

Private Jet Owners in India | టాలీవుడ్లో సొంత విమానాలు ఉన్న హీరోలు ఎవరో తెలుసా? జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కో వస్తువుపై ఇష్టం ఉంటుంది. కాబట్టి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఆ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు కొందరు. ఇష్ట పడి వస్తువు కొనడానికి ఎంత డబ్బు అయినా, ఎన్ని కోట్లైనా ఖర్చు పెడుతుంటారు. అలాగే మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన టాలీవుడ్హీరోలు కూడా లక్షల్లో , కోట్లల్లో విలువ చేసే కారులు కొని తిరుగుతుంటారు. మరికొందరు తమకు ఇష్టమైన వారికి గిఫ్ట్ గా కూడా ఇస్తుంటారు.
మన టాలీవుడ్‌కు చెందిన ప్రముఖల్లో కొంతమందికి కార్లే కాదు, ఏకంగా అంతకంటే పెద్ద వాహనాలు ఉన్నాయి. ఆ పెద్ద వాహనాలే విమానాలు. అవును మన తెలుగు హీరోలకు జెట్ విమానాలు ఉన్నాయి. సొంత విమానాల కోసం కోట్లల్లో ఖర్చు పెట్టారు . ప్రక్క రాష్ట్రం వెళ్లాలన్నా, లేదంటే కుటుంబ మంతా కలిసి వేరే పక్క దేశానికి వెళ్లాలన్నా వారి సొంత విమానాల్లో ప్రయాణం చేస్తూ వెళు తుంటారు. నిజంగా తెలుగు చిత్రపరిశ్రమలో కష్టపడి స్టార్ హీరోలుగా ఎదిగిన కొంత మంది కెరీర్ తొలిదశలో చాలా కష్టాలు ఎదుర్కొన్నవారే. అందులో మొట్టమొదటిగా నందమూరి తారకరామారావు పేరును చెప్పుకోవచ్చు. తర్వాత మెగస్టార్ చిరంజీవి, మోహన్‌బాబు, రవితేజ లాంటి హీరోలు కూడా కష్టాలను చవిచూసిన వారే.
అయితే వారికి నటనపై ఉన్న ఆసక్తి, పట్టుదలతో పేదరికాన్ని సైతం లెక్క చేయకుండా చిత్ర పరిశ్రమల్లో నిలదొక్కుకొని పేరుప్రఖ్యాతలతో పాటు,కోటీశ్వర్లు కూడా అయ్యారు. ప్రస్తుతం వారి స్టేటస్సే కాదు. రేంజ్ కూడా పెరిగిపోయిందని చెప్పవచ్చు.
మెగస్టార్ చిరంజీవి స్వయంకృష్టితో కష్టపడి ఎన్నోకష్టనష్టాలను భరించి ఈ స్థాయికి రాగలిగారు. బిడ్డలకు విలాసవంతమైన జీవితం ఇవ్వగలిగారు. చిరంజీవి తన కుమారుడైన హీరో రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అతనికి రూ.3 కోట్ల విలువ చేసే ఆడీ కారును బహుమతిగా ఇచ్చారట. దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి ఏ మేరకు సెటిల్డ్ అయ్యారనేది. ఇక రామ్‌చరణ్‌కు కార్లే కాదు, తన కోసం జెట్ఫ్లైట్ కూడా ఉంది. ఈ జెట్ ఫ్లైట్ ధర రూ.50 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు ధర ఉంటుందనేది సమాచారం.
ఇక నందమూరి తారకరామారావు( జూనియర్ ఎన్టిఆర్)కు కూడా ప్రైవేట్ ఫ్లైట్ ఉందట. ఇటీవల రూ.80 కోట్ల ఖర్చు పెట్టి ప్రవేటు జెడ్ ఫ్లైట్‌ను కొనుగోలు చేశారట. ఇక స్టైల్స్టార్ అల్లు అర్జున్‌కు కూడా తన పెళ్లి అయిన తర్వాత తన కోసం ప్రత్యేకంగా జెట్ ఫ్లైట్‌ను కొనుకున్నారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ చిత్ర పరిశ్రమలో పెద్ద నిర్మాత. ఎన్నో హిట్ సినిమాలను నిర్మించారు. నిర్మాత గా కూడా ఎన్నో కోట్ల రూపాలయను కూడపెట్టారు. ఈ కుటుంబం తలుచుకుంటే జెడ్ఫ్లైట్లను 4,5 కూడా కొనేంత డబ్బు ఉందట. టాలీవుడ్ మన్మధుడు హీరో నాగార్జునకు కూడా జెట్ఫ్లైట్ ఉందట. నాగార్జున తన కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా దూర ప్రాంతానికి వెళ్లేందుకు ఇది బటయకు తీస్తారట. ఇక జెట్ ఫ్లైట్ ఉన్నవారిలో హీరోలే కాకుండా మనకు తెలిసిన ఒక హీరోయిన్‌కు కూడా జెట్ప్లైట్ ఉందట. ఆమె ఎవరో కాదు పుట్టబొమ్మ పూజాహెగ్డే. ఈ ముద్దుగుమ్మకు కూడా జెట్ ఎయిర్ ఫ్లైట్ ఉంది.
ఇక వారి ఫైట్లు ఎక్కడుంటాయో తెలుసా?
వారి కొనుగోలుచేసిన ఫ్లైట్ వారికి దగ్గర్లోనే విమానాశ్రాయల్లో ఉంటాయి. విమానాశ్రయం వారే ఈ సెలబ్రిటీలకు చెందిన జెట్ ఫ్లైట్ల బాగోగులు చూస్తుంటారు. అందుకు నిర్వాహకులకు ప్రతి నెలా స్టార్ హీరోలు కొంత మొత్తం ఛార్జి చెల్లిస్తారు. ఎక్కడికైనా వెళ్లానుకున్నప్పుడు సదరు నిర్వాహకులకు ఫోన్ చేసి ఫ్లైట్‌ను రెడీగా ఉంచాలని చెబుతారు. నేరుగా తమ సొంత ఎయిర్ప్లైట్లో కూర్చొని గగనవిహారం చేస్తుంటారు. ప్రస్తుతం హీరోల సంపాదన మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉండటంతో వారు వారికి నచ్చిన విధంగా సకలసౌకర్యాలను అనుభవిస్తున్నారు.