PUC Certificate

PUC Certificate:మీ వాహ‌నాల‌ను క‌చ్చితంగా స‌ర్వీసు చేయించుకుంటున్నారా? లేదా?

Share link

PUC Certificate | దేశ‌వ్యాప్తంగా ఇక‌పై కాలుష్య నియంత్ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు (PUC) ఒకే రూపంలో (కామ‌న్ ఫార్మాట్‌) ఉండ‌నున్నాయి. ఏక‌రూప పీయూసీల‌కు సంబంధించి కేంద్ర మోటారు వాహ‌నాల నిబంధ‌న‌లు-1989 ప్ర‌కారం కేంద్ర ర‌హ‌దారి, ర‌వాణా శాఖ 2021 జూన్ 17న నూత‌న నోటిఫికేష‌న్ జారీ చేసింది. నిర్ణీత కాలుష్య విలువ‌ల‌కు మించి ప‌రీక్ష ఫ‌లితాలు వ‌స్తే వాహ‌న య‌జ‌మానికి తిర‌స్కార ప‌త్రం (Rejection Slip) ఇచ్చే విధానాన్ని తొలిసారిగా ప్ర‌వేశ పెడుతున్న‌ట్టు అందులో పేర్కొంది.

PUC Certificate కొత్త నిబంధ‌న‌లు ఇవే

కాలుష్య ప‌రీక్ష‌లో వాహ‌నం విఫ‌ల‌మైతే తిర‌స్కార ప‌త్రం జారీ చేస్తారు. దాన్ని చూపించి, కాలుష్య ప్ర‌మాణాల‌కు అనుగుణంగా వాహ‌నానికి Servicing చేయించుకోవాలి. పీయూసీల్లో గోప్య‌త పాటిస్తారు. వాహ‌న య‌జ‌మాని Mobile నెంబ‌ర్‌,ఇంజిన్‌, Chassis నెంబ‌ర్ల‌లో చివ‌రి నాలుగు అంకెలు మాత్ర‌మే క‌నిపించేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. వాహ‌న ప‌రీక్ష స‌మ‌యంలో య‌జ‌మాని ఫోన్ నెంబ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాలి. ఫీజు, వాహ‌న ధ్రువీక‌ర‌ణకు సంబంధించిన ఎస్ఎంఎస్‌లు ఆ నెంబ‌ర్‌కు వ‌స్తాయి.

వాహ‌న ఉద్గారాలు నిబంధ‌న‌ల‌కు లోప‌డి లేవ‌ని ప‌ర్యావ‌ర‌ణ అధికారి విశ్వ‌సించిన‌ప్పుడు స‌ద‌రు వాహ‌నాన్ని అధీకృత కాలుష్య నియంత్ర‌ణ ప‌రిశీల‌న కేంద్రంలో ప‌రీక్షించాల్సిందిగా ఉత్త‌ర్వులు జారీ చేయొచ్చు. ఆ ఉత్త‌ర్వుల‌కు అనుగుణంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోక‌పోయినా స‌ద‌రు వాహ‌నం కాలుష్య ప‌రీక్ష‌ల్లో విఫ‌ల‌మైనా య‌జ‌మాని జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప‌ర్యావ‌ర‌ణ అధికారి జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను వాహ‌న య‌జ‌మాని అమ‌లు చేయ‌క‌పోతే తిరిగి PUC స‌మ‌ర్పించేంత వ‌ర‌కూ ఆ వాహ‌న Registration స‌ర్టిఫికెట్‌, ఇత‌ర అనుమ‌తుల‌ను స‌స్పెండ్ చేసే అధికారం RTAకు ఉంటుంది.

స‌స్పెంన్ష న్‌కు సంబంధించిన కార‌ణాల‌ను లిఖిల‌పూర్వ‌కంగా న‌మోదు చేయాలి. కాలుష్య నియంత్ర‌ణ ధ్రువ ప‌త్రంపై QR codeను క‌చ్చితంగా ముద్రించాలి. అందులో పీయూసీ సెంట‌ర్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఉంటాయి.

road accident : దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్తూ రోడ్డు ప్ర‌మాదం | chittoor district

road accident : Chittoor: దైవ‌దర్శ‌నానికి వెళుతూ ప్ర‌మాద‌వ‌శాత్తు రోడ్డు ప్ర‌క్క‌న టాటా ఏసీ వాహ‌నం బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో వాహ‌నంలో ఉన్న ఒక‌రు మృతి Read more

Gadapa Pooja: ద్వార ల‌క్ష్మీ పూజ‌, గ‌డ‌ప పూజ ఎలా చేయాలి?

Gadapa Pooja: ఒక కుటుంబం క్షేమంగా ఉండ‌టానికి చేయాల్సిన పూజ‌ల్లో ముఖ్య‌మైన‌వి రెండు ఒక‌టి ఇల‌వేల్పుని కొలుచుకోవ‌డం, రెండు ఇంటి గ‌డ‌ప‌కు పూజ చేయ‌డం. ఇంటి గ‌డ‌ప‌ను Read more

Pitru Devathalu ల‌కు భోజ‌నం ఎలా అందుతుంది?

Pitru Devathalu: శ్రాద్ధ‌ప‌క్షంలో పిత‌రుల శాంతికోసం బ్రాహ్మ‌ణుల‌కు భోజ‌నం పెట్టాలి. దీనివ‌ల్ల పితృదేవ‌త‌లు తృప్తి చెందుతారు. ఈ విష‌య‌మై కొన్ని సందేహాలు స‌హ‌జంగా క‌లుగుతాయి. అవేంటో ఇప్పుడు Read more

Husband Attitude: ఇవి భర్త‌ల‌కు మాత్ర‌మే భార్య‌ల‌కు కాదు!

Husband Attitude: భార్యభ‌ర్త‌ల అల‌క గ‌దికి మాత్ర‌మే ప‌రిమితం కావాలి కానీ, బ‌జారులోకి రాకూడ‌దు. ఇటీవ‌ల భార్యభ‌ర్త‌ల కేసులు, పంచాయ‌తీల‌తో పోలీసుస్టేష‌న్లు, కోర్టులు కిక్కిరుస్తున్నాయి. ఇష్ట‌ప‌డి చేసుకున్న Read more

Leave a Comment

Your email address will not be published.