prevent pests: మ‌న ఇంట్లో కీట‌కాలు నివార‌ణ‌కు ఇలా చేయండి?

prevent pests వానాకాలంతో పాటు సాధార‌ణంగా అన్ని కాలాల్లోనూ ర‌క‌ర‌కాల పురుగులు, కీట‌కాలు ఇంట్లోకి వ‌స్తుంటాయి. అదే విధంగా దోమ‌ల బెడ‌ద కూడా ఎక్కువుగానే ఉంటుంది. వాటిని దూరం చేయాలంటే ఈ చిట్కాలు ప్ర‌య‌త్నించి చూడండి. దోమ‌లు ఇక ఇంటిలో కనిపించే ప్ర‌స‌క్తే ( prevent pests)ఉండ‌దు.

నిమ్మ‌గ‌డ్డి నూనె(lemongrass oil)

పావు క‌ప్పు వేణ్నీళ్ల‌లో 12 చుక్క‌ల నిమ్మ గ‌డ్డి నూనె క‌ల‌పాలి. ఈ నీళ్ల‌ని ఒక స్ప్రే సీసాలోకి తీసుకోవాలి. త‌లుపులూ, కిటికీల వ‌ద్ద ఈ నీళ్ళ‌ని చ‌ల్లుతుంటే కీట‌కాలూ, ఇత‌ర పురుగులు(prevent pests) ఇంట్లోకి చొర‌బ‌డ‌కుండా ఉంటాయి.

తుల‌సి (tulsi)

ఈగ‌లు ఎక్కువుగా ఉన్న‌ప్పుడు తుల‌సి కొమ్మ‌ల్ని వంట‌గ‌దీ, భోజ‌నాల గ‌ది వ‌ద్ద ఉంచాలి. ఒక వేళ తాజా కొమ్మ‌లు దొర‌క్క‌పోతే ఎండిపోయిన ఆకుల్ని మ‌స్లిన్ వ‌స్త్రంలో ఉంచి వేలాడిదీస్తే స‌రి. అలానే లావెండ‌ర్‌, త‌మ‌ల‌పాకులూ, పుదీన వంటివి కూడా ఈగ‌ల్ని పార‌దోల‌తాయి.

వెల్లుల్లి (garlic)

నాలుగు వెల్లుల్లి రెబ్బ‌ల్ని తీసుకుని, బాగా దంచి గ్లాసు నీళ్ల‌లో ఉడికించాలి. ఈ నీళ్ల‌ని వ‌డ‌క‌ట్టి స్ప్రే సీసాలో తీసుకోవాలి. చ‌ల్లారాక ఇంటి బ‌య‌ట‌, బాల్కానీలో చ‌ల్లితే లోప‌లికి దోమ‌లు రాకుండా ఉంటాయి.

బొద్దింక‌లు
క‌ర్పూరం (Camphor)

క‌ప్పు వేప నూనెలో మెత్త‌గా పొడి చేసిన క‌ర్పూరం వేయాలి. ఈ మిశ్ర‌మాన్ని దోమ‌ల రిపెల్లెంట్‌లో ఉంచి, ప్ల‌గ్‌లో పెట్టుకోవాలి. గ‌దిలో దోమ‌లూ, ఇత‌ర పురుగులు ఉంటే వెంట‌నే చ‌నిపోతాయి.

Share link

Leave a Comment