Radhamma Bangaru Bomma mp3 song | PM Creation tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొద్ది రోజుల కిందట విడుదలై సంచలన విజయం సాధించి ఇప్పటికే 2 మిలియన్స్ దాటి ప్రేక్షకులు చూసిన పాట రాధమ్మ బంగారు బొమ్మ. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ప్రేక్షుల ఆదరణ పొంది ఎక్కువ మంది చూస్తున్న తెలంగాణ ఫోక్ సాంగ్స్‌లో టాప్ 10 పాటల్లో ఒకటిగా నిలిచింది. లిరిక్స్, యాక్టర్, డైరెక్టర్ గా Parvathi mahesh ఆధ్వర్యంలో వచ్చిన ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ పాటను యూట్యూబ్‌లో చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు.
రాధమ్మ బంగారు బొమ్మ సాంగ్‌ను సంజన, బొడ్డు దిలీప్ కుమార్ చాలా అద్భుతంగా పాడారు. ప్రవీణ్ కాయితోజ్ అందించిన మ్యూజిక్ బాగుంది. ఈ పాటలో విష్ణుప్రియ(Vishwapriya) తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పవచ్చు. చాలా సింపుల్‌గా స్మూత్‌గా సాగే ఈ వీడియో సాంగ్‌లో మహేష్, విష్ణుప్రియ రెడ్ డ్రెస్‌లో చాలా అట్రాక్షన్‌గా కనిపిస్తారు. సినిమా లెవల్లో హీరోయిన్ ఎంట్రీ ఎలా ఉంటుందో అదే విధంగా మహేష్ డైరెక్షన్లో హీరోయిన్ ఎంట్రీని అంత అందంగా చూపించారు. కొత్త కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తూ వారి టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు.
ఈ పాటలో హీరో మహేష్ చాలా హుందాగా కనిపించారు. అడిగిన వారికి సహాయం చేస్తూ తన పాత్రలో హీరోయిజానికి పూర్తి న్యాయం చేశారు. ఈ పాట చిత్రీకరణ డ్రోన్లతో తీశారు. సాంగ్‌లో ప్రతి ఒక్కరూ చాలా స్పష్టంగా కనిపించేలా పాటకు తగ్గట్టుగా పాత్రలను ఎంచుకున్నారు. పాటకు రిథమ్స్ డిజె శ్రీకాంత్ చీకటిమామిడి కావాల్సినంత మేరకు చాలా స్పష్టంగా అందించారు. తెలంగాణ పాటలంటే లెవల్ వేరే విధంగా ఉంటుంది. అందులోనూ దేశంలో ఉన్న జానపద సాంగ్స్‌లో ఎక్కువుగా తెలంగాణ ఫోక్ సాంగ్స్‌నే ఇష్టపడుతుంటారు. ఇప్పుడు సినిమా పాటల రేంజ్లో తెలంగాణ జానపద పాటలు సూపర్ హిట్‌గా నిలిచి ఎవర్‌గ్రీన్‌గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతున్నాయి.
ఈ పాటను విన్న ప్రతి ఒక్కరూ మళ్లీ మళ్లీ వినేలా ఉందని పాట చాలా అద్భుతంగా రాశారని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పార్వతి మహేష్ డైరెక్షన్లో వచ్చిన ఈ పాట ద్వారా మహేష్‌కు మరింత ఆదరణ పెరిగిందని చెప్పవచ్చు. నాయిదోరో మరియు రాజమణి పాటల తర్వాత మహేష్ కి మరింత ఫాలోయింగ్ పెంచిన సాంగ్ ఇది కూడా నిలుస్తుందని ఫాలోవర్స్ అభిమానాన్ని చాటుతున్నారు. మీరు కూడా ఈ పాటను వీడియో సాంగ్ తప్పకుండా చూడండి. కింద లింక్ ఇస్తాము.
Radhamma Bangaru Bomma mp3 song
Lyrics – Actor – Direction: Parvathi Mahesh
Tune Source & Singer: Sanjana M
Male Singer: Boddu Dilipkumar
Music: Praveen kaithoju
Dop – Editing – DI: Shiva velpula
Rythems: Dj srikanth chikatimamidi
Actor: Vishwapriya
Makeup: Kiran
Drone: Suresh
Ast Camera: Nithish Maraveni
Ast Editing: Ram Krishna D
girls: Bindhu, Annapurna
Special Thanks: Prashanth Prashu, Ajay Singarapu, Dileep Kanna, Ramesh Devulapally, Naresh Badanakal, Ranjith P, Narshimulu, K.Manohar, Sajid, Bhoopathi, Ashok, Prashanth Gaddam, Naveen, Dj Vijay, Narshimulu.
Technical Support: OM WINGS PVT. LTD { #omwings www.omwings.in }
FOLLOW US ON INSTAGRAM
PARVATHI MAHESH: PH NO. 81437 38414
INSTA: https://www.instagram.com/reel/Ca8zWk.
ఈ పాట వీడియో కోసం లింక్‌ను క్లిక్ చేయండి!