Rahul Bajaj Dead:బ‌జాజ్ గ్రూపు అధినేత రాహుల్ బ‌జాజ్ మృతి

Rahul Bajaj Dead: భార‌త దేశ ప్ర‌ముఖ దిగ్గ‌జ వ్యాపార వేత్త బ‌జాజ్ ఆటో మాజీ ఛైర్మ‌న్ రాహుల్ బ‌జాజ్ శ‌నివారం మృతి చెందారు. 83 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఆయ‌న ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుండ‌గా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాహుల్ బ‌జాజ్ మ‌ర‌ణ వార్త‌ను బ‌జాజ్ గ్రూప్ అధికారికంగా తెలిపింది. కొంత కాలంగా న్యూమోనియా తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస వ‌దిలారు. 1972 సంవ‌త్స‌రంలో రాహుల్ బ‌జాజ్ బ‌జాజ్ గ్రూపు బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. 5 ద‌శాబ్ధాల పాటు బ‌జాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీల‌తో మంచి అనుబంధం ఉంది. దేశంలోని అత్యంత ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌ల్లో రాహుల్ బ‌జాజ్ (Rahul Bajaj Dead)ఒకరు.

సంస్థ అగ్ర‌స్థానం వెనుక రాహుల్ కృషి

బ‌జాజ్ ఆటో సంస్థ ఇప్ప‌టి వ‌ర‌కు టూ వీల‌ర్స్ మ‌రియు త్రీ వీల‌ర్స్ రంగంలో అనేక కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. సంస్థ అగ్ర స్థానానికి రాహుల్ ఎంతో కృషి చేశారు. రాజ‌కీయంలో కొన్నాళ్ల పాటు కొన‌సాగారు. 2006 నుంచి 2010 వ‌ర‌కు రాజ్య స‌భ స‌భ్యుడిగా రాహుల్ బ‌జాజ్ ప‌నిచేసి విశేష సేవ‌లందించారు. 1938 సంవ‌త్స‌రంలో జూన్ 10 న జ‌న్మించిన ఆయ‌న ఎక‌నామిక్స్ తో పాటు లాలో డిగ్రీ చేశారు. అంతే కాకుండా హోవార్డు యూనివ‌ర్శిటీ నుండి ఎంబీఏలో ప‌ట్టా పొందారు. దేశానికి ఆయ‌న సేవ‌ల‌ను గుర్తించిన ప్ర‌భుత్వం రాహుల్ బ‌జాజ్‌ను 2001లో ప‌ద్మ‌భూష‌న్ అవార్డుతో స‌త్క‌రించింది. 2021లో బ‌జాజ్ ఆటో ఛైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేశారాయ‌న‌. ప్ర‌స్తుతం సంస్థ‌కు నీర‌జ్ బ‌జాజ్ ఛైర్మ‌న్‌గా కొన‌సాగుతున్నారు. రాహుల్ బ‌జాజ్ మృతి ప‌ట్ల ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు, దేశ నాయ‌కులు నివాళులు ప్ర‌క‌టిస్తున్నారు.

Share link

Leave a Comment