Snake Bite : పాము కాటేసిన‌ప్ప‌డు ఆందోళ‌న చెందారో?

0
83

Snake Bite : పాము కాటేసిన‌ప్ప‌డు ఆందోళ‌న చెందారో?

Snake Bite : సాధార‌ణంగా పాము అంటే అంద‌రికీ భ‌య‌మే. ఏదైనా పాము కాటు వేసిందంటే చాలు ఇక ప్రాణాలు పోతాయే మోనంత టెన్ష‌న్ వ‌స్తుంది. కానీ ఈ భ‌య‌ముకు కార‌ణం పాముల గురించి స‌రైన స‌మ‌చారం లేక‌పోవ‌డం, అపోహ‌లు, అప‌న‌మ్మ‌కాలేన‌ని కొంద‌రు వ్యైద్యులు చెబుతున్నారు. సాధార‌ణంగా పాముల్లో రెండు ర‌కాలుగా ఉంటాయి. విషం ఉన్న పాములు, విషం లేని పాములు. వాస్త‌వానికి విష స‌ర్పాల క‌న్నా విషం లేని ప్ర‌మాదం క‌లిగించ‌ని పాములే ఈ భూమిపై ఉన్నాయి. అలా అని పాము కాటు వేసిన‌ప్పుడు మాత్రం అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌దు. వెంట‌నే ద‌గ్గ‌ర‌లో ఉన్న ఏదైనా ఆస్ప‌త్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. విష స‌ర్పం కాటు వేసిన‌ప్పుడు ప‌లు ర‌కాల కార‌ణాల‌తో ఆల‌స్య‌మై కొంద‌రు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక విషం లేని పాము క‌రిచిన‌ప్ప‌టికీ ఆందోళ‌న‌, భ‌యంతో మ‌రికొంద‌రు ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. వాస్త‌వానికి పాము మ‌నిషికి ఎప్పుడూ శ‌త్రువు కాదు. పాము త‌న ఆత్మ ర‌క్ష‌ణ కోసం ఇక విధి లేని ప‌రిస్థితుల్లో మాత్ర‌మే కాటు వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. ఒక్కొక్క‌సారి కాటు కూడా వేస్తుంది.

పాములు ఎక్క‌డెక్క‌డ ఉంటాయి అంటే?

  • మ‌న ఇళ్ల‌ల్లో ధాన్య‌పు గొట్టాలు, గ‌రిసెలు, గ‌డ్డి వాముల్లో ఎలుక‌లు ఎక్కువుగా తిరుగుతుంటాయి ఇక త‌డిగా ఉండే ప్ర‌దేశాల్లో క‌ప్ప‌లు ఉంటాయి. త‌న ఆహారం కోసం వెతుకున్న స‌మ‌యంలో పాములు వాటిని తిన‌డానికి ఆ ప్ర‌దేశాల్లోకి వ‌స్తాయి.
  • ఏమైనా నిల్వ ఉండే దుంగ‌లు, క‌ట్టెలు క‌దిలించిన‌ప్పుడు కూడా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎందుకంటే వాటి మ‌ధ్య‌లో పాములు, తేళ్లు ఏమైనా విష పురుగులు ఉండే ప్ర‌మాదం ఉంది. కొన్ని ఏరియాల్లో పిడ‌క‌లు దొంత‌రుల‌గా పేర్చి ఉంచుతారు. వాటి మ‌ధ్య‌కు కూడా పాములు చేరుతాయి.
  • పొలాల్లో చేల గ‌ట్ల వెంబ‌డి క‌న్నాల్లో పాములు ప్ర‌వేశిస్తాయి. అటుగా వెళ్లిన‌ప్పుడు క‌ర్ర‌తో శ‌బ్ధం చేస్తూ న‌డవ‌డం మంచిది. పాత కాలంలో పొలాల్లోకి వెళ్లే రైతులు కిర్రు చెప్పులు వేసుకునేవారు. ఆ చెప్పుల సౌండ్‌కు కూడా పాములు వెళ్లిపోతాయి. ఈ కిర్రు చెప్పుల వ‌ల్ల పాము కాటు ప్ర‌మాదాలు చాలా త‌గ్గుతాయి.
  • ఇక రాత్రి స‌మ‌యంలో చేల‌కు నీళ్లు పెట్ట‌డానికి రైతులు వెళుతుంటారు. ఆ స‌మ‌యంలో రాత్రిపూట మోటారు వేయ‌డానికో, నీరు పెట్ట‌డానికో వెళ్లిన‌ప్పుడు పాములు తార‌స ప‌డ‌తాయి. ఒక్కోక్క‌సారి మోటార్ షెడ్‌ల్లోనూ, క‌రెంటు బాక్సుల్లోనూ పాములు న‌క్కి ఉండొచ్చు. కాబ‌ట్టి జాగ్ర‌త‌గా ప‌రిశీలించాలి.

విషమున్న పాములు కాటువేస్తే!

విష స‌ర్పాలు అనేక ర‌కాలు ఉన్న‌ట్టే, అవి వేసే కాటు వ‌ల్ల బాధితుల్లో భిన్న‌మైన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. పాము కాటేసిన స‌మ‌యంలో బాధితుడి శ‌రీరంలోకి ఎక్కిన విషం ప‌రిణామం బ‌ట్టి కూడా ప్ర‌మాద స్థాయి ఉంటుంది. ముఖ్యంగా త్రాచు పాము కాటు వేసిన‌ప్పుడు విష ప్ర‌భావం ఎక్కువుగా ఉంటుంది. న‌ల్ల త్రాచు (కింగ్ కోబ్రా) విషం ప్ర‌భావం చాలా త్వ‌ర‌గా క‌నిపించి ప్రాణాంత‌కంగా మారుతుంది. క‌ట్ల పాములు, ర‌క్త పింజ‌ర పాముల విష ల‌క్ష‌ణాలు మ‌రో ర‌కంగా ఉంటాయి. సాధార‌ణంగా విష స‌ర్పం కాటు వేసిన ప్ర‌దేశంలో పాము కోర‌ల గాయం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఈ నొప్పి క్ర‌మ క్ర‌మంగా శ‌రీరం పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. ప‌క్ష‌వాతం తొలి ద‌శ‌లో ఎలాగైతే ఉంటుందో అలానే పాము కాటు వ‌ల్ల నాలుక మంద‌మైన‌ట్టు, గొంతు కండ‌రాలు బిగుసుకున్న‌ట్టు ఉండి నోటి నుంచి నుర‌గ‌లు కూడా వ‌స్తాయి. క‌ళ్లు మ‌గ‌తగా,శ‌రీరం మ‌త్తుగా ఉండి స్పృహ కోల్పోయే అవ‌కాశం ఉంటుంది. పాము కాటు వేసిన బాధితుడును సాధ్య‌మైనంత త్వ‌ర‌గా చికిత్స అందించ‌క‌పోతే ప‌రిస్థితి విష‌మించ‌వ‌చ్చు.

పాము కాటేసిన‌ప్పుడు ఏం చేయాలి?

పాము కాటేసిప్పుడు ఆ వ్య‌క్తి మొట్ట‌మొద‌టిగా భ‌యాందోళ‌న‌కు గురికావ‌ద్దు. ఎప్పుడైతే భ‌యం పుడుతుందో శ‌రీరంలోని ర‌క్త ప్ర‌స‌ర‌ణ పెరిగి విష‌యం త్వ‌ర‌గా వ్యాపించే ప్ర‌మాదం ఉంది. పాము కాటేసిన వ్య‌క్తికి ప్ర‌క్క‌నున్న స‌హాయ‌కులు ధైర్యం చెప్పాలి. పాము కాటేసిన స‌మ‌యంలో అస‌లు ఆ పాము విష‌స‌ర్ప‌మా? లేదా అని గుర్తించే ప్ర‌యత్నం చేయాలి. దాని వ‌ల్ల చికిత్స సుల‌భం అవుతుంది. వైద్యం కూడా ఖ‌చ్చితంగా అందిస్తారు వైద్యులు. నాటు వైద్యం, మూఢ‌న‌మ్మ‌కాల‌తో మంత్రాల పేరుతో ఆల‌స్యం చేయ‌కుండా సాధ్య‌మైనంత త్వ‌ర‌గా స‌మీపంలో ఉన్న ఆసుప‌త్రికి బాధితుడుని తీసుకెళ్లాలి. ఆ స‌మ‌యంలో ఆటో,అంబులెన్స్‌, స్కూట‌ర్ క‌నీసం మంచం ఉన్నాస‌రే దానిపైన‌ ఆసుప‌త్రికి త‌ర‌లించాలి. రోగిని ఎట్టి ప‌రిస్థితుల్లో న‌డిపించ‌కూడ‌దు. పాము కాటేసిన‌ప్పుడు కొంత మంది ఆ కాటు వ‌ద్ద గాయాన్ని మ‌రింత కోస్తే ర‌క్తంతో పాటు విషం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని క‌త్తితో, బ్లేడుతో గాటు పెడుతుంటారు. ఎట్టి ప‌రిస్థితుల్లో అలా చేయ‌వ‌ద్దు. ఒక్కొక్కాసారి పాము కాటు క‌న్నా ఈ గాయ‌మే ప్ర‌మాద‌క‌రంగా మారుతుంది. కొన్ని సార్లు పాము క‌రిచిన ప్ర‌దేశాల్లో గాటు పెట్టి నోటితో విషం పీల్చేస్తుంటారు. పాము కాటు వేయ‌గానే విషం ర‌క్తం ద్వారా శ‌రీరంలోని అన్ని భాగాల‌కు, గుండెకు చేరుకుంటుంది. కావున దీనివ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌క‌పోవ‌చ్చు.

Latest Post  Covid Second wave : ఆరు రాష్ట్రాల్లో ఆందోళ‌న క‌లిగిస్తున్న క‌రోనా కేసులు

ఎన్ని ర‌కాల పాములు ఉన్నాయి?

భార‌త దేశంలో సుమారు 300 ర‌కాల పాములు ఉన్నాయి. వాటిల్లో 66 ర‌కాల పాములే విష‌పూరిత‌మైన‌వి. వాటిలో 61 ర‌కాల పాముల్లో మ‌నిషిని చంపేంత విషం ఉండ‌దు. మ‌రో 5 ర‌కాల పాముల‌తోనే ప్రాణ‌హాని ఉంటుంది. తెలంగాణ‌లో సుమారు 31 ర‌కాల పాములు ఉండ‌గా, వాటిల్లో 6 పాములు మాత్ర‌మే విష‌పూరితమైన‌వి. త్రాచుపాము, ర‌క్త పింజ‌ర‌, క‌ట్ల పాము, చిన్న పింజ‌ర తెలంగాణ‌లోని అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక ఏటూరునాగారం ఏరియాలో లంబిడి గాజుల పాము త‌రుచుగా క‌నిపిస్తుంది. బ్యాంబూ బిట్ వైఫ‌ర్ ఇది అరుదైన ర‌క్త పింజ‌న‌, ఈ 6 ర‌కాల పాములే తెలంగాణ‌లో విష‌పూరిత‌మైన‌వి. మిగిలిన పాములు సాధార‌ణ‌మైన‌వి.

పాము కాటు – ముఖ్య విష‌యాలు!

  • ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అంచ‌నా ప్ర‌కారం ప్ర‌తి ఏడాది సుమారు 50 ల‌క్ష‌ల మంది పాము కాట్లకు గుర‌వుతున్నార‌ట‌. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి ఏడాది 81,000 వేల నుంచి 1,38,000 మంది పాము కాట్ల‌కు బ‌లవుతున్నారు. ఈ మ‌ర‌ణాల్లో కేసులు స‌గం ఇండియాలోనే చోటుచేసుకుంటున్నాయ‌ట‌.
  • పాము కాట్ల కార‌ణంగా అంధత్వం వ‌స్తుంది. అవ‌యవాలూ తొల‌గించ‌డ‌మూ జ‌రుగుతుంది. ఇలా వేలాది మంది శాశ్వ‌త వైక‌ల్యానికి లోన‌వుతున్నార‌ట‌.
  • స‌హారా ఏడారికి ద‌క్షిణాన ఉన్న ఆఫ్రికా దేశాలు, ద‌క్షిణాసియా, ఆగ్నేసియాల్లో జ‌న‌సాంద్ర‌త ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో మనుషుల‌కు పాములు త‌రుచూ తార‌స‌ప‌డ‌టంతో పాటు ఈ ప్రాంతాల్లోనే పాము కాట్లు అధికంగా చోటు చేసుకుంటున్నాయ‌ట‌.
  • ముఖ్యంగా పేద‌, గ్రామీణ జ‌నాభా నివసించే ప్రాంతాల్లో పాము కాట్ల ప్ర‌మాదం ఎక్కువుగా ఉంటుంది. పాము కాటు విరుగుడు వారికి అందుబాటులో లేక‌పోవ‌డం, ద‌గ్గ‌ర‌లో ఆసుప‌త్రులు లేక‌పోవ‌డం, ఆధునిక వైద్య స‌దుపాయాలు లేక‌పోవ‌డం వ‌ల్ల సంప్ర‌దాయ చికిత్స‌లు అన‌గా మంత్రాలు, మూఢ‌న‌మ్మ‌కాల‌పై ఆధార‌ప‌డి ప్రాణాలు విడుస్తున్న వారు ఎక్క‌వుగా ఉన్నార‌ట‌.
  • పామ కాటు వేసిన‌ప్పుడు యాంటీవీన‌మ్ ఇంజ‌క్ష‌న్ సాధ్య‌మైనంత త్వ‌ర‌గా బాధితుడుకు ఎక్కించాల్సి ఉంటుంది. అయితే పాము కాట్లు అధికంగా ఉండే చాలా దేశాల్లో సొంతంగా యాంటీవీన‌మ్ ఉత్ప‌త్తి చేసే స‌దుపాయాలు లేవ‌ట‌.
Latest Post  Work From home ఉద్యోగం వ‌ల్ల న‌ష్టాలు- లాభాలు ఏమిటి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here