telangana news: మహబూబ్నగర్ జిల్లాలో మంగళవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని పీడిఎస్యు విద్యార్థి సంఘ నాయకులు మంత్రి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు.పెద్దు ఎత్తున ఆందోళన చేస్తుండగా పోలీసులు భారీ కేడ్లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వాటిని నెట్టుకొని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటి వైపుకు దూసుకెళ్లారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నిరుద్యోగులు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మంత్రి ఇంటి వద్ద ఆందోళనలో భాగంగా పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు.
అనంతరం పరిస్థితి మరింత ఉద్రిక్తత కాకుండా పీడిఎస్యు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయకపోవడంతో మనస్థాపం చెందిన కొందరు నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, లేకుంటే మరింత ఆందోళనలకు పూనుకుంటామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!