Pranam Potunde Pilla Nevalle MP3 | ఒక ప్రక్క లవ్ ఫెయిల్యూర్, మరో ప్రక్క మిడిల్ ఫ్యామిలీ బాధలకు, తోడు నిరుద్యోగ సమస్యపై ఓ మెస్సేజ్ ఓరియంట్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో సూపర్ హిట్‌ను అందుకుంది. Anu Tunes యూట్యూబ్ ఛానెల్ నుంచి ప్రొడూసర్ మున్నా ఆధ్వర్యంలో కథ, లిరిక్స్, స్క్రీన్ ప్లే, హీరో అన్నీ తానై సుభాష్ సుబ్బు విడుదల చేసిన పాట ప్రాణం పోతుందే పిల్లా నీవల్లే..!. ఈ పాట లవ్ ఫెయిల్యూర్ వెర్షన్లో ఉన్నప్పటికీ ఒక వ్యక్తి జీవితంలో పడే కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.
ఇప్పటి వరకు వచ్చిన లవ్ ఫెయిల్యూర్ ప్రైవేటు సాంగ్స్ కేవలం ప్రియురాలి కోసమో, ప్రియుడి కోసమో వన్ సైడ్ వెర్షన్ నడిచినవి చూశాం..మనం విన్నాం. కానీ ఈ ప్రాణం పోతుందే పిల్లా నీవల్లే సాంగ్ మాత్రం ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి తన జీవితంలో ఎలా ఒడిదొడుకులు, కష్టాలు పడ్డాడో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో చూపించి వాటిని అధిగమించి విజయం వైపు ఎలా నడిచాడో కూడా పాట చివర్లో చూపించడం చాలా అద్భుతంగా అనిపించింది.
ప్రతి ఒక్క యువకుడు కథ కూడా 70 శాతం ఇలాంటి బాధలనే ఎదుర్కొనే ఉంటారనేది ఈ సాంగ్ ద్వారా నిరూపించారు. పాట లిరిక్స్ చాలా బాగున్నాయి. పాట మధ్యలో డైలాగ్స్ కూడా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ను భరత్ మేకల చాలా చక్కగా పాటకు తగ్గట్టుగా అందించారు. ఇక యూట్యూబ్‌లోనే ఫ్యామస్ మెలోడీ, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ సింగర్ దిలీప్ దేవగన్ ఈ పాటకు తన స్వరంతో జీవం పోశారని చెప్పవచ్చు. లవర్స్‌గా సుభాష్ సుబ్బు, లక్కీ హేమ నటించారు. సుభాష్ నటనతో ఆకట్టుకున్నాడు. లక్కీ హేమ కూడా తన నటనతో ఆకట్టుకుంది.
యూట్యూబ్‌లో ఈ పాటను చూసిన వారు వారి జీవితాలను గుర్తు చేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. పాట చాలా బాగుందని, నిజ జీవితంలో నాకు జరిగిందని తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. కేవలం డబ్బును చూసే ప్రేమ శాశ్వతం కాదు, మనసును చూసి ప్రేమించే ప్రేమ ఎప్పటికైనా శాశ్వతమైనది, అది బలమైనది అని కూడా ఈ కాన్సప్ట్‌లో చూపించారు. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదిగే రోజు వస్తుందని దాని కోసం ఎదురు చూస్తూ మన పని మనం చేసుకుంటూ ఉండాలని ఈ పాట రూపంలో అద్భుతంగా చూపించారు. ఈ పాటను మీరు కూడా చూడాలంటే కింద లింక్ ఇస్తాము తప్పకుండా చూడండి, ఆదరించండి!.
Pranam Potunde Pilla Nevalle MP3
Song Name: Pranam Potunde Pilla Nevalle
Producer: Munna
Actor, Lyrics, Tune Composed Story, Screenplay, Dilougesoges, Director by: Subhash Subbu
Cast: Subhash Subbu, Luckyheema, Narendar Dayyala, Joythi, Surendar, Tagur, Nithin Kirrack, Sagar, Sumalatha, Rajarapu
Music: Barath Mekala
Singer: Dilip Devagan
Dop Editing DI: Nithin Gandi
Dubbing Studio & RR Sound Mixing: Vamshi Chandar
Asst Director: Nithin Kirrak
Dubbing Artists: Shamala, Vamshi Chandar, Rajendar Devagan, Swetha Swarna
Special Thanks to Manasa Maidam, Akhil Gandi, Ramesh Palsi, Toniy Anna Vegdevi, Nithin Kirak, Arun Rayapuri, Shayam Kanny, yona, siddu, Suhasini Madam, Rockstar Rakshith
ఈ పాట వీడియో కోసం క్లిక్ చేయండి!
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!