private aadhar center: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ఆధార్ సెంటర్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రయివేటు (ఔట్ సోర్సింగ్) ఆధార్ సెంటర్లు క్రమ క్రమంగా మూతపడ నున్నట్టు తెలుస్తోంది. ప్రయివేటు భవనాల్లో నడిచే ఈ సెంటర్లు అన్నీ ఇకపైన ప్రభుత్వ కార్యాలయాల్లోకి మారాల్సి ఉంది. ఇక నుంచి ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఈ కేంద్రాలన్నీ పనిచేయనున్నాయి.
private aadhar center: ప్రైవేటు ఆధార్ సెంటర్స్ బంద్!
తెలంగాణలో ఈ నెల నుంచి ఒక్కొక్కటిగా ప్రయివేటు ప్రాంగణాల నుంచి ప్రభుత్వ భవనాల్లోకి మారే ప్రక్రియ మొదలుకానున్నది. దీనికోసం టీఎస్టీఎస్ (తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్), టీఎస్ ఆన్లైన్ విభాగాలు ప్రత్యేక దృష్టి సారించనున్నాయి. ఈ ప్రక్రియ 2023 మార్చి 31నాటికి పూర్తికావాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందట.
ప్రయివేటు ఆధార్ సెంటర్ల (private aadhar center) బంద్ దేశవ్యాప్తంగా అమలవు తుండగా, ఈ విధానంలో భాగంగా Telangana ప్రభుత్వం ఈ ప్రణాళిక రూపొందించింది. VLE (విలేజ్ లెవల్ ఎంట్రిప్రెన్యూర్స్) మోడల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు ప్రయివేటు వ్యక్తులకు Outsourcing పద్ధతి ద్వారా ఎన్రోల్మెంట్ సెంటర్లను నిర్వహించుకునేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డుని అందజేయడానికి వీలుగా తీసుకున్న నిర్ణయం ఆశించిన ఫలితాలనే ఇచ్చిందని అటు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు, UIDAI భావించాయి. అయితే 2022 సెప్టెంబర్ నాటికి సుమారు 134 కోట్ల ఆధార్ కార్డులు జారీ అయ్యాయని, దీన్ని బట్టి 93 శాతం మందికి మంజూరయ్యాయని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ల కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇప్పటి వరకు ఎలా జరిగినా ఇక నుంచి ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అన్నిఆధార్ కేంద్రాలూ ప్రభుత్వం పరిధిలోనే జరగాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై గతంలో అనగా 2017లో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో అప్పట్లో చర్చించింది కేంద్రం. అయితే ఈ చర్చపై ఏకాభిప్రాయమే వ్యక్తమైంది. కాగా ఇటీవల ఉగ్రవాదులు నకిలీ ఆధార్ కార్డులతో దేశంలో చొరబడుతున్నారు. నకిలీ ఆధార్ కార్డులతో ప్రభుత్వ వ్యతిరేక కార్యాకలాపాలను కొందరు కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే ఆదేశాలు జారీ!
కాబట్టి ఇక ఆధార్ నమోదు కేంద్రాలు ఏమాత్రమూ ప్రయివేటు (private aadhar center) చేతుల్లో ఉన్నా భద్రత కరవేనని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ స్పెషల్ CS జయేశ్ రంజన్ ఇటీవల TSTS మేనేజింగ్ డైరెక్టర్‌కు, TS Online నిర్వాహకులకు లేఖ రాశారు. ఇక అన్ని ప్రయివేటు, ఔట్ సోర్సింగ్స ఎంటర్లతో మాట్లాడి ఏ నెలలో ఎక్కడెక్కడ నుంచి సెంటర్లను తరలించాలో ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు.
ప్రస్తుతం ప్రైవేటులో కొత్త aadhar enrolment సెంటర్లకు అనుమతి ఇవ్వొద్దని జయేశ్ రంజన్ ఆ లేఖలో పేర్కొన్నారు. In-house model తరహాలో ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో నెలకొల్పితేనే పర్మిషన్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రైవేటు సెంటర్లు ఉన్నాయో రిజిస్ట్రార్ ద్వారా గుర్తించనున్నారు. వాటిని తరలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.