Prakasam SP Malika Garg ఒంగోలు: ప్రజాసేవలో మరో నూతన కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఎస్పీ మాలిక గార్గ్ శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. ఇకపై పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల (Mobile Phone)పై పోలీసు స్టేషన్లో తక్షణమే ఫిర్యాదు స్వీకరిస్తామని ఎస్పీ తెలిపారు. గతంలో పేద, మధ్యతరగతి మరియు ధనిక కుటుంబాలకు చెందిన ప్రజలు వ్యక్తిగత పనులలో ఉండి మొబైల్ ఫోన్ను వివిధ ప్రాంతాల్లో మర్చిపోవడం లేదా ఇతర కారణాల వల్ల వారి యొక్క మొబైల్ ఫోను పోగొట్టుకుంటే, పోలీసు స్టేషన్ల్లో ఫిర్యాదులు ఇవ్వడానికి కొన్ని ఇబ్బందులు పడేవారని (Prakasam SP Malika Garg)తెలిపారు.
దాని కారణంగా కొంత మంది ప్రజలు ఫోను పోగొట్టుకుని ఆర్థికంగా నష్టపోతున్నారనే భావనతో ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ఒక కార్యాచరణ రూపొందించి, ఫిర్యాదుకు సంబంధించిన నూతన Profarma ను తయారు చేశామన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పొగొట్టుకున్నట్టు తెలిసిన అటువంటి ఫిర్యాదులను పోలీసులు తక్షణమే స్వీకరించి చేధించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఇకపై తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫారం ఫిల్ చేసి రిసెప్షన్ కౌంటర్ల (Police reception counter)లో ఇవ్వాలన్నారు.
ప్రతిగా ఆ ఫిర్యాదు దారునికి ఫిర్యాదు స్వీకరించినట్టు రసీదు ఇవ్వబడుతుందన్నారు. అనంతరం పోలీసులు ఆ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ఆ వివరాలను ఐటీ కోర్ టీం(IT Core Team)కు పంపుతామన్నారు. ఐటీ కోర్లో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అప్లికేషన్స్ ద్వారా ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్ను ట్రేస్ చేయడం జరుగుతుందన్నారు. దీని ద్వారా బాధితులకు వారి ఫోన్ తిరిగి లభించడం జరుగుతుం దన్నారు. పోలీసు శాఖపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడుతుందని, ప్రకాశం పోలీసు శాఖ ఎల్లప్పుడు ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి ముందుంటుందని ఎస్పీ మాలికా గార్గ్ పేర్కొన్నారు. ప్రజలు వారి యొక్క ఫోన్లను పోగొట్టుకున్న యెడల సంబంధిత పోలీసు స్టేషన్లో వాస్తవ ఫిర్యాదులను ఇవ్వాలని లేదా పోలీసు వాట్సాఫ్ నెంబరు అయిన 9121102266 ఈ నెంబరులో ఫిర్యాదు చేయాలని ఆమె తెలిపారు.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!