Rajanikanth latest news: Rajanikanth announces he will not start a political partyఅభిమానులూ క్ష‌మించండి: ర‌జ‌నీకాంత్‌

Rajanikanth latest news: Rajanikanth announces

Rajanikanth latest news: Rajanikanth announces he will not start a political partyఅభిమానులూ క్ష‌మించండి: ర‌జ‌నీకాంత్‌ Chennai : సూప‌ర్ స్టార్ త‌మిళ త‌లైవా ర‌జ‌నీకాంత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం కోలుకున్న‌ప్ప‌టికీ వ‌య‌స్సు రిత్యా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల త‌మిళ‌నాడులో కొత్త పార్టీ పెట్టేందుకు స‌న్న‌హాలు చేశారు. అయితే అనారోగ్య స‌మ‌స్య వ‌ల్ల ప్ర‌స్తుతానికి పార్టీ పెట్ట‌డం లేద‌ని, త‌న‌ను అభిమానులు క్ష‌మించాల‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో కోరారు. ఈ సంద‌ర్భంగా అధికారికంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా మూడు పేజీల లేఖను విడుద‌ల చేశారు ర‌జ‌నీకాంత్‌. రాజ‌కీయాల్లోకి తాను త‌ప్పకుండా వ‌స్తాన‌ని, ప్ర‌స్తుతం అనారోగ్యంతో ఇబ్బంది ప‌డ‌టం వ‌ల్ల పార్టీ ఏర్పాటు నిర్ణ‌యం ర‌ద్దు చేసిన‌ట్టు తెలిపారు.

ఆత్మీయులు, కుటుంబ స‌భ్యులు సూచ‌న మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు. రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా ప్ర‌జా సేవ‌లో ఉంటాన‌ని అభిమానుల‌కు తెలిపారు. తాను తీసుకున్న నిర్ణ‌యం అభిమానుల‌ను నిరాశ ప‌రిచి ఉంటే క్షమించాల‌ని కోరారు.

పార్టీ పేరుపై అభిమానుల సంబ‌రాలు

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ త‌మిళ సినిమా రంగంలో త‌న‌కుంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. త‌మిళ‌నాడుతో పాటు దేశ‌వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు అధిక సంఖ్య‌లో ఉన్నారు. ఇప్ప‌టికే సినిమా రంగం నుంచి ఎంతోమంది అగ్ర‌హీరోలు, హీరోయిన్లు రాజ‌కీయ అర‌గ్రేటం చేశారు. ఈ నేప‌థ్యంలో త‌మ అభిమాన హీరో ర‌జ‌నీకాంత్ కూడా రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని ఏళ్ల త‌ర‌బ‌డి అభిమానులు ఎదురు చూశారు.

అదే విధంగా గ‌త కొద్ది రోజుల క్రితం పార్టీ పెడుతున్న‌ట్టు అభిమాన సంఘాల‌తో, సన్నిహితుల‌తో తెలియ‌జేయ‌డంతో పాటు స‌మావేశాలు నిర్వ‌హించారు. ఈ ఏడాది డిసెంబ‌ర్ 31న కొత్త పార్టీని ఆవిష్క‌రిస్తున్న‌ట్టు ర‌జ‌నీకాంత్ తెలియ‌జేశారు.

పార్టీ ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పిన కొద్ది రోజుల‌కే ఎన్నిక‌ల సంఘంలో ‘మ‌క్క‌ల్ సేవై క‌ట్చి’ అనే పేరుతో పార్టీ పేరు న‌మోదైన‌ట్టు , ఎన్నిక‌ల గుర్తు ఆటోను కేటాయించిన‌ట్టు వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అదే విధంగా రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మిళ నాట ర‌జ‌నీకాంత్ పార్టీ అన్ని స్థానాల్లోపోటీ చేస్తుంద‌ని అంద‌రూ ఎదురు చూశారు.

ఈ నిర్ణ‌యం తీసుకున్న కొద్ది రోజుల‌కే ర‌జ‌నీకాంత్ అనారోగ్యానికి గుర‌య్యారు. అన్నాత్తై షూటింగ్ నిమిత్తం కొద్ది రోజుల క్రితం ర‌జ‌నీ కాంత్ హైద‌రాబాద్‌కు వ‌చ్చారు.

షూటింగ్ స‌మ‌యంలోనే బి.పి త‌గ్గ‌డంతో ఆసుప‌త్రిలో చేరారు. గ‌త‌వారం డిశ్చార్జ్ అయ్యి త‌మిళ‌నాడు చేరుకున్నారు. ప్ర‌స్తుతం పార్టీ ఆలోచ‌న‌ను తాత్కాలికంగా విర‌మించుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

చ‌ద‌వండి :  kidnapping case: క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి బంధువు కిడ్నాప్‌

పొలిటిక‌ల్ వ‌ద్దు నాన్నా: కూతుళ్లు

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై కొద్ది రోజులుగా సాగుతున్న సందిగ్థ‌త పై నేడు ప్ర‌క‌ట‌న చేశారు. అయితే ఇటీవ‌ల అనారోగ్య స‌మ‌స్య‌తో ఆసుప‌త్రికి చేరి డిశ్చార్జి అయిన త‌ర్వాత ఇంటికి చేరుకున్నారు.

రాజ‌కీయాలు అనే మాట త‌న జీవితంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాన‌సిక ఒత్తిళ్లు పెర‌గ‌డంతో త‌న కూతుళ్లు రాజ‌కీయాలు వ‌ద్ద‌ని వాపోయార‌ని, ఈ నేప‌థ్యంలోనే రాజకీయాల‌కు దూరంగా ఉంటుంన్న‌ట్టు స‌మాచారం. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు వృద్ధాప్య కార‌ణాల వ‌ల్ల వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యుల‌కు ఆయ‌ను సూచించిన‌ట్టు తెలుస్తోంది.

Rajanikanth latest news: Rajanikanth announces

శారీర‌క శ్ర‌మ‌తో పాటు మాన‌సికంగా ఒత్తిడికి గుర‌య్యే ప‌నుల‌కు దూరంగా ఉండాల‌ని వైద్యులు సూచించారు. ప్ర‌స్తుతం క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ అన్ని కార్య‌క్ర‌మాల‌ను ర‌ద్దు చేసుకొని ఇంటి వ‌ద్ద‌నే ఉంటున్నారు. ర‌జ‌నీ న‌టిస్తున్న కొత్త చిత్రం అన్నాత్తే కోసం ఆయ‌న అహ‌ర్నిశ‌లు ప‌నిచేస్తున్న‌ట్టు చిత్ర బృందం చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో కొన్ని రోజుల పాటు పార్టీ నిర్ణ‌యం వాయిదా వేస్తారో లేదా మ‌ళ్లీ పార్టీ పెడ‌తార‌ని చెబుతారా? అనేది అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *