Pulihora: పులిహోర ప్ర‌సాదం వెనుక దాగున్న‌ ర‌హ‌స్య క‌థ‌!

Pulihora: పులిహోర అంటే చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌వారి వ‌ర‌కు అంద‌రూ ఇష్టంగా తింటుం టారు. పులిహోర‌ను పూజ‌లు చేసిన‌ప్పుడు నైవేద్యంగా పెడుతూ ఉంటాం. పులిహోర‌ను మ‌న పూర్వీకుల కాలం నుండి పూజ‌ల‌కు నైవేద్యంగా పెడుతున్నారు. పూజ‌ల స‌మ‌యంలో దేనికి లేని ప్రాముఖ్య‌త పులిహోర‌ (Pulihora) కు ఎందుకు వ‌చ్చిందో తెలుసుకుందాం.

పులిహోర పురాణ క‌థ‌!

పాండ‌వులు అజ్ఞాత వాసంలో ర‌క‌ర‌కాల వేషాల‌ను వేసిన సంగ‌తి తెలిసిందే. పాండ‌వుల‌లో బీముడు వంట‌వాడిగా వేషం వేసి ఎన్నోర‌కాల వంట‌కాల‌ను సృష్టించారు. ఆ వంట‌కాల‌లో పులిహోర ఒక‌టి. ఈ విష‌యం మ‌న‌కు పురాణ క‌థ‌లు, చారిత్ర‌క ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇంత ప్రాచుర్యం ఉన్నా పులిహోర ఆ త‌ర్వాత క్ర‌మంగా ద‌క్షిణ భార‌త‌దేశం అంతా ప్రాచుర్యం పొందింది. కొత్త రుచులను ఆస్వాదించే తెలుగువారు ఈ వంట‌కానికి Pulihora అని పేరు పెట్టి ఆస్వాదించ‌టం ప్రారంభించారు. కుళుత్తుంగ చోళుల ప‌రిపాల‌న ఉన్న స‌మ‌యంలో త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క ప్రాంతాల‌లో దైవానికి ఆర‌గింపు చ‌ర్య‌గా ఉత్త‌మ జాతి పువ్వుల‌ను, పండ్ల‌ను, తినుబండారాల‌ను పెట్ట‌డం ఒక ఆచారంగా ఉండేద‌ట‌.

ముఖ్యంగా శ్రీ వైష్ణ‌వులు, అయ్యంగార్లు ఈ ప‌ద్ద‌తిని ప్రారంభించి ప్రాచుర్యం చేయ‌డంతో ఇత‌ర ప్రాంతాల వారు కూడా ఆర‌గింపు చ‌ర్య‌ను చేయ‌డం ప్రారంభించారు. ఆ త‌ర్వాతి కాలంలో పులిమోర‌ను దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ త‌ర్వాత భ‌క్తుల‌కు పంచ‌డం ప్రారంభం అయ్యింది. పులిహోర‌(Tiger food)లో శుభానికి, ఆరోగ్యానికి సూచిక‌గా ఉండే ప‌సుపును ఉప‌యోగిస్తారు. అందువ‌ల్ల ఒక వైపు ఆధ్యాత్మిక ప‌రంగాను మ‌రోవైపు ఆరోగ్యంప‌రంగాను దోహ‌ద‌ప‌డుతుంది. హిందూ ధ‌ర్మంలో పులిహోర‌ను త‌ప్ప‌నిస‌రిగా తిన‌వ‌ల్సిన ఆహారం చెప్ప‌డమే కాకుండా పండితులు దివ్య ఆహారంగా చెప్ప‌డంతో కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో ప‌లియోగారే అని మ‌న రాష్ట్రంలో పులిహోర (Pulihora) అని పేరు పొందింది.

పులిహోర

అయితే చాలా దేవాల‌యాల్లో పులిహోర‌ (Pulihora) ను ప్ర‌సాదంగా పెట్ట‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. తిరుమ‌ల తిరుప‌తి లో పులిహోర‌ను రాశిగా పోసి చేసే సేవ‌ను తిరుప్పావ‌డ సేవ అంటారు. పులిహోర ఇప్పుడు మ‌న పండుగ‌ల‌లో క‌నిపించే ప్ర‌సాదం. పేద‌వారేమీ, ధ‌నికులు ఏమీ పులిహోర వండ‌ని ఇల్లుంటూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డా ఉండ‌దు. ఇంత‌టి ఘ‌న చ‌రిత్ర ఉన్న పులిహోర అంటే మీకు ఇష్ట‌మేనా?.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *