PSU Interview : Gate ఫలితాలొచ్చిన తర్వాత పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థుల ముందు ఇప్పుడు రెండు మార్గాలున్నాయి. అందులో ఒకటి PSU (ప్రభుత్వ రంగ సంస్థలు) కొలువుల్లో స్థిర పడటం, కాగా రెండోది ఐఐటీల్లో, ఎంటెక్‌ల్లో చేరి ఉన్నత విద్యనభ్యసించడం. ఈ రెడు మార్గాల్లోనూ గేట్లో స్కోర్‌తో పాటు ఇంటర్వ్యూ సైతం కీలకంగా నిలుస్తోంది. గేట్, Mtechలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష! గేట్ స్కోర్ ఆధారంగా ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. అందుకే ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్లు పెద్ద సంఖ్యలో గేట్‌కు హాజరవుతుంటారు. ఈ నేపథ్యంలో Gate Rankers కు ఉపయోగపడేలా పీఎస్‌యూ ఇంటర్వ్యూలు IIT, Mtech ప్రవేశ ఇంటర్వ్యూలు వాటిలో విజయం కోసం ఏ విధంగా సన్నద్ధం(PSU Interview) కావాలో తెలుసుకుందాం!


పీఎస్‌యూ ఇంటర్వ్యూ
పీఎస్‌యూలు (అధిక శాతం ) కేవలం గేట్ స్కోర్ ద్వారానే నియామకాలు ఖాయం చేడయం లేదు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మొదట గేట్ స్కోర్ ఆధారంగా Short List చేస్తున్నాయి. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. గేట్ స్కోర్, ఇంటర్వ్యూలో ప్రతిభ చూపిన వారికి Offer letters ఇస్తున్నాయి.
పిలుపు రావాలంటే..
పీఎస్‌యూలు దరఖాస్తు చేసుకున్న వారందర్నీ ఇంటర్వ్యూలకు ఆహ్వానించడం లేదు. పలు అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తున్నాయి. గేట్ స్కోర్- అందుబాటులో ఉన్న ఖాళీలు – గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్(65 శాతానికి తగ్గరాదు)- వయసు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఇంటర్వ్యూ కాల్ లెటర్లు పంపిస్తున్నాయి.
వెయిటేజీ
పీఎస్‌యూలు (అధిక శాతం) గేట్ స్కోర్‌కు 80 -85 శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. ఇంటర్వ్యూకు 15 శాతానికి తగ్గకుండా వెయిటేజీ లభిస్తోంది. ఈ వెయిటేజీల పరంగా పీఎస్‌యూల మధ్య వ్యత్యాసాలున్నాయి.
ఇవే కీలకం
Personal Interview లో అభ్యర్థి వ్యక్తిగత నేపథ్యం, Technical Knowledge పై ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రాజెక్టు వర్క్, మినీ ప్రాజెక్టు, ఇంటర్న్షిప్స్ ద్వారా అభ్యర్థులు సొంతం చేసుకున్న నైపుణ్యాలను పరీక్షిస్తారు. అభ్యర్థలు అప్టిట్యూడ్, అడిట్యూడ్ను అంచనా వేస్తారు. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం, సంస్థ పట్ల ఉన్న ఆసక్తి, దానికి గల కారణాలు భవిష్యత్తు లక్ష్యాల కోణంలో ప్రశ్నలు అడుగుతారు.
విజయానికి
పర్సనల్ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు సమకాలీన అంశాలపైనా అవగాహన ఉండాలి. కాబట్టి అభ్యర్థులు బీటెక్ సబ్జెక్టులతో పాటు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న నాన్ టెక్నికల్ అంశాలపైనా దృష్టి పెట్టాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులంతా ఆయా పీఎస్‌యూ ప్రొఫైల్‌ను క్షుణంగా తెలుసుకోవాలి. సదరు పీఎస్‌యూ ఏయే రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దాని పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలి.


ఆత్మవిశ్వాసం, వస్త్రధారణ
పీఎస్‌యూ ఇంటర్వ్యూ ప్యానెల్లో టెక్నికల్ నిపుణులు, HR బృందం కలిపి మొత్తం నాలుగు నుంచి ఎనిమిది మది వరకు ఉంటారు. వీరంతా అభ్యర్థులను పలు అంశాల్లో పరీక్షిస్తారు. కాబట్టి ఇంటర్వ్యూలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ముందుగా వస్త్రధారణపై దృష్టి పెట్టాలి. ఫార్మల్ ప్యాంటు, షర్టు, బ్లేజర్ ధరించి ఇంటర్వ్యూకి హాజరవ్వాలి. ఇన్‌షర్ట్ తప్పనిసరి. అలాగే ఇంటర్వ్యూ సమయంలో ఆత్మవిశ్వాసంతో మెలగాలి. ముఖంపై చిరునవ్వు చెదరకుండా చూసుకోవాలి.
బేసిక్స్ కీలకం
ఇంటర్వ్యూలో బేసిక్స్ కీలకంగా నిలుస్తాయి. అభ్యర్థికి సబ్జెక్టుపై ఉన్న పట్టును పరీక్షించేలా టెక్నికల్ నిపుణులు ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు బీటెక్ స్పెషలైజేషన్లోని బేసిక్స్‌ను ఔపోసన పట్టాలి.
కంపెనీ
మా కంపెనీలో ఎందుకు చేరాలనుకుంటున్నారు.. మా కంపెనీ గురించి మీకేం తెలుసో చెప్పగలరా..? పిఎస్యూ ఇంటర్వ్యూలో తప్పక ఎదురయ్యే ప్రశ్నలు ఇవి!! కాబట్టి ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులంతా సదరు పీఎస్ యూ నేపథ్యం, కార్యకలాపాల గురించి తప్పక అధ్యయనం చేయాలి. దీంతో పాటు అదే పీఎస్యూను ఎంచుకోవడానికి సహేతుక కారణాలు చెప్పగలగాలి.
ప్రాజెక్టు, ఇంటర్న్‌షిప్
బీటెక్ లో చేసిన ప్రాజెక్టు వర్క్, ఇంటర్నిషిప్ల గురించి ప్రశ్నలు అడుగుతారు. ప్రాజెక్టు వర్క్ ఫైడింగ్స్, ఇంటర్న్సిప్లో ఏయే అంశాలను నేర్చుకున్నారనే విషయాన్ని పరిశీలిస్తారు. దీంతో పాటు కరెంట్ అఫైర్స్పైనా ప్రశ్నలు ఎదురవుతాయి.
వేతనాలు
పీఎస్యూలో కొలువు సొంతం చేసుకున్న అభ్యర్థలకు ఆకర్షణీయ వేతనాలు లభిస్తాయి. గెయిల్ వంటి కంపెనీల్లో వేతనం రూ.60 వేల నుంచి ప్రారంభమవుతుంది. కొన్ని పీఎస్‌యూలు, సర్వీస్ బాండ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగాన్ని ఖరారు చేసుకున్న అభ్యర్థులు నిర్ధిష్ట కాలంతో పాటు సంస్థలో పనిచేస్తామని, అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యవధి రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు ఉంటోంది.
ఐఐటీ ఇంటర్వ్యూ ఇలా
ఐఐటీ(IIT), ఎన్ఐటీ(NIT), ఐఐఎస్సీ(IISC)ల్లో ఎంటెక్ ప్రవేశం పొందాలంటే.. ఇంటర్వ్యూలోనూ ప్రతిభ చూపాల్సిందే. ఇంటర్వ్యూలో ప్రధానంగా అభ్యర్థి ఆలోచనలు- స్పష్టత, తార్కిక కోణం, సబ్జెక్ట్ నాలెడ్జ్ వంటి అంశాలను పరిశీలిస్తారు.
సీఏఓపీ – 2020
ఐఐటీల్లో ఎంటెక్‌లో చేరాలనుకునే అభ్యర్థులు ముందుగా కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్ (సీఏఓపీ) – 2020లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇందులో రిజిస్టర్ చేసుకున్న వారికే ఐఐటీల్లో ఎంటెక్ ప్రవేశాలు లభిస్తాయి. దీంతో పాటు పీసీఐఎల్లో కొలువులు దక్కించుకోవాలన్నా సీఏఓపీలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
కీలక అంశాలు
ఎంటెక్ ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల్లో అనేక అంశాలను పరిశీలిస్తారు. ముఖ్యంగా సబ్జెక్టు నాలెడ్జ్- సబ్జెక్టుల్లోని కోర్ అంశాలపై అవగాహన – స్పష్టమైన ఆలోచనలు- కమ్యూనికేషన్ స్కిల్స్- వ్యక్తిత్వం, అటిట్యూడ్, సంఘటనలు పట్ల స్పందించే తీరు.- ఆలోచనా దృక్పథం వంటివి. వీటితో పాటు డ్రెస్ కోడ్, ఇంటర్వ్యూ రూమ్‌లో ప్రవేశించి తీరు, కూర్చునే విధానం, బాడీ లాంగ్వేజ్ మాట తీరు, ఇంటర్వ్వూ సమయంలో అభ్యర్థి ప్రవర్తన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.


ఇంటర్వ్యూ ప్రశ్నలు
సంబంధిత స్పెషలైజేషన్ / అకడెమెక్స్కు సంబంధించిన అంశాలు / కెరీర్ ప్లానింగ్, ఇండ స్ట్రీ, రీసెర్చ్- ఇంటర్న్ షిప్, వర్క్ ఎక్సీపరీయేన్స్- జాబ్ ప్రొఫైల్ (ఉద్యోగం చేసుంటే), ప్రాజెక్టు వర్క్ తదితర అంశాలపై ఇంటర్వ్యూ లో ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు ఎంటెక్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నారో చెప్పండి? – ఈ స్పెషలైజేషనే ఎందుకు ఎంచుకున్నారు? – ఐదేళ్ల తర్వాత మీ కెరీర్ ఎలా ఉంటుందని అంచాన వేస్తున్నారు? మీ భవిష్యత్తు లక్ష్యాలేంటి? వంటి ప్రశ్నలు ఎదురవుతాయి.
కోర్ అంశాలపైనే..
సీఏఓపీ రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులను ఐఐటీలు ఇంటర్వ్యూ కు ఆహ్వానిస్తున్నాయి. ప్రవేశాల పరంగా ఇది ప్రధాన మార్గం. ఇక రెండో మార్గంలో అభ్యర్థులు నేరుగా ఐఐటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్లు మిగిలిపోయిన సమయంలో ఈ విధానాన్ని అనుసరిస్తారు. గేట్లో తక్కువ మార్కులు సాధించిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నేరుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఐఐటీలు ఇంటర్వ్యూల తో పాటు అదనపు టెస్టు (రాత పరీక్ష) నిర్వహించి ప్రవేశాలను ఖరారు చేస్తాయి. ఇక ఇంటర్వ్యూ పరంగా కోర్ అంశాలు కీలకంగా నిలుస్తాయి. ఇంటర్వ్యూ ఆసాంతం కోర్ అంశాల చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు సబ్జెక్టుపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!