Qualities of Good Parentsవారానికి ఒకసారి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక చోట కూర్చుని మాట్లడుకోవాలి. వీలయితే శనివారం దీనికి మంచి సమయం. ఆ రోజు సాయంత్రం కనీసం గంట లేదా గంటన్నర మీ కుటుంబ వ్యవహారాల్ని సమీక్షించుకోండి. ఇందుకోసం కొన్ని సూత్రాలు (Qualities of Good Parents)పాటించండి.
అమ్మ గురించి, నాన్న గురించి, వాళ్ల ప్రవర్తన గురించి ఏమనుకుంటున్నారో పిల్లల్ని అడగండి. అమ్మ కేకలు వేసినప్పుడు వాళ్లకు ఏమనిపిస్తుంది. నాన్న కోప్పడినప్పుడు ఎలా ఫీలవుతున్నారో కనుక్కోండి. వాళ్ల మనసులో ఉన్న మాట చెప్పమనండి.
అమ్మనాన్నల స్వభావాలు వాళ్లకు నచ్చుతున్నాయో లేదో తెలుసుకోండి. వారి డ్రెస్సింగ్, వాళ్లు ఫోనులో మాట్లాడే పద్ధతి, పిల్లలతో గడిపే సమయం పట్ల పిల్లలు ఏమానుకుంటున్నారో అడగండి. మనసులో ఏమున్నా చెప్పమనండి.
అమ్మానాన్నల పద్ధతుల్లో మార్పులు రావాలని వాళ్లు ఏమైనా అనుకుంటున్నారా… ఆ మార్పులు ఎలా ఉంటే బావుంటుందో అడగండి. ఏ మార్పుకావాలో చెప్పాల్సిందిగా కోరండి.
ఇప్పుడు ఉన్న ఇళ్లు వాళ్లకు నచ్చింది లేదా కనుక్కోండి. తమ క్లాస్‌మేట్స్‌ను, వేరే స్నేహితుల్ని ఇంటికి పిలవాలంటే నామోషీ ఫీలవుతున్నారా? తెలుసుకోండి. ఇంట్లో ఎలాంటి మార్పులు చేస్తే బావుటుందో సూచనలు ఇమ్మనండి.
ఇంటి పనుల్లో వాళ్లు ఎలాంటి భాగస్వామ్యం తీసుకుంటారో అడగండి. చిన్న చిన్న పనులు చెబితే చేయాలనిపిస్తుందా, లేదా? అసలు వాళ్లకు పనులు చెప్పాలా లేదా? పనులు చేయడానికి ఇబ్బంది పడతారా?


స్కుల్లో లేదా కాలేజీలో ఆ వారంలో ఇబ్బంది పడిన సందర్భాలు, ఇతరులు తమని బాధపెట్టిన సంగతులు ఉంటే మనసులో దాచుకోకుండా చెప్పాల్సిందిగా అడగాలి. ఇంటి లోపలి వాతావరణం అంటే డెకరేషన్ మొదలైన విషయాలు వాళ్లకు నచ్చినట్టు ఉన్నాయో లేదో అడగండి. పిల్లల బెడ్రూమ్ ఎలా ఉండాలి, హాల్లో ఎలాంటి మార్పులు చేయాలి, చదువుకునే టేబుల్ ఏ విధంగా ఉంటే వారి మనసు మెచ్చుతుందో అడగండి.
ఈ విధంగా పిల్లలకు అన్ని విషయాల మీద స్వేచ్ఛగా, మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడే అవకాశం ఇవ్వండి. అలాగే మీ పిల్లల ప్రవర్తన గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. మనసులోని మాట ఏదైనా మొహమాటం లేకుండా చెప్పాలి అన్నది ఈ సంభాషణకు మొదటి షరతు. వారానికి ఒక రోజు పిల్లలకీ, తల్లిదండ్రులకీ మధ్యన ఇలాంటి సంభాషణ ఉంటే వారి జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!