summer safety tips : ఈ వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. చిన్న పిల్లల మొదలు ముసలివారు వరకు ఎండ వేడిమి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా నెలల పసిపిల్లలు అయితే వారి ఇబ్బందిని చెప్పుకోలేరు. కాబట్టి వేసవి కాలంలో పసి పిల్లల గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.
summer safety tips : పసిపిల్లలు ఉన్న ఇళ్లల్లో వేసవికాలం(summer ) కాస్త ఎక్కువుగా జాగ్రత్తలే తీసుకోవాలి. చిన్నారుల్ని వేడి నుంచి కాపాడుకోవడమే కాకుండా దోమల((Mosquito)) బారిన పడనీయకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా మరెన్నో జాగ్రత్తలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం!
- వేసవిలో కరెంటో కోతలు బాగానే ఉంటాయి కాబట్టి పగటిపూట ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. తాజాగా వచ్చే గాలి ఇంటిని చల్లబరుస్తుంది. వేడిగాలులు బాగా వీస్తుంటే తలుపులు మూసేయాల్సిందే. అవి మూసేసి ఇంట్లో చల్లగా ఉండే గదిలో ఉండాలి.
- కార్పెట్లు(carpet), మ్యాట్లు(mats) వంటి వాటిని ఈ సీజన్లో వాడొద్దు. వాటిని శుభ్రంగా మడిచి పక్కన పెట్టేయాలి. గచ్చు మీద ఏమీ లేకపోతేనే కూర్చున్నా, పడుకున్నా చల్లగా ఉంటుంది. పిల్నల్ని కటిక నేలమీద పడుకోబెట్టలేం కాబట్టి వారి వరకు దుప్పట్లు, పలుచటి బొంతలు పరిస్తే సరిపోతుంది.


- సూర్యాస్తమయం, సూర్యోదయం సమయాల్లో దోమలు చాలా చురుకుగా ఉంటాయి. అందుకని ఆ సమయాల్లో తలుపులు, కిటికీ రెక్కలు మూసేయాలి. లేదంటే దోమలు కుట్టి మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులు బారిన పడాల్సి వస్తుంది.
- దోమల బారినుండి తప్పించుకునేందుకు ఇన్సెక్ట్ రెసెల్లెంట్స్, మస్కిటో మ్యాట్స్, కాయిల్స్ వంటివి వాడుతున్నారా? వీటి వల్ల తీవ్రమైన అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. అందుకని వాటిని ఇంటిలోపల వెలిగించే బదులుగా ఇంటి బయట వెలిగిస్తే దోమల్ని నియంత్రించొచ్చు.
- కరెంటు ఉంటేనే ఫ్యాన్ తిరగాలనేం లేదు. ఇన్వర్టర్లు, జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలి. ఒక వేళ ఇవేమీ లేవంటే మార్కెట్లో చిన్న చిన్న బ్యాటరీ ఫ్యాన్లు (battery fan) దొరుకుతాయి. వాటిని కొనుక్కోవడం ఉత్తమం.
మెత్తని చల్లని దుస్తులు!
- పిల్లలకి మెత్తగా ఉండే నూలు(cotten) దుస్తులను వేయాలి. సింథటిక్ బట్టలు వేస్తే అవి శరీరంలో వేడి పుట్టిస్తాయి. దీంతో బిడ్డకు అసౌకర్యంగా ఉంటుంది. అంతే కాదు వీటివల్ల చెమటపొక్కులు వచ్చే అవకాశం ఉంది.
- ఒక వేళ ఎండలో బయటకి తీసుకెళ్లాల్సి వస్తే పొడవాటి చేతులు ఉండి, మెత్తగా ఉన్న దుస్తులనే వేయాలి.
- ఎండ నుంచి కాపాడేందుకు వెడల్పులాంటి టోపీలను తలకు పెట్టాలి. ఈ టోపీల రిమ్ వెడల్సుగా ఉండాలి. అప్పుడు టోపీ తలకు సరిపోతుంది. ఎలస్ట్రిక్ ఉన్న టోపీలు వాడొద్దు. ఇవి వాడితే రక్త ప్రసరణ సరిగా జరగదు.


వేడిగా ఉన్నప్పుడు!
- ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉంటుంది. అందుకని పిల్లల్ని ఆ సమయంలో ఎండలోకి తీసుకెళ్లొద్దు. తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వస్తే అన్ని రకాలుగా సురక్షితమైన చర్యలు తీసుకోవాలి.
- లేత ఎండ ఉండే ఉదయం లేదా సాయంత్రం తర్వాత వేళల్లో బయటికి తీసుకెళ్లొచ్చు. ప్రామ్(pram)లో పిల్లల్ని పడుకోబెట్టి తీసుకెళ్తుంటే కనుక అందులో అదనంగా ప్యాడింగ్ ఉంటే దాన్ని తీసేయాలి. అది వేడిగా ఉంటుంది. లేదంటే ప్రామ్లో నూలు వస్త్రాలు పరవొచ్చు. ప్రామ్ మీద ఉంటే సింథటిక్ కవరింగ్ కంటే కూడా నూలు బట్ట మీద పడుకోబెట్టడం వల్ల వేడిని తగ్గించొచ్చు.


న్యాపీ(napkey)ల విషయంలో జాగ్రత్తలు
- వాడి పారేసే అంటే, డిస్పోజబుల్ న్యాపీ(napkey)లు వేడిగా ఉంటాయి. అదీకాక డిస్పోజబుల్ న్యాపీల్లో ఉండే సింథటిక్ బ్యాండ్ వల్ల చెమట పట్టే ప్రదేశాల్లో వేడిపొక్కులు ఏర్పడే అవకాశం ఉది. అందుకని నూలు న్యాపీలు వాడటమే ఉత్తమం.
- అదే నూలు న్యాపీలు సౌకర్యంగా ఉండటమే కాకుండా వేడిని కలిగించవు. న్యాపీ ర్యాష్ కూడా రాదు. ఒక వేళ డిస్పోజబుల్ న్యాపీ(disposable napkin)లే వాడుతుంటే కనుకు పిల్లల్ని చల్లటి వాతావరణంలో ఉండాలి. వేడి పుట్టని విధంగా పిల్లలకు డ్రెస్ వేయాల్సి ఉంటుంది.
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?