Queen Elizabeth II Funeral: రాణి అంత్య‌క్రియ‌లు ఈ నెల 19..మ‌రి జ‌రుగుతున్నవేంట‌వి?

Queen Elizabeth II Funeral: ప్ర‌పంచ‌పు రాణి క్వీన్ ఎలిజిబెత్ 2 అంత్య‌క్రియ‌లు సెప్టెంబ‌ర్ 19న లండ‌న్‌లోని వెస్ట్‌మినిస్ట‌ర్ అబేలో జ‌ర‌గ‌బోతున్నాయి. దానికంటే ముందుగా ప్ర‌జ‌లు, అభిమానుల సందర్శ‌నార్థం రాణి పార్థివ దేహాన్ని ఎడిన్‌బ‌రాతో పాటు లండ‌న్‌లో ఉంచు తారు. ఆమెకు నివాళులు అర్పించేందుకు ఆ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను, అభిమానుల‌ను అధికారులు అనుమ‌తిస్తారు.

Queen Elizabeth II Funeral: రోజువారీ కార్య‌క్ర‌మాలు ఇవే!

క్వీన్ ఎలిజిబెత్ 2 మ‌ర‌ణాంత‌రం ప్ర‌తి రోజూ కార్య‌క్ర‌మాలు జ‌రుగూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఆదివారం, సెప్టెంబ‌ర్ 11, 2022న Balmoral కోట‌లోని బాల్‌రూం నుంచి క్వీన్ పార్థివ‌దేహం ఉన్న శ‌వ‌పేటిక‌ను సిబ్బంది ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసి వాహ‌నంలోకి త‌రలిం చారు. అదే రోజు మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు రాణి పార్థివ దేహాన్ని ఉంచిన వాహ‌నం బ‌ల్మోర‌ల్ కోట నుంచి బ‌య‌ల్దేరింది. ఇంచుమించుగా 160 కి.మీ దూరంలో ఉన్న ఎడిన్‌బ‌రాకు రోడ్డు మార్గంలో నెమ్మ‌దిగా ప్ర‌యాణం చేసింది ఆ వాహ‌నం. ఈ ప్ర‌యాణం సుమారు 6 గంట‌ల పాటు సాగింది.

రాణి పార్థివ దేహంను సోమ‌వారం, సెప్టెంబ‌ర్ 12, 2022King Charles 3 వెస్ట్‌మినిస్ట‌ర్ హాల్‌ను సంద‌ర్శించి, రాణికి సంతాపం తెలిపే క్ర‌మంలో పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌లు స‌మావేశం ఏర్పాటు చేశారు. అనంత‌రం క్వీన్ కన్సొర్ట్ కామిలాతో క‌లిసి కింగ్ చార్లెస్ 3 విమానంలో ఎడిన్‌బ‌రాకు ప్ర‌యాణిస్తారు. అత‌ను కింగ్ హోదాలో యూకేలోని నాలుగు దేశాల్లో ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న పేరు ఆప‌రేష‌న్ స్ప్రింగ్ టైడ్‌. రాణి పార్థివ దేహాన్ని సెయింట్ గిల్స్ క్యాథ‌డ్ర‌ల్‌కు తీసుకెళ్లారు. అక్క‌డ కింగ్ కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు. రాణి శ‌వ‌పేటిక‌ను ఒక రోజంతా అక్క‌డే ఉంచారు.

మంగ‌ళ‌వారం, సెప్టెంబ‌ర్ 13,2022న కింగ్ నాలుగు దేశాల యాత్ర‌లో భాగంగా ఐర్లాండ్‌ లోని బెల్ ఫాస్ట్‌ను సంద‌ర్శించారు. అక్క‌డి నుంచి హిల్స్‌బ‌రో అనే కోట‌కు వెళ్లారు. నార్త‌ర్న్ ఐర్లాండ్‌లో క్వీన్ ఎలిజిబెత్ 2కు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని తెలిపే ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. ఆ ఎగ్జిబిష‌న్‌కు కింగ్ హాజ‌ర‌య్యారు. అనంత‌రం నార్త‌ర్న్ ఐర్లాండ్ అసెంబ్లీ ప్ర‌వేశ‌పెట్టే సంతాప సందేశాన్ని ఆయ‌న అందుకున్నారు. అక్క‌డ మ‌త పెద్ద‌ల‌తో ప్రార్థ‌న‌లు అనంత‌రం త‌ర్వ‌తా అండ‌న్‌కు కింగ్ ప్ర‌యాణం అయ్యారు.

బుధ‌వారం, సెప్టెంబ‌ర్ 14, 2022న లండ‌న్‌లోని వెస్ట్‌మినిస్ట‌ర్ హాలుకు రాని పార్థివ‌ దేహాన్ని చేర్చారు. ఆ స‌మ‌యంలో అక్క‌డ మిల‌ట‌రీ బృందం క‌వాతు నిర్వ‌హిం చింది. ఆ కవాతులోరాజ కుటంబ స‌భ్యులు న‌డిచారు. లండ‌న్ వీధుల గుండా రాణి శ‌వ‌పేటిక‌ను త‌ర‌లించే స‌మ‌యంలో ప్ర‌జ‌లందరికీ చూసే అవకాశం క‌లిగింది. కొన్ని చోట్ల పెద్ద పెద్ద స్క్రీన్ల‌ను ఏర్పాటు చేశారు. అనంత‌రం వెస్ట్‌మినిస్ట‌ర్ హాలులో క్యాట్‌ఫాక్ అని పిలిచే ఎత్తైన ఫ్లాట్‌ఫాంపై శ‌వపేటిక‌ను ఉంచారు. అక్క‌డ రాజ‌రిక‌పు గుర్తులైన ఇంపీరియ‌ల్ స్టేట్ క్రౌన్‌, ఆర్బ్‌, సెప్టెర్‌ల‌ను పెడ‌తారు. ఇక్క‌డ ప‌టిష్ట భ‌ద్ర‌త న‌డుమ ప్ర‌జ‌లు సంద‌ర్శించారు.

రాణి పార్థివ‌దేహాన్ని సంద‌ర్శించ‌డానికి వ‌చ్చిన ప్ర‌జ‌లు

19న అంత్య‌క్రియ‌లు

గురువారం సెప్టెంబ‌ర్ 15, 2022 క్వీన్ అంతిమ యాత్ర కోసం రిహార్స‌ల్స్ సుమారు 4 గంట‌లు చేశారు. ఇదే రోజు క్వీన్ శ‌వపేటిక‌ను వెల్లింగ్ట‌న్ ఆర్చ్‌కు యాత్ర‌గా తీసుకెళ్లారు. ఇక్క‌డ నాలుగు రోజుల పాటు క్వీన్ పార్థివ దేహం ఉంచారు. ఇదే రాణికి చివ‌రి వీడ్కోలుగా ప‌రిగ‌ణిస్తారు. ఇక్క‌డ‌కు ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు వ‌స్తున్నారు. రాణిని చూసేందు కు,నివాళులు అర్పించేందుకు అంద‌ర్నీ అనుమ‌తించారు. ఇక సోమ‌వారం, సెప్టెంబ‌ర్ 19,2022 న క్వీన్ అంత్య‌క్రియ‌లు (Queen Elizabeth II Funeral) వెస్ట్‌మినిస్ట‌ర్ అబేలో మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు అధికార‌క లాంఛ‌నాల‌తో జ‌ర‌గ‌నున్నాయి. ఈ కార్య‌క్ర‌మం కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా దేశాధినేత‌ల్ని ఆహ్వానించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *