Rain Alert: అమరావతి: రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ గాలుల కారణంగా రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు(Rain Alert) కురిసే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల, రాయలసీమలో చాలా చోట్ల వర్షాలకు ఆసారం ఉందని తెలిపింది.
ఉత్తర, దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ప్రకాశం, తూర్పుగోదావరి, విశాఖ, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని వాతావారణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతమిది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలియజేసింది.
మరోవైపు పశ్చిమ గాలులు కారణంగా రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల, రాయలసీమలో చాలాచోట్ల వర్షాలకు ఆస్కారం ఉందని తెలియజేసింది.
ప్రత్యేకించి నెల్లూరు, ప్రకాశం, తూర్పు, పశ్చిమగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
- MLA Seethakka: తెలంగాణలో నీళ్లేవూ..నిధులూ లేవూ!
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!