QUALITY ICE CREAM MAKE: మన ఇంటిలోనే ఐస్ చేసుకోవడం ఎలానో ఇప్పుడు నేర్చుకోండి. పిల్లలకు ఐస్‌క్రీమ్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. వారికి ఇంటిలోనే ఐస్‌క్రీమ్ చేసి పెడితే బయటకు వెళ్లికొనుకుంటామనే బాధ ఉండదు. ఐస్‌క్రీమ్ నేర్చుకోవడం ఒక్కసారి చూసి తయారు చేస్తే ఇక ఎప్పుడైనా ఐస్‌క్రీమ్‌ను ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. ఐస్‌క్రీమ్(QUALITY ICE CREAM MAKE)ను ఇంటిలో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం!
కావాల్సిన పదార్థాలు
ఐస్‌క్రీమ్ పౌడర్ – 1 ప్యాకెట్
నీళ్లు – 10 కప్పులు
పంచదార – 1 కప్పు
జీడి పప్పు – 10
యాలకుల పొడి – కొద్దిగా
తయారు చేయు విధానం
ఒక మందంగా ఉన్న గిన్నెలో నీళ్లు పోసి, బాగా మరగించాలి. 1/4 కప్పు చల్లటి నీళ్లు తీసుకుని అందులో ఐస్‌క్రీమ్ పౌడర్ వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న నీళ్లలో వేసి బాగా కలియబెట్టాలి. ఇది కలుపుతున్నప్పుడు పల్చగా మజ్జిగ లాగా వెనిల్లా ఫ్లేవర్‌తో ఉంటుంది. ఈ నీళ్లు బాగా తెర్లిన తర్వాత దించి ఎగ్‌బీటర్‌తో గానీ, మజ్జిగ కవ్వంతో కానీ బాగా నురగ వచ్చే వరకూ చిలికి చల్లారనివ్వాలి. తర్వాత దీనిని ఒక గిన్నెలో పోసి డీప్‌ఫ్రిజ్‌లో పెట్టాలి. రెండు, మూడు గంటల తర్వాత దానిని బయటకు తీసి స్పూన్‌తో బాగా కలిపితే ఐస్‌క్రీమ్ తయారవుతుంది. దీనిని చిన్న బౌల్స్‌లో వేసి పైన జీడిపప్పు, యాలకులపొడితో గార్నిష్ చేసి చల్ల చల్లగా సర్వ్ చేయాలి. అంతే ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఐస్‌క్రీం తయారవుతుంది.
మ్యాంగో (మామిడి పండ్లతో) ఐస్‌క్రీమ్ తయారీ
కావాల్సిన పదార్థాలు
బంగినపల్లి మామిడి పళ్లు – 3
పాలు – 1 లీటరు
పంచదార – 5 స్పూన్లు
కమలా పండ్లు – 1/2 కప్పు రసం
నిమ్మరసం – 1 స్పూను

తయారు చేసే విధానం
మామిడికాయను తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి గుజ్జుగా చేయాలి. రెండు వంతుల పాలు ఆవిరయ్యేలా బాగా మరగించాలి. ఆ తరువాత తయారు చేసిన పళ్ల గుజ్జును కలపాలి. ట్రేలో మిశ్రమాన్ని పోసి మూతపెట్టి డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి. 2 గంటల తర్వాత తీసి, బాగా గిలక్కొట్టి మరలా ఫీజర్‌లో ఉంచాలి. సర్వ్ చేసేటప్పుడు ఐస్‌క్రీమ్ కప్పులో కొంత ఐస్‌క్రీమ్ తీసి పైన కొన్ని పండ్ల ముక్కలు వేసి సర్వ్ చేయాలి.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!