Core Web Vitals Assessment: Political Parties : నిల‌దీత‌లు మొద‌లైతే మ‌నుగ‌డ క‌ష్ట‌మే?(స్టోరీ)

Political Parties : నిల‌దీత‌లు మొద‌లైతే మ‌నుగ‌డ క‌ష్ట‌మే?(స్టోరీ)

Political Parties : తెలుగు రాష్ట్రాల్లో పొలిటిక‌ల్ పార్టీల గెలుపు, ఓట‌మిల‌ను ప్ర‌జ‌లు తేల్చివేయ‌డంలో చురుకైన వారిగా చెప్పుకోవ‌చ్చు. ఒక పార్టీ త‌న ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌ ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోతే రెండో సారి ఆ పార్టీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌త‌రంగా మారుతుంది. అందుకు ప‌ద‌వి అనుభ‌వి స్తున్న ముఖ్య‌మంత్రులు, పాల‌కులు ప్ర‌జ‌ల‌కు కావాల్సిన స‌దుపాయాల‌ను, అవ‌స‌రాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే. ఈ నేప‌థ్యంలో ఆయా ప్ర‌భుత్వాల‌ను నిల‌దీసిన సంద‌ర్భాలు, ధ‌ర్నాలు, రాస్తారోకోలు చేసిన ఘ‌ట‌న‌లూ లేక‌పోలేదు.


Political Parties : రాజ‌కీయాల్లో ఒక్క‌సారి చ‌ల‌నం మొద‌లైనా, అల‌జ‌డి రేగినా, ప్ర‌జ‌ల్లో ప్ర‌శ్న మొద‌లైనా ఇక అది ఆగ‌దు. జ‌నం గుండెల్లో చేరితో వారి నిర్ణ‌యం మార‌దు. ఇది గ‌త‌లో అనేక సంద‌ర్భాల్లో రుజువైందే. పాల‌కులు స‌మ‌స్య‌ల‌ను ముందే ప‌సిగ‌ట్టి జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే క‌ష్టం. నావ మున‌గ‌డం ఆప‌లేం. ఉమ్మ‌డి రాష్ట్రంలో 1999 సంవ‌త్స‌రం గెలుపు త‌ర్వాత చంద్ర‌బాబులో వ‌చ్చిన మార్పు తో తెలంగాణ ఉద్య‌మానికి శ్రీ‌కారం జ‌రిగింది. తెలుగుదేశం పార్టీకి రైతు దూర‌మైంది. ఆఖ‌రుకు ప‌దేళ్ల‌పాటు చంద్ర‌బాబును పాల‌న‌కు దూరం చేసింది. అదే దారిలో ఇటు రాష్ట్రంలో న‌డిచిన కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో ఇప్ప‌టికీ క‌నిపిస్తూనే ఉంది. అందుకే జ‌నం నిల‌దీత‌దాకా ప‌రిస్థితి రానివ్వొద్ద‌ని రాజ‌కీయ పండితులు అనేక మార్లు చెప్పేది. ప్ర‌జ‌లు ఎంత బ‌లంగా న‌మ్మితే పాల‌కులు అంత ప్ర‌జారంజ‌క పాల‌న చేయాలి, అంతే సేవ చేయాలి.

అంతేకానీ..జ‌నం న‌మ్మారు, ఏదీ చేసినా ఒప్పుకుంటార‌న్న‌ది అస‌లే తెలియ‌దు. అందుకు తెలంగాణ ఉద్య‌మం కూడా ఓ సాక్ష్య‌మే. గ‌త అనుభ‌వ‌మే, మాకు న‌చ్చిందే మేం చేస్తామ‌నుకున్నా, ప్ర‌జ‌ల‌కు న‌చ్చిందిచేస్తే గుండెల్లో గూడు క‌ట్టుకుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న రాష్ట్రంలో గాని, ఉమ్మ‌డి పాల‌కుల పాల‌న‌లో గాని రెండుసార్లు క‌న్నా ఎక్కువ సార్లు ప్ర‌భుత్వాన్ని నిలుపుకున్న‌వారు లేరు. రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక తీసుకునే నిర్ణ‌యాల్లో జ‌రిగిన పొర‌పాట్లు మ‌ళ్లీ గద్దెనెక్క‌కుండా చేశాయి. అదే జ‌నం న‌మ్మితే ఎన్నిసార్లైనా గెలిపిస్తార‌ని చెప్ప‌డానికి తాజాగా మూడుసార్లు గెలిపించిన ప‌శ్చిమబెంగాల్‌, ఒడిశాల‌ను ఆద‌ర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఏటా జ‌రుగుతున్న ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలు ఎంతో ఆహ్లాద‌ర‌క‌మైన వాతావ‌ర‌ణంలో జ‌రిగాయి. కానీ ఈసారి అక్క‌డ‌క్క‌డ వివాదాలు, నిర‌స‌న‌లు, నిల‌దీత‌ల‌పై వార్త‌లు వింటున్నాం. ఇది అధికార టిఆర్ఎస్ పార్టీ భ‌విష్య‌త్‌కు మంచిది కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ప‌ల్లె ప్ర‌గ‌తిలో ప్ర‌జ‌లు కోరుకుంటున్న వాటిని సాధ్య‌మైనంత మేర తీర్చేందుకు తోడ్ప‌డ‌తామ‌ని న‌చ్చ చెప్ప‌గ‌ల‌గాలే గానీ, నిర‌స‌న‌లు త‌ప్పించుకొని పోతూ ఉంటే, మ‌ళ్లీ మ‌ళ్లీ అవే ఎదుర‌వుతుంటాయి. అలాగ‌ని ప్ర‌జ‌ల‌ను ఎక్క‌డా నొప్పించ‌కూడ‌దు. నిర‌స‌న‌లు పెద్ద‌వి కాకుండా చూసుకోవాలి. ఆ నిర‌స‌న‌లు పెరిగి పెద్ద‌వైతే గ‌తంలో ఏం జ‌రిగాయో చూద్దాం!.

చంద్ర‌బాబు రాజ‌కీయం ప‌రిశీలిస్తే!

చంద్ర‌బాబు రెండో సారి ముఖ్య‌మంత్రి అయ్యాక అప్ప‌టి రాష్ట్ర రాజ‌కీయాల్లో అస్త‌వ్య‌స్థ ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఆయ‌న అదృష్టం వ‌ల్ల‌నో, లేక ఆయ‌న రాజ‌కీయ చ‌తుర‌త మూలంగానో మొత్తానికి మొద‌టి ద‌ఫా పాల‌న‌లో ఆయ‌న ఏది చెబితే అది జ‌రిగింది. జ‌నం కూడా కొత్త గా ఉన్న చంద్ర‌బాబు పాల‌న‌ను బ‌లంగా న‌మ్మారు. ఇలాంటి స‌మ‌యంలో ఆ 1994 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌ధాన స‌మ‌స్య అయిన మ‌ద్య నిషేధం ఎత్తివేసినా జ‌నం అంగీక‌రించారు. చంద్ర‌బాబు పాల‌న‌కే జై కొట్టారు. అదే స‌మ‌యంలో వ‌చ్చిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు టిడిపికే జ‌నం నీరాజ‌నం ప‌లికారు. చంద్ర‌బాబు పాల‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ్డారు. జ‌న్మ‌భూమి, ప‌చ్చ‌ధ‌నం – ప‌రిశుభ్ర‌త వంటి వినూత్న‌మైన కార్య‌క్ర‌మాల‌తో పాటు, విద్యావ్య‌వ‌స్థ‌లో పెద్ద ఎత్తున మార్పులు తెచ్చారు. సాంకేతిక విద్య‌కు ప్రాధాన్య‌మిస్తూ వ‌చ్చారు. నాడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి విదేశాల‌కు వెళ్లి ఉద్యోగాలు చేసిన వారు నేడు అమెరికాలో అన్ని రంగాల‌కు విస్త‌రించారు. అంత‌టి చంద్ర‌బాబు పాల‌న‌ను అందించిన త‌ర్వాత రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తొలినాళ్ల‌లోనే క‌రెంట్ ఛార్జీలు పెంచి పెద్ద పొర‌పాటు చేశారు. 1999 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ ను కూడా న‌మ్మ‌కుండా చంద్ర‌బాబును న‌మ్మితే ఛార్జీలు పెంచ‌డాన్ని రైతులు జీర్ణించుకోలేదు. ఆ ఒక్క త‌ప్పు ఆయ‌న‌కు ఉమ్మ‌డి రాష్ట్రంలో మ‌ళ్లీ అవ‌కాశం లేకుండా చేసింది. త‌ర్వాత తెలంగాణ ఉద్య‌మం విష‌యంలోనూ తెలంగాణ అన్న ప‌ద‌మే నిషేధించ‌డం వంటి వాటితో అటు రైతులు, ఇటు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు పార్టీ దూర‌మైంది. చంద్ర‌బాబు 2004 ఎన్నిక‌ల్లో ఓడిపోయేలా చేసింది. అందువ‌ల్ల జ‌నం మెచ్చెలా పాల‌న ఉండాలే కానీ, జ‌నం క‌న్నీరు పెట్టేలా ఉండ‌కూడ‌దు.

కాంగ్రెస్ ప‌రిస్థితి కూడా అదే!

అనంత‌రం కాంగ్రెస్ చేసిన ప‌ని కూడా దాదాపుగా అలాంటిదేన‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. తెలంగాణ‌లో ప్ర‌జ‌ల నాడి తెలిసినా, కావాల‌ని చేసినా కాల‌యాప‌న వ‌ల్ల జ‌రిగిన న‌ష్టం ప‌దేళ్ల‌యినా పూడ్చుకోలేక‌పోతోంది. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్య‌మం సాగింది అంటే అది ప్ర‌జ‌ల స‌హ‌కారం లేకుండా సాగ‌ద‌న్న క‌నీస ప‌రిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ నాడు ఉద్య‌మాన్ని ఎంత అణ‌చాల‌ని చూస్తే అంత పెరిగింది. తెలంగాణ ఇస్తే త‌ప్ప ఆగేలా లేద‌న్న స్థితికి చేరింది. ఆఖ‌రుకు కాంగ్రెస్ పార్టీ తెల‌గాణ ప్ర‌క‌టించినా, ఆ పార్టీ 2014 ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేక‌పోయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అన్న దానికంటే ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెచ్చిండ‌న్న న‌మ్మ‌కం జ‌నంలో బ‌లంగా నాటుకుపోయింది. తెలంగాణ తేక‌పోతే న‌న్ను రాళ్ల‌తో కొట్టండి అని చెప్పిన కేసీఆర్ తెలంగాణ తెచ్చేదాకా అదే ప‌ట్టుమీద ఉన్నాడు. తెలంగాణ తెచ్చించు. ఇప్పుడు కూడా ఆయ‌న ఏది చెబితే అది చేస్తాడ‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో నాటుకుపోయింది. అలాంటి న‌మ్మ‌కం వ‌మ్ము కాకుండా చూసుకోవాలి. ప్ర‌స్తుతం రాజ‌కీయాలు మారాయి. అందుకు త‌గ్గ‌ట్టుగా ప్ర‌జ‌లూ స‌మాధానం చెబుతున్నారు. అయితే తెలంగాణ‌లో ప్ర‌జ‌లు అస‌లైన సిసలైన తెలంగాణ‌కు దూరంగానే ఉండిపోయామ‌నే ఆవేద‌న‌లో, ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇప్ప‌టికైనా టిఆర్ఎస్ పార్టీ ప్ర‌జ‌ల‌కు కావాల్సిన స‌దుపాయాల‌ను, సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తే మ‌రో అవ‌కాశం ప్ర‌జ‌లు ఇచ్చే అవ‌కాశం ఉంది. నిర్ల‌క్ష్యం వ‌హిస్తే గ‌త పార్టీలు ఎలా మ‌నుగ‌డ కోసం ఇబ్బంది ప‌డుతున్నాయో, అదే ఇబ్బంది చ‌విచూసే ప్ర‌మాద‌మూ ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు ఆరోపిస్తున్నారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *