Rajamahendravaram: Rowdy sheeter brutally murdered in Rajamahendravaram :రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో  రౌడీ షీట‌ర్ దారుణ హ‌త్య‌

Spread the love
‌Rajamahendravaram: Rowdy sheeter brutally murdered in Rajamahendravaram :రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో  రౌడీ షీట‌ర్ దారుణ హ‌త్య‌Rajamahendravaram: రాజ‌మ‌ హేంద్ర‌వ‌రంలో దారుణ హ‌త్య చోటు చేసుకుంది.  పాత క‌క్ష‌ల నేప‌థ్యంలో ఓ రౌడీ షీట‌ర్ అతికిరాత‌కంగా హ‌త్య‌చేయ‌బ‌డ్డాడు. ఈ సంఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం రేపుతోంది. రాజ‌మహేంద్ర‌వ‌రం మూడో ప‌ట్ట‌ణ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని శ‌నివారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఆదెమ్మ దిబ్బ బి- బ్లాక్ ప్రాంతానికి చెందిన రౌడీషీట‌ర్ కంచిపాటి స‌తీష్‌(25) కు అదే ప్రాంతంలోని ఈ- బ్లాక్ కు చెందిన మ‌రో రౌడీ షీట‌ర్ దుర్గ ప్ర‌సాద్ అలియాస్ బుద్ధ వ‌ర్గానికి శుక్ర‌వారం రాత్రి ఓ ద్విచ‌క్ర‌వాహ‌నం విష‌యంలో వివాదం త‌లెత్తింది.
Rowdy sheeter murdered
ఈ నేప‌థ్యంలో శ‌నివారం రాత్రి ఇంట్లో ఉన్న కంచిపాటి స‌తీష్ ను బ‌య‌ట‌కు పిలిచి స్థానిక వీధిలో దుర్గ‌ప్ర‌సాద్‌, పండు, పోతురాజు వీర‌బాబు, సాయి మ‌రో వ్యక్తి క‌లిసి క‌త్తుల‌తో విచక్ష‌ణ ర‌హితంగా 30 చోట్ల పొడిచి దారుణంగా హ‌త్య చేవారు. తీవ్రంగా గాయ‌ప‌డిన స‌తీష్ ఘ‌ట‌న స్థ‌లంలోనే మృతి చెందాడు. స్థానికులు నుంచి స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించి మృత‌దేహాన్ని ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. 

బ్లేడ్ బ్యాచ్ ప‌నే!

రౌడీ షీట‌ర్ హ‌త్య‌తో ఆ ప్రాంతం ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న చెందింది. ఈ ఘ‌ట‌న పాత క‌క్ష‌ల నేప‌థ్యంలోనే జ‌రిగింద‌ని పోలీసులు భావిస్తున్నారు. హ‌త్య చేసిన ఆరుగురు వ్య‌క్తులు స్థానికంగా బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన వారేన‌ని పోలీసులు చెబుతున్నారు. మృతుడి కుటుంబ స‌భ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు. అదే విధంగా మృతుడు జేబులో కూడా ఒక చాకు ఉండ‌టాన్ని పోలీసులు గుర్తించారు. 
Kurnool News: కర్నూల్ జిల్లాలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం

Kurnool News: క‌ర్నూల్ జిల్లా కౌతాళం మండ‌ల ప‌రిధిలోని కామవ‌రం గ్రామంలో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఓ భూవివాదంలో వైసీపీ, బిజేపీ వ‌ర్గీయులు ప‌ర‌స్ప‌రం దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. Read more

Thota Chandraiah Murder: ఏక‌ద‌శి రోజున‌ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ర‌క్తంతో ఎగిసిప‌డ్డ వేట‌కొడ‌వ‌ళ్లు!

Thota Chandraiah Murder: మాచ‌ర్ల: పండుగ వేళ ఏపీలో రాజ‌కీయ హ‌త్య చోటు చేసుకోవ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. గుంటూరు జిల్లాలోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి నేత Read more

teacher murderd: క‌దిరిలో బ‌రితెగించిన దొంగ‌లు..ఉపాధ్యాయురాలు హ‌త్య‌

teacher murderd: అనంత‌పురం: క‌దిరిలో దొంగ‌ల బీభ‌త్సం అక్క‌డ ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. ఓ ఇంట్లోకి ప్ర‌వేశించి ఓ ఉపాధ్యాయురాల‌ని చంపారు దుండ‌గులు. క‌దిరి ప‌ట్ట‌ణంలోని మంగ‌ళ‌వారం Read more

Engineering Student Murdered:ఎట్ట‌కేల‌కు నిందితుడు దొరికాడు..పోలీసుల‌ను చూసి బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మ‌హ‌త్య‌య‌త్నంకు ప్ర‌య‌త్నం!

Engineering Student Murdered:గుంటూరులో బి.టెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య కేసులో నిందితున్ని అరెస్టు చేసిన‌ట్టు డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ అన్నారు. హ‌త్య జ‌రిగిన 24 గంట‌ల్లోపే గుంటూరు Read more

Leave a Comment

Your email address will not be published.