Ys Sunitha Reddy: కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భాగంగా 68వ రోజు సీబీఐ విచారణ కొనసాగించింది.కడప జిల్లా పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. శుక్రవారం విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్ రెడ్డి హాజరయ్యారు. వివేక హత్యకేసులో శంకర్ రెడ్డి కీలక అనుమానితుడిగా అధికారులు భావిస్తున్నారు. ఆయనతో పాటు పులివెందుల క్యాంపు కార్యాలయంలో పనిచేసే రఘునాథరెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. వివేకా హత్యకు సంబంధించిన వివిధ అంశాలపై సీబీఐ అధికారులు వారిని ఆరా తీస్తున్నారు.
నాకు.. నా కుటుంబానికి ప్రాణహాని ఉంది: వివేకా కుమార్తె సునీత
నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉందని, తనకు వెంటనే భద్రత కల్పించాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత (Ys Sunitha Reddy)కడప ఎస్పీ అన్భురాజన్కు లేఖ రాశారు. ఈ నెల 10న పులివెందులలోని తమ నివాసం వద్ద మణికంఠరెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఆమె. మణికంఠరెడ్డి వైస్సార్సీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనుచరుడిగా ఆమె వివరించారు. తన తండ్రి హత్య కేసులో శివశంకర్ రెడ్డి ప్రధాన అనుమానితుడిగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు అతని అనుచరుడు రెక్కీ నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె లేఖలో పేర్కొన్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించామని, వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు తమ కుటుంబానికి భద్రత కల్పించాలని జిల్లా, డీజీపీ, సీబీఐ అధికారులకు సునీత లేఖలు పంపారు. లేఖతో పాటు సీసీ కెమెరా దృశ్యాల పెన్‌డ్రైవ్‌లు కూడా పంపినట్టు లేఖలో పేర్కొన్నారు.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!