నమ్మకద్రోహులపై సీఎం కేసీఆర్ నిఘా?
Pragathi Bahavan | Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మాట ఎంత తూటాగా ఉంటుందో! అదే విధంగా నమ్మకద్రోహం చేసిన వారి భరతం పట్టే విషయంలోనూ అదే నిక్కచ్చిగా ఉంటారనేది ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చోటు చేసుకున్న దృష్ట్యా వినబడుతున్న మాట ఇది. ప్రగతి భవన్ (Pragathi Bahavan)లో ఫిల్టర్ జరుగుతుందా? అక్కడ ఎవరు ఉండాలో? ఎవరికి ఎంట్రీ ఇవ్వాలో? ప్రత్యేక నిఘా నడుస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇప్పుడు. అవినీతికి చాన్స్ లేదు. నమ్మకద్రోహానికి అంతకన్నా చోటే లేదు సీఎం కేసీఆర్ దగ్గర. ప్రస్తుతం తన వెంటే తిరుగుతూ, తన పార్టీ కండువా కప్పు కొని నమ్మకద్రోహం చేసేవారిపై సీఎం కేసీఆర్ బృందం ప్రత్యేక నిఘా పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ పీఆర్ఓ విజయ్ రాజీనామా కూడా అందుకు నిదర్శమనే ఆ ప్రగతి భవన్లో ఉండే కొందరు అనుకున్నట్టు తెలుస్తోంది.
నమ్మకద్రోహులకు నో ఎంట్రీ?
సీఎం కేసీఆర్‌ను తనను నమ్మిన వారికి ఎంత ప్రాణమిస్తారో? అదే విధంగా నమ్మకద్రోహం చేసేవారిని కూడా అంతే దూరం ఉంచుతారనేది ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. ప్రస్తుతం ఎవరిపడితే వారు ప్రగతి భవన్‌లోకి అడుగుపెట్టే వీలులేదట. నమ్మకద్రోహం చేస్తూ, రంగులు మార్చే కొందరికి ప్రగతి భవనం ద్వారాలు మూసుకుపోయాయని తెలుస్తోంది. ఇటీవల పీఆర్ఓ విజయ్ హఠాత్తుగా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక అవినీతి మరకలు, లూజ్ టాకింగ్, కోవర్టు పొలిట్రిక్స్ చేస్తున్న నేతలను పట్టుకునే పనిలో కేసీఆర్ బృందం నిమగ్నమైనట్టు వార్తలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తిరుగుఉండదు. అలాంటిది అధినేత ప్రక్కనే ఉంటూ పార్టికి, ప్రభుత్వానికి నష్టం తెచ్చే పనులు చేపడితే మాత్రం సహించరనేది సన్నిహతులు చెబుతున్న వాస్తవాలు.

షాక్‌ల మీద షాక్‌లు!
సీఎం కేసీఆర్ గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజయ్యను తొలగించి షాక్ ఇచ్చారు. అదే విధంగా వ్యక్తిగత సహాయకుడును కూడా ఆ మధ్య కాలంలో తొలగించారు. ప్రస్తుతం పీఆర్ఓ విజయ్ కూడా రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను, వ్యక్తిగత సహాయకుడును తొలగించినప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చినవే తొలగించారనేది వార్తలు వినిపించాయి. కాదు..అంతకన్నా ఏదో ఉందనేది ఎవరికీ తెలియని సమాచారమట. తాజాగా ప్రగతి భవన్‌లోకి అడుగు పెట్టనివ్వకుండా ఓ మాజీ ఎమ్మెల్సీని ప్రక్కన పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘకాలంటా సీఎం కేసీఆర్ ప్రక్కన ఉన్న ఆ మాజీ ఎమ్మెల్సీ ఇప్పుడు ఎక్కడా సీఎం ప్రక్కన కనిపించడం లేదు.
అదే విధంగా కౌన్సిల్ చైర్మన్‌గా పనిచేసిన స్వామిగౌడ్‌కు కూడా ఏడాది పాటు ప్రగతిభవన్‌కు అవకాశం ఇవ్వలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కడందో పాటు ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎవరు పార్టీ నిబంధనలను ధిక్కరిస్తున్నారనేది? తెలుసుకునే పనిలో తెలుసుకునేందుకు అంతర్గత బృందం పరిశీలన చేస్తూనే ఉందట. సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ ప్రక్కన ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా ఈ బృందం నిఘా వేసిందనే వార్తలు వస్తున్నాయి. పార్టీని, పదవులను అడ్డం పెట్టుకుని మంత్రులకు, ఎమ్మెల్యేలకు సన్నిహితంగా ఉంటూ కోవర్టు రాజకీయాలు చేసే వారి పేర్లను ఇప్పటికే ప్రగతి భవన్‌కు నో ఎంట్రీ లిస్టులో చేర్చారనే సమాచారం వస్తుంది. అలాంటి వారిపై కూడా సీఎం కేసీఆర్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
ఇది చదవండి:తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట ముఠా అరెస్టు
ఇది చదవండి:భర్తకు దూరంగా ఉంటున్న భార్యపై కన్నేసిన పోకిరీలు..చివరికి?
ఇది చదవండి:కృష్ణా జిల్లా టిటిపిలో ముసలం
ఇది చదవండి:రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన చిన్నమ్మ(శశికళ)
ఇది చదవండి:10 life changing Principales
ఇది చదవండి: ఆ జంతువుకు నిజంగానే విముక్తి కలిగింది!