Pushpa part 2 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్‌గా ఊరమాస్ పాత్రలో నటించి అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనబర్చిన నటనకు ప్రేక్షకులతో పాటు యావత్తు టాలీవుడ్ ఫిదా అయ్యింది. ఇప్పటికీ సినిమాకు వసూళ్ల వర్షం వస్తూనే ఉంది. ఇక సినిమాపై సర్వత్రా ప్రశంజల జల్లు ఆగడం లేదు. ఇప్పటికే పలువురు సినిమా ప్రముఖులు పుష్ప సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

పుష్ప పార్ట్ -2 లీక్?(Pushpa part 2)
పుష్ప సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని అందరికీ తెలిసిందే. పార్ట్ -1 బాగా హిట్ అవ్వడంతో ఇప్పుడు పుష్ప పార్ట్ -2 పై భారీగా అంచనాలు పెరిగాయిని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే పుష్ప గురించి మరో తాజా వార్త చక్కర్లు కొడుతుంది. పుష్ప ది రూల్ చిత్రంలో ఒక ట్విస్ట్ ఉంటుందని ఇప్పుడు అది క్రేజీ గాసిప్‌గా చర్చకు దారితీస్తోంది. పుష్ప మొదటి భాగంలో హీరో ప్రక్కన ఉండే కేశవ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే రెండో భాగంలో కేశవ పుష్పకు వెన్నుపోటు పొడుస్తారని, దీంతో హీరో కొత్త చిక్కుల్లో పడతారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో కథ గురించి చర్చలు జరుగుతున్నాయి.

పుష్ప పార్ట్ -1 లో విలన్లుగా చూపించిన జాలిరెడ్డి, మంగళం శ్రీను, అతని భార్య ద్రాక్షాయిని, ఐపిఎస్ ఆఫీసర్ షికావత్లు పార్ట్ – 2లో అల్లు అర్జున్ను ముప్పు తిప్పలు పెడతారని అనుకుంటున్నారు. వాటిని మాత్రం సమర్థవంతంగా ఎదుర్కొని రంగస్థలం రేంజ్లో శిక్షలు వేస్తారని ఇంటర్నల్ టాక్. ఈ విషయం తెలిసిన నెటిజన్లు పుష్ప ది రూల్ స్టోరీ లీక్ అంటూ సోషల్ మీడియాలో ఈ న్యూస్‌ను వైరల్ చేస్తున్నారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!