R-Value | కరోనా వ్యాప్తిలో కీలకమైన రీప్రొడెక్టివ్ వాల్యూ (R వ్యాల్యూ) మరోసారి దేశాన్ని భయపెడుతోంది. 3నెలల్లో తొలిసారి R-Value 1 దాటింది. ఇది ఒకటి దాటితే ప్రమాద ఘంటికలు మోగినట్టేననట్టు తెలుస్తోంది. ఇది 1గా ఉంటే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నట్లు భావిస్తున్నారు. ఏప్రిల్ 5-11 మధ్య 0.93 గా ఉన్న ఈ వ్యాల్యూ, ఈ నెల 12-18 నాటికి 1.07 చేరినట్టు శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో దేశంలో నాల్గో వేవ్ పై అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీలో కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. Delhi పరిధిలో ప్రజలు Mask ధరించడం తప్పనిసరి చేసింది. లేదంటే రూ.500 జరిమానా విధించనున్నట్టు తెలిపింది. పాఠశాలలను మూసివేయకూడదని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 7.72 శాతానికి చేరింది.
Covid-19: డేంజర్ బెల్స్
దేశంలో కరోనా మళ్లీ విస్తరిస్తోంది. నిన్న 1,247 కేసులు నమోదయ్యాయి. కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,067 కేసులు బయటపడ్డాయి. ఇక నిన్న దేశవ్యాప్తంగా ఒక కరోనా మరణం వెలుగు చూడగా, తాజాగా 40 మంది మరణించడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. కొత్తగా 1,547 మంది వైరస్ నుంచి కోలుకోగా, ప్రస్తుతం 12,340 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుదలతో ఇప్పటికే కేంద్రం, రాష్ట్రాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు రాష్ట్రాలకు కేంద్రం గైడ్‌లైన్స్ జారీ చేసింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, మిజోరం రాష్ట్రాలకు లేఖ రాసింది. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ఆందోళన కలిగించే ప్రాంతాల్లో అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, భారీ మొత్తంలో పరీక్షలు చేయాలని సూచించింది.
వెంటాడుతోన్న లాంగ్ కోవిడ్ లక్షణాలు
కోవిడ్ సోకిన బాధితుల్లో 30 శాతం మందిని long covid symptoms వెంటాడుతున్నాయని అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ పరిశోధనలో తేలింది. వైరస్(Virus) సోకి ఆసుపత్రి పాలైనవారితో పాటు షుగర్, అధిక బరువు ఉండి కోవిడ్ బారినపడ్డ వారిలో ఈ లక్షణాలు అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. లాంగ్ కోవిడ్‌తో అలసట, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది కలగడం, వాసన గుర్తించకపోవడం వంటి సమస్యలు ఉంటాయట. మరో వైపు త్రిపురలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. సెపాహిజాలా జిల్లా దేవిపూర్‌లో ఓ పందుల ఫామ్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసులు గుర్తించారు. ఫ్లూ బారిన పడి 63 పందులు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. త్రిపుర ప్రభుత్వం ప్లూ నియంత్రణకు పందులను వధించాలని ఆదేశించింది.చంపిన పందులను 8 అడుగుల లోతైన గుంతలో పూడ్చాలని సూచించింది. మిజోరాం తర్వాత త్రిపురలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ