Prasadam Boorelu: మనం ఎక్కడైనా ప్రసాదం బూరెలు తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మన ఇంటిలోనే ప్రసాదం బూరెలు తయారు చేయడం నేర్చుకుంటే ఎప్పుడైనా ఏ సమయంలోనైనా మనం తినవచ్చు. అసలు ప్రసాదం బూరెలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా తయారు చేయాలి, వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
Prasadam Boorelu: ప్రసాదం బూరెలు తయారీ
కావాల్సిన పదార్థాలు
బొంబాయి రవ్వ – 500 గ్రా
పంచదార – 700 గ్రా
నెయ్యి – 200 గ్రా
యాలకులు – 5 గ్రా
జీడిపప్పు – 25 గ్రా
కొబ్బరి – 1 చెక్క
బియ్యం – 300 గ్రా
మినప్పప్పు – 150 గ్రా
ఉప్పు – తగినంత
రిఫైన్డ్ ఆయిల్ – వేయించడానికి సరిపడా
తయారు చేసే పద్ధతి
బొంబాయి రవ్వ, జీడిపప్పులను నేతిలో దోరగా వేయించండి. ఒక లీటరు నీళ్లను ఎసరు పెట్టండి. ఇందులో యాలకుల పొడి కలపండి. ఎసరు పొంగగానే వేయించిన బొంబాయి రవ్వ, జీడిపప్పు లతో పాటు పంచదా, కొబ్బరి తురుములను పోసి ఉడికించండి. తయారైన ఈ ప్రసాదాన్ని చల్లార్చి ఉండలుగా చుట్టండి. బియ్యం, మినప్పప్పులను కలిపి నానబెట్టి మెత్తగా రుబ్బండి. దీన్ని జారుడు పిండిలా చేసి ఉప్పు కలపండి. నూనె వేడి చేయండి. పిండిలో ప్రసాదం ఉండను ముంచి కాగుతున్న నూనెలో వేసి ప్రై చేయండి. Prasadam Boorelu రెడీ!.