prawn curry: రొయ్యలు కూరంటే భారతీయులకు చాలా ఇష్టం. ముఖ్యంగా రొయ్యలతో చేసే ఏ ఐటమ్ ఇష్టంగా తింటారు. సౌత్ ఇండియాలో పండుగలకు ఇళ్లకు వచ్చిన బంధువులకు రొయ్యలతో చేసిన వంటలు వడ్డిస్తారు. ఇక వీకెండ్ కు రెస్టారెంట్ కు వెళ్లే వారు కూడా రొయ్యల తో చేసిన వెరైటీలను ఆరగిస్తుంటారు. ఇంత ఇష్టంగా తినే రొయ్యల కూర ను ఎలా వండాలో కొంత మందికి తెలియదు. వారి కోసమే ఈ రొయ్యల రకాల కూరలు తయారీ కింద వివరించబడింది. మీరు కూడా రొయ్యల (prawn curry) తో రకరకాల ఫుడ్ ఐటమ్స్ ను ట్రై చేయండి.
prawn curry: గోవా రొయ్యల మసాలా
కావాల్సిన పదార్థాలు
మీడియం సైజు రొయ్యలు – 1 కేజీ
పల్లీ నూనె – 120 మి.లీ
ఉల్లిపాయలు – 90 గ్రా
ఉప్పు – రుచికి తగినంత
పేస్టుకు కావాల్సిన వస్తువులు
ఎండు మిరపకాయలు – 15
జీలకర్ర – 20 గ్రా
పసుపు – 5 గ్రా
లవంగాలు – 15
దాల్చిన చెక్కలు – 2 ఒక అంగుళం సైజువి
అల్లం – 30 గ్రా
మాల్ట్ వెనిగర్ – 90 మి.లీ
తయారు చేసే పద్ధతి
రొయ్యలను శుభ్రంగా కడిగి, ఉల్లిపాయలు చెక్కు తీసి తరుక్కోవాలి. పేస్ట్ కోసం పెట్టుకున్న పదార్థాలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఒక మూకుడులో నూనె వేడి చేసి ఉల్లిపాయలు వేసి మంట మధ్యస్థంగా ఉంచి వేయించాలి. అందులో పేస్ట్ వేసి oil పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత అందులో అందులో రొయ్యలు మెత్తబడే వరకు ఉడకనివ్వాలి. నీరు కూడా ఇరిగిపోవాలి. ఆ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి.
రొయ్యల మంచూరియా
కావాల్సిన పదార్థాలు
రొయ్యలు – 250 గ్రా
ఉల్లిగడ్డ – ఒకటి
శనగపిండి – అరకప్పు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 2 గ్రా
పచ్చి మిరపకాయలు – 5
కొత్తి మీర – ఒక కట్ట
ఉప్పు, నూనె – సరిపడినంత
తయారు చేసే విధానం
ఉల్లిపాయలను, పచ్చి మిరపకాయలను కలిపి పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి. రొయ్యలను శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. దీంట్లో శనగపిండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల పేస్ట్, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొత్తి మీర వేసి బాగా కలపాలి. ఇలా ఒక గంటపాటు ఉంచేయాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడయ్యాక మిశ్రమాన్ని ఉండలుగా చేసి వేయాలి. బంగారు రంగులోకి వచ్చాక తీసేస్తే నోరూరించే రొయ్యల మంచూరియా రెడీ.
రొయ్యలు – బీరకాయతో
కావాల్సిన పదార్థాలు
బీరకాయలు – అరకిలో
పచ్చిరొయ్యలు – పావు కిలో
ఉల్లిపాయలు – రెండు
పచ్చి మిరపకాయలు – నాలుగు
కరివేపాకు – రెండు రెబ్బలు
కారం – ఒక టీ స్పూను
పసుపు – చిటికెడు
ధనియాల పొడి – ఒక టీ స్పూను
జీలకర్ర పొడి – ఒక టీ స్పూను
అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు టీ స్పూన్లు
ఉప్పు – తగినంత
కొత్తిమీర – ఒక కట్ట
నూనె – సరిపడా
తయారు చేయు విధానం
prawn curry: ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక రొయ్యల్ని వేసి వేగించాలి. రొయ్యలు కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. రొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగాక ధనియాల పడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. కూర దగ్గరగా ఉడికిన తర్వాత కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి దించేయాలి.