Ragi Halwa Recipe: శరీరానికి శక్తితో పాటు మంచి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడే ఆహారంలో రాగులది ప్రత్యేక పాత్ర ఉంది. రోజూ రాగులతో వండిన ఆహారం ఏదైనా రోజూ తీసుకుంటే వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అనడానికి కారణం మన పెద్దవారు అని చెప్పవచ్చు. రాగుల వాడకం ఒక్కప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భాగా ఉండేది. రాయలసీమలో ఇప్పటికీ రాగి ముద్దలు తింటున్న స్థానికులను మనం చూడవచ్చు. కాల క్రమేపీ ఫ్యాషన్ ఆహారానికి అలవాటు పడి రాగులను తినడం మానేసి అనేక రసాయనాలతో తయారు చేసిన క్రీములు రాసిన స్వీట్లను మనం తింటున్నాం. కల్తీ ఆహారం తింటున్నాం. కానీ రాగులకు ఉన్న ప్రాధాన్యత డాక్టర్లు ఎప్పటికప్పుడు రోగులకు చెబుతూనే ఉంటారు. అలాంటి అద్భుతమైన ఆహారంలో భాగంగా రాగుల హల్వా (Ragi Halwa Recipe)ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం!.
Ragi Halwa Recipe:రాగి హల్వా తయారీ
కావాల్సినవి!
రాగులు – ఒక కప్పు,
బెల్లం – అర కప్పు,
కొబ్బరి తురుము – మూడు టేబుల్ స్పూన్లు,
యాలకుల పొడి – ఒక టీస్పూను,
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్,
ఉప్పు – చిటికెడు,
తయారీ విధానం!
రాగుల్ని రెండు మూడు గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి. పైన చెప్పిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని పలుచటి బట్టలో వేసి పిండితే పాలు వస్తాయి. ఈ పాలను మందమైన వెడల్పాంటి గిన్నెలో పోసి మిశ్రమం కాస్త గట్టి పడేవరకూ గరిటెతో తిప్పాలి. తరువాత నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. హల్వా రూపాన్ని సంతరించుకున్న తరువాత స్టవ్ మీద నుంచి దించి నెయ్యి లేదా నూనె రాసి పళ్లెంలో ఈ మిశ్రమాన్ని పోయాలి. ఆ తరువాత మీకు నచ్చిన ఆకారంలో కోసుకోవాలి.