President of china 2022 చైనా దేశం భారత్‌ను గిల్లి మరీ కయ్యానికి కాలుదువ్వుతోంది. ఇప్పటికే పలుమార్లు సరిహద్దుల వద్ద ఏదో ఒక రూపంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్న చైనా ఇప్పుడు రాజకీయంగా కూడా తెరలేపినట్టు ఉంది. అయితే ఇది ఆ దేశ అధ్యక్షుడుపై తీవ్ర ప్రభావం చూపబోతుందని అక్కడ రాజకీయాలను బట్టి తెలుస్తుంది. ఆ దేశ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఏం జరగబోతుంది? అక్కడ రాజకీయాలకు భారత్‌కు(President of china 2022) సంబంధం ఏమిటి? అనే వాటికి కారణాలు లేకపోలేదు.
జిన్ పింగ్ పన్నాగాలు!
ఈ ఏడాది చైనా దేశ అధ్యక్షులు జిన్‌పింగ్(xi Jinping) ముచ్చటగా మూడోవ సారి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. గతేడాది (2021) నవంబర్‌లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(communist party of china) 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. అప్పుడు ప్రభుత్వాన్ని నడిపించేందుకు విధించిన రెండు పదవీ కాలాల పరిమితిని విధించింది. దీంతో పాటు సెంట్రల్ మిలటరీ పగ్గాలను దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అప్పగించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో 3వ సారి అధ్యక్షుడుగా మారటానికి మార్గం సులభం అయిందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
భారత్‌కు సంబంధం ఏమిటి?

అయితే మూడవ సారి జిన్ పింగ్ అధ్యక్షుడు కావడానికి భారత్‌కు సంబంధం ఉందని కూడా చెబుతున్నారు కొందరు విశ్లేషుకులు. ఈ సారి జిన్ పింగ్ అధ్యక్షుడుగా గెలవడం(Jinping) అంత ఇజీగా కాదంట. కారణం చైనాలో ఆయనపై తీవ్రత వ్యతిరేకత కూడా ఉందంట. ఈ నేపథ్యంలో భారత్‌తో కయ్యాలు పెట్టుకోవడం కారణంగా దేశంలో తన పరపతిని పెంచుకోవాలని చూస్తున్నట్టుగా జిన్ పింగ్ ఆలోచన ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జాతిభావం పెంచి లాభపడాలని కూడా చూస్తున్నారంట జిన్ పింగ్. భారత్‌తో కయ్యాలు పెట్టుకోవడంలో భాగంగా పాంగాగ్ సరస్సుపై వంతెనలు నిర్మించడం, గెల్వాన్ లోయలో జెండా ఎగురవేయడం లాంటి పనులు చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈవన్నీ గ్రహించే భారత్ సమయానుకూలంగా స్పందిస్తుందంటున్నారు భారత్ దౌత్యవేత్తలు. అనవసరంగా రియాక్ట్ అయితే భారత్‌నూ బూచీగా చూపించి జిన్ పింగ్ లాభపడే చాన్సులు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ