Core Web Vitals Assessment: Covid Vaccine : ఇక గ‌ర్భిణీల‌కు కూడా! రాష్ట్రాల‌కు కేంద్రం సూచ‌న‌!

Covid Vaccine : ఇక గ‌ర్భిణీల‌కు కూడా! రాష్ట్రాల‌కు కేంద్రం సూచ‌న‌!

Covid Vaccine : దేశంలో క‌రోనా ముప్పును త‌గ్గించేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో భాగంగా వ్యాక్సిన్ ప్ర‌ధాన‌మైన‌ది. ఈ నేప‌థ్యంలో 18 సంవ‌త్స‌రాలు నిండిన వారంద‌రూ టీకా వేయించుకుంటున్నారు. అయితే తాజాగా గ‌ర్భిణీ స్త్రీల‌కు కూడా టీకా వేయ‌వ‌చ్చ‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.


Covid Vaccine : గ‌ర్భిణీల‌కు కూడా కోవిడ్ టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అనుమ‌తి ఇచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం వారు కోవిన్ యాప్‌లో న‌మోదు చేసుకోవ‌చ్చ‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. అదే విధంగా స‌మీప కేంద్రాల‌కు నేరుగా వెళ్లి టీకా వేయించుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు చిన్న పిల్ల‌ల త‌ల్లుల‌కు మాత్ర‌మే వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమ‌తించిన కేంద్ర ప్ర‌భుత్వం.. తాజాగా గ‌ర్భిణీ స్త్రీల‌కు కూడా టీకా ఇవ్వాల‌ని అన్ని రాష్ట్రాల‌కు ఆదేశాలు జారీ చేసింది. దేశ‌ వ్యాప్తంగా 18 సంవ‌త్స‌రాలు నిండిన వారంద‌రికీ వ్యాక్సిన్ ఇచ్చే కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో గ‌ర్భిణుల‌పై విస్తృత ప్ర‌యోగాల వివ‌రాలు లేక‌పోవ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఇదే స‌మ‌యంలో వైర‌స్ బారిన‌ప‌డుతున్న గ‌ర్భిణీస్త్రీల సంఖ్య పెర‌గ‌డం, రానున్న రోజుల్లోనూ థ‌ర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉంద‌న్న హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య‌శాఖ ఈ విష‌యంపై మ‌రోసారి చ‌ర్చించింది.

ఈ నేప‌థ్యంలో గ‌ర్భిణుల‌కు కూడా టీకా ఇవ్వ‌వ‌చ్చు అని నేష‌న‌ల్ టెక్నిక‌ల్ అడ్వ‌యిజ‌రీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేష‌న్ (NTAGI) ప్ర‌భుత్వానికి సిఫార్సు చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య‌శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా విడుద‌ల చేసింది. కోవిడ్ ముప్పు అంద‌రికీ పొంచిఉన్న నేప‌థ్యంలో గ‌ర్భిణీ ల‌కు టీకా ఎంతో ముఖ్య‌మ‌ని, త‌ప్ప‌కుండా వారికి అందించాల్సిందేన‌ని ఐసీఎంఆర్ నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ ఇచ్చే ముందు వాటి వ‌ల్ల క‌లిగే దుష్ప‌ర్భావాలను వారికి వివ‌రించాల్సి ఉంద‌ని తెలిపారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *