప‌ద కాలంలో ఓ సినిమా వ్య‌క్తిని స‌హాయం చేసి ఆదుకున్నారు చ‌ర‌ణ్‌.

Ram Charan Help

ప్ర‌ముఖ న‌టుడు క‌దాంబ‌రి కిర‌ణ్ స్వ‌యంగా ఈ విష‌యాన్నితాజాగా బ‌య‌ట పెట్టారు. చ‌ర‌ణ్ మంచి త‌నాన్ని తెలియ‌జేస్తూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ట్విట‌ర్‌లో క‌దాంబ‌రి కిర‌ణ్ ఇలా రాశారు. మ‌న‌కు తెలిసి రామ్‌చ‌ర‌ణ్ మెగ‌స్టార్ చిరంజీవి కొడుకు స్టార్ హీరోనే. కానీ చ‌ర‌ణ్ పెద్ద మ‌న‌సున్న వ్య‌క్తి. ఆ వ్య‌క్తికి భ‌క్తి, ప్రేమ‌, గౌర‌వం ఇలాంటివి చ‌ర‌ణ్లో నిండుగా ఉన్నాయి. అని రాశారు. నిజంగా చ‌ర‌ణ్‌ది సాటి మ‌నిషికి స‌హాయం చేసే వ్య‌క్తిత్వం గ‌ల‌వారు. గ‌తంలో ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ భార్య చ‌నిపోతే ఖ‌ర్చుల‌కు డైరెక్ట‌ర్ సుకుమార్ చొర‌వ‌తో చ‌ర‌ణ్‌ను అడిగితే రూ.2 ల‌క్ష‌లు ఇచ్చారంట‌. ఈ డ‌బ్బుతో మ‌నం సైతం కాదంబ‌రి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేశారు.

ఇలా మ‌రికొంత మంది వ‌ద్ద నుంచి రూ.1 ల‌క్షా 20 వేలు సేక‌రించి ఆ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కూతురు పేరుమీద ఫిక్స‌డ్ డిపాజిట్ చేశామ‌ని క‌దాంబ‌రి కిర‌ణ్ అన్నారు. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగిన చాలా రోజుల త‌ర్వాత నేను రామ్‌చ‌ర‌ణ్‌కు ఎదురు ప‌డ్డాన‌ని, క‌దాంబ‌రి గారు ఆ పాప ఎలా ఉంది? అని అడిగారంట‌. అలా అడ‌గ‌డంతో నా మ‌న‌స్సు నిండిపోయింద‌ని కిర‌ణ్ సంతోషం వ్య‌క్తం చేశారు. గోల్డెన్ స్పూన్‌తో పుట్ట‌డం వేరు, బంగారు మ‌న‌సుతో పుట్ట‌డం వేర‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా ప్రియ‌మైన చ‌ర‌ణ్ నీకు భ‌గ‌వంతుడు ఆశిస్సులు అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టును ప్ర‌ముఖ న‌టుడు శివాజీ కూడా షేర్ చేశారు.

రామ్‌చ‌ర‌ణ్

మంచి మ‌న‌సున్న‌ హీరో!

ప్ర‌స్తుతం ఈ పోస్టు వైర‌ల్ అయ్యింది. చెర్రీ మంచి మ‌న‌సును ప్ర‌శంసిస్తూ అభిమానులు, నెటిజ‌న్లు కామెంట్ల చేస్తున్నారు. మ‌రో సంఘ‌ట‌న‌లో కూడా రామ్‌చ‌ర‌ణ్ త‌న మంచి మ‌న‌సును చాటుకున్నారు. ర‌స్టీ అనే ఉక్రెయిన్ వ్య‌క్తికి డ‌బ్బులు, మందులు, స‌రుకులు పంపించారు రామ్‌చ‌ర‌ణ్. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ న‌టించిన ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ గ‌తంలో ఉక్రెయిన్‌లో జ‌రిగింది. ఆ స‌మ‌యంలో చ‌ర‌ణ్‌కు ర‌స్టీ బాడీగార్డుగా ఉన్నారు. ర‌ష్యా చేస్తున్న యుద్ధం వ‌ల్ల ఉక్రెయిన్‌లో ప్ర‌జ‌ల ప‌రిస్థితులు దారుణంగా మారాయి. ఆ స‌మ‌యంలో చ‌ర‌ణ్ ర‌స్టీకి ఫోన్ చేసి యోగ‌క్షేమాలు తెలుసుకున్నారు. ర‌స్టీ తండ్రి 80 సంవ‌త్స‌రాల వ‌య‌సులో తుపాకీ ప‌ట్టుకుని యుద్దానికి వెళ్ల‌డం చ‌ర‌ణ్ మ‌న‌సును క‌లిచి వేసింది.

వెంట‌నే ర‌స్టీ ప‌రిస్థితి తెలుసుకొని వారికి డ‌బ్బులు పంపించారు. ఆ డ‌బ్బుల‌తో ర‌స్టీ అత్య‌వ‌స‌ర‌మైన మందులు, స‌రుకులు కొనుక్కున్నాడు. అంతే కాకుండా త‌న‌కు డ‌బ్బు పంపించిన రామ్‌చ‌ర‌ణ్ ప‌ట్ల ప్రేమ‌ను, అభిమానాన్ని చూపుతూ థ్యాక్స్ సార్ అంటూ ర‌స్టీ ఓ వీడియో పోస్టు చేశారు. ఈ మ‌ధ్య కాలంలో RRR సినిమా షూటింగ్ స‌మ‌యంలో టెక్నిక‌ల్ సిబ్బందిని రామ్‌చ‌ర‌ణ్ త‌న ఇంటికి ఆహ్వానించి వారితో అల్పాహారం కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. అలా వారితో కొద్దిసేపు ముచ్చ‌టించి వారికి ఒక్కొక్క‌రికి ఒక్కో తులం గోల్డ్ కాయ‌న్‌ను గిఫ్ట్‌గా అందించార‌ట‌. ఎంతైనా మెగాహీరోల్లో సేవాదృక్ప‌థం ఉండ‌టం దానిని కొన‌సాగించ‌డం తో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *