prostate problems | మన ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. జీవనశైలీ మారుతోంది. వీటిని మనం తేలికగా తీసుకుంటుండొచ్చు గానీ ఇవి రకరకాల సమస్యల ముప్పును తెచ్చిపెడుతున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు వంటివే కాదు. ప్రోస్టేట్ సమస్యలకూ దోహదం చేస్తున్నాయి. ప్రోస్టేట్ సమస్యల బారినపడేవారి పురుషుల సంఖ్య ఒకప్పటి కన్నా ఇప్పుడు పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం.. ప్రతి 10 మంది పురుషుల్లో 8 మంది ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బు బారినపడతున్నారు. ప్రతి 10 మందిలో ఒకరికి ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటోంది కూడా. ప్రోస్టేట్ గ్రంథిలో (prostate problems)తలెత్తే సమస్యల్లో ప్రోస్టేట్కు ఇన్ఫెక్షన్ రావడం (ప్రోస్టేటైటిస్), వృద్ధాప్యంలో ప్రోస్టేట్ ఉబ్బటం(బీపీహెచ్), ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రధానమైనవి.
అయితే అదృష్టమేంటంటే ఆహారంలో మార్పుల ద్వారా ఈ సమస్యల బారినపడకుండా చూసుకునే అవకాశం ఉండటం, ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యంలో ఆహారం, పోషకాల పాత్రపై అధ్యయనం చేసిన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ పరిశోధకులు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేదానిపై కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూద్దాం.
పీచు పదార్థాలు
ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యానికి ఇవి చాలా కీలకమైనవి. నీటిలో కరిగే పీచైనా, కరగని పీచైనా ప్రోస్టేట్ కణాల్లో క్యాన్సర్ కారక చర్యలను అడ్డుకుంటాయి. బుడిపెలు(పాలిప్స్) ఏర్పడటాన్ని నివారిస్తాయి. యాపిళ్లతో పాటు నారింజ వంటి పుల్లటి పండ్లలో క్యారట్, బంగాళాదుంప వంటి కూరగాయాల్లో చిక్కుళ్లు, బఠాణీల వంటి పప్పుల్లో బార్లీ, ఓట్స్, తవుడుల్లో నీటిలో కరిగే పీచు దండిగా ఉంటుంది. మెంతులు, పాలకూర, గోబీపువ్వుతో పాటు స్ట్రాబెర్రీ, అరటి పండ్లలో కరగని పీచు ఎక్కువ.
పండ్లు, కూరగాయలు
పుచ్చకాయ, ద్రాక్ష వంటి పండ్లతో పాటు టమాటోలు, క్యాబేజీ, గోబీపువ్వులో యాంటీఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ మూలంగా కణ స్థాయిలో తలెత్తే మార్పులను తగ్గిస్తాయి. క్యాన్సర్లకు దోహదం చేసే విశృంఖల కణాల వల్ల హానీ కలగకుండానూ, ప్రోస్టేట్ గ్రంథిలో కణితి వృద్ధి చెందకుండానూ కాపాడతాయి.

చేపలు(Fish)
సాల్మన్, మాకెరెల్, సార్డైన్ వంటి చేపల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో వాపు ప్రక్రియను తగ్గిస్తాయి. ఇవి ప్రోస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు ప్రోస్టేట్ కణజాలంలో క్యాన్సర్ వృద్ధిని కూడా నిరోధిస్తాయి.
గింజపప్పులు, గింజలు
ప్రోస్టేట్ దెబ్బతినకుండా చూసే సెలీనియం అనే ఖనిజం బాదం, అక్రోట్ వంటి గింజపప్పుల్లో దండిగా ఉంటుంది. వీటిల్లో యాంటీఆక్సిడేంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవీ ప్రోస్టేట్ ఆరోగ్యానికి దోహదం చేసేవే. అవిసె(ఫ్లాక్స్) గింజల వంటి వాటిల్లో లిగ్నన్ అనే పీచు ఎక్కువ. ఇది ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ముప్పును తెచ్చిపెట్టే మలబద్దకం బారినపడకుండా చూస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు తోడ్పడే ఫైటో ఈస్ట్రోజెన్లు కూడా వీటిల్లో ఉంటాయి.
సోయా ఉత్పత్తులు
టోపూ, సోయా పాలు, తదితర సోయా ఉత్పత్తుల్లో ఐసోఫ్లేవనోస్ ఉంటాయి. ఇవి ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బటానికి దోహదం చేసే డైహైడ్రోటెస్టోస్టీరాన్ అనే హార్మోన్ స్థాయులనూ తగ్గిస్తాయి.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ