prakasam jilla news ప్రకాశం: కూతురును ఫోన్ మాట్లాడవద్దమ్మా అన్నందుకు పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా కంభం మండలం పెద్ద నల్లకాలువ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పెద్ద నల్లకాలువ గ్రామానికి చెందిన మహాలక్ష్మి(22) కు కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం అయ్యింది. ఈ క్రమంలో కూతురు మొబైల్‌ని ఉపయోగిస్తూ ఉండటంతో తల్లిదండ్రులు మందలించారు. నిశ్చితార్థం అయిన అమ్మాయికి పదే పదే ఫోన్‌తో ఏం పని ఉంటుంది అని అనడంతో మహా లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న సిఐ ఆంజనేయ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి (prakasam jilla news)తరలించారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?