Powerful Motivational Speech Text | Motivation Telugu : ఆకర్షణకు లొంగిపోయావో నీ జీవితం ఆగినట్టే!
Powerful Motivational Speech Text : ఆకాశంలోకి ఎగురుతున్న ఓ గ్రద్ధ ఆహారం కోసం నేలవైపు చూస్తుంది. అదే సమయంలో భూమి మీద ఓ నక్క ఎర్రలతో ఉన్న బండిని లాగుతూ ఉంది. పైనుంచి చూస్తున్న ఆ గ్రద్ధ రయ్యిమంటూ ఆ నక్క ఎదురుగా వాలిపోయింది. ఆ ఎర్ర(వానపాములు)లను చూసిన గ్రద్ధ నాకు అవి కావాలని నక్కతో వినయంగా అడిగింది. అయితే తప్పకుండా నువ్వడింగింది ఇస్తాను మిత్రమా! అయితే అందుకు కాస్త వెల చెల్లించాలని నక్క బదులిచ్చింది. అయితే ఏమి ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? అని గ్రద్ధ అడిగింది. అయితే నక్క గ్రద్ధతో నీ రెండు ఈకలను ఇస్తే చాలా ఒక ఎర్ర(వానపాము)ను ఇస్తాను అని చెప్పింది. అయితే గ్రద్ధ తన రెండు ఈకలను పీకి ఆ నక్కకు ఇచ్చింది. మాట ఇచ్చిన విధంగానే నక్క గ్రద్ధకు ఒక ఎర్ర ఇచ్చింది.


అయితే ఆ ఎర్రను తింటున్న గ్రద్ధకు ఆ రుచి తెలిసింది. ఆహా ఎంత రుచిగా ఉన్నాయో! అంటూ నక్కకు మరొకటి ఇవ్వాలని తన రెండు ఈకలను పీకి ఇచ్చింది. అలా ఈకలు ఇస్తూ ఎర్రలను తింటూ ఉన్న గ్రద్ధకు చివరకు తన రెక్కలకు ఉన్న ఈకలన్నీ అయిపోయాయి. అప్పుడు నక్క ఆ గ్రద్ధను చూసి ఒక్కసారిగా తుంటరి నవ్వు నవ్వింది. ఒక్కసారిగా తేరుకున్న గ్రద్ధ వెంటనే ఎగరాలనుకుని ప్రయత్నించింది. కానీ ఈకలు లేకపోవడంతో గ్రద్ధ ఎగరలేకపోయింది. ఇదే అదునుగా భావించిన నక్క అమాంతంగా ఆ గ్రద్ధపై పడింది. చీల్చుకొని గ్రద్ధను తినేసింది. ఈ కథలో విచక్షణం కోల్పోయిన గ్రద్ధ చివరికి తన శక్తిని అమ్ముకుంది. ఎంతో ఎత్తుకు ఎగరగలే సత్తా ఉన్న గ్రద్ధ చివరకు నక్కకు ఆహారమైంది. బహుశా ఇది కట్టుకథే కావచ్చు. కానీ ఇందులో ఎంత అర్థముందో మీకు చదువుంటేనే బహుశా అర్థమైందనుకుంటాను.
అలాగే మన జీవితంలో కూడా సరిగ్గా మనల్ని ఆకర్షించి ప్రలోభపెట్టి, తాత్కాలిక ఆనందాలిచ్చే విషయాలే మన పాలిట విషప్రాయాలు అవుతాయి. మన జీవితాన్ని తుంచేస్తాయి. ఆకర్షణ, ప్రలోభాల వల్ల మన దృష్టి మరల్చబడుతుంది. మనిషి యొక్క లక్ష్యాన్ని ఏకాగ్రతను భగ్నం చేసే లక్ష్యంగా పరిస్థితులు, ప్రలోభాలు అడుగడుగునా ఎదురవుతూనే ఉంటాయి. గుర్తు పెట్టుకో… నీ లక్ష్యాలను చేరువయ్యే క్రమంలో ఆకర్షణలు, ప్రలోభాలు ఎదురవుతుంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు సాగాల్సిన తెలివి, బాధ్యత మన మీదే ఉంది.


Motivation Points
దానం చేస్తే డబ్బు తగ్గవచ్చునేమో కానీ లక్ష్మీదేవి మాత్రం నీ నుండి పోదు. గడియారాన్ని ఆపవచ్చు..కానీ సమయాన్ని ఆపలేము. అబద్ధాలు దాచవచ్చు..నిజాలు దాగవు. లోకం చెడ్డదవ్వవచ్చు..అడుగడుగునా మోసం జరగొచ్చు. కానీ నువ్వు మంచిగా ఉండాలనుకుంటే ఏ శక్తి నిన్ను ఆపలేదు. ఒకరు పొగిడితే అందరూ పొగుడుతారు. ఒకరు విమర్శిస్తే అందరూ విమర్శిస్తారు. ఇదే లోకం తీరు. పొగిడారని పొంగిపోకు..విమర్శించారని క్రుంగి పోకు. పొగడ్తలు, విమర్శలు అనేవి శాశ్వతం కావు. నీ వ్యక్తిత్వతమే శాశ్వతం.
అందరితో కలిసి చెడు మార్గాన వెళ్లే బదులు, ఒంటరిగా మంచి మార్గాన వెళ్లడం మేలు. జీవితంలో త్యాగం చేసేది నాన్న అయితే, జీవితాన్నే త్యాగం చేసేది అమ్మ. అవసరమైతేనే మాట్లాడు. లేకుంటే మాట్లాడకు. సాధ్యమైనంత వరకు ఇతరుల విషయాలను ఎక్కడా మాట్లాడవద్దు. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు. ధైర్యంగా ఉంటే బలుపు అంటారు. ప్రశ్నిస్తే పనిలేదంటారు. ఎదురిస్తే వెదవ అంటారు. స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు. కోపంగా ఉంటే కొవ్వు అంటారు. ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు. డబ్బు ఉంటే మాత్రం పై వన్నీ ప్రక్కన పెట్టి గొప్పోడు అనే స్థాయిలో చూస్తారు. ఇదే లోకం తీరు.


కన్నీళ్లను ఆపుకోవడం కష్టం కాదు. కానీ, మనుసులోకి బాధను ఆపుకుంటూ నవ్వుకుంటూ జీవిస్తూ ఉండటమే అతి కష్టమైన పని. ప్రేమగా మాట్లాడుతున్నా వారందిరికీ మనుస్సుల్లో ప్రేమ ఉండకపోవచ్చు. హక్కుకుగా చణువుగా గొడవ పడి కోపగించుకునే వారి మనసులో లోతైన ప్రేమ చెదిరిపోకుండా ఉండవచ్చు. జీవితంలో మనం చేసే తప్పు ఒప్పులను గమనించేది ఇద్దరే. ఒకరు పరమాత్మ, ఇంకొకరు మన అంతరాత్మ. ఏ ఒక్కరి కోసమైతే మనం అందర్నీ వదిలేస్తామో, ఆ అందరి కోసమే మనల్ని వదిలేయవచ్చు. కోపాన్ని చెప్పవచ్చు కానీ చూపించకూడదు. ప్రేమను చూపించాలి కానీ, చెప్పకూడదు. నువ్వు అనుకున్న సమయంలో దేవుడు నీవు అనుకున్నవి ఇవ్వకపోవచ్చు. కానీ నీకు జీవితంలో ఏమి అవసరమో, ఎప్పుడు కావాలో ఆ దేవుడుకు తప్పకుండా తెలుసు. అది తగిన సమయంలో తప్పకుండా ఇస్తాడు.
ఈ లోకంలో తప్పుడు పనులు చేసి పాడైన పోయిన వారికన్నా, చెప్పుడు మాటలు విని చెడిపోయిన వారే ఎక్కువ. మనం ఏడుస్తూ ఉన్నప్పుడు అమ్మ సంతోషంగా ఉన్నదంటే అది మనం పుట్టినప్పుడు మాత్రమే. జీవితం అనేక సవాళ్లను విసిరుతుంటుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారికి విజయం సొంతం అవుతుంది. అందర్నీ నమ్మడం, లేదా ఎవర్నీ నమ్మకపోవడం రెండూ ప్రమాదకరమే. బలము యొక్క రహస్యం ఏకాగ్రతలో దాగి ఉంటుంది. ఉపకారం పొందిన వారు మరువకూడదు. ఉపకారం చేసిన వారు దానిని గుర్తుంచుకోకూడదు.
మనల్ని చూసి చప్పట్లు కొట్టే 10 వేల కన్నా, మన కన్నీరు తూడ్చే ఒక్క వేలు మిన్న. ఇతరులలో ఉన్న చెడును తెలుసుకున్నంతగా, మనలో ఉన్న మంచిని మనం తెలుసుకోలేక పోతున్నాం. మనుసుకు కష్టమొచ్చినా, బాధ వచ్చినా వచ్చేది ముందుగా వచ్చేది మాత్రం కన్నీళ్లే. స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించడంలో వెయ్యి సార్లు విఫలమైనా సరే మరోసారి ప్రయత్నించండి. ఒక దీపం మరొక దీప్పాని తన కాంతి తగ్గకుండానే వెలిగిస్తుంది. ఇది మనందరికీ చక్కగా వర్తిస్తుంది. జీవితంలో ఎదగడానికి జాలి, దయ, మంచితనం ఉంటేనే మాత్రమే చాలదు. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే. కానీ మనుసుకు తప్పుచేసిన ప్రతిసారీ మరణమే. శత్రువులను స్నేహితులుగా చేసుకున్నప్పుడే వారి మనుసులోని శత్రుత్వాన్ని నాశనం చేయగలం.


ఇతరులను అదుపు చేయడం గొప్ప విషయమే. కానీ తనకు తాను అదుపు చేసుకోవడం అంత కన్నా గొప్ప విషయం. లేవండి మేల్కొండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. ముళ్ల బాట దాటితేనే పూల బాట ఎదురువుతుంది. సవాళ్లను ఎదుర్కొంటేనే విజయం ఎదురవుతుంది. మిత్రమా నీ భవిష్యత్తును నీవు మార్చుకోలేకపోవచ్చు. కానీ నీ వ్యక్తిత్వం దానిని మర్చగలదు. ఓటమి, ఒంటరితనం జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పుతాయి. ఒకటి ఎలా గెలవాలి? అని నేర్పితే. మరొకటి ఎవర్ని నమ్మాలో తెలియజేస్తుంది. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండాలి. కొండంత తెలిసినప్పటికీ రవ్వంత తెలుసనే విధంగా ఉండాలి.
శక్తి మంతుడుగా ఉన్నా శక్తి హీనుడుగా కనిపించాలి. తక్కువుగా మాట్లాడాలి ఎక్కువుగా నేర్చుకోవాలి. ఇతరులకు చెప్పాలనే ఉండే శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలనే శ్రద్ధ ఎక్కువుగా ఉండాలి. అప్పుడు… అప్పుడు నీవు శాంతిగా బ్రతుకుతావు. పరమశాంతంగా జీవిస్తావు. మనసులో కలిగే ఆనందం కళ్లల్లోనే కనిపిస్తుంది. ఎవరూ ఓదార్చలేని బాధ కూడా కళ్లల్లో కనిపిస్తుంది. ఈ రోజుల్లో ప్రేమ కు బాగా దూరంగా ఉంటున్నారు. అంటే వారికి ప్రేమంటే ఇష్టం లేక కాదు. ఒక్కప్పుడు ప్రాణంగా ప్రేమించి దారుణంగా మోసపోయానని అర్థం. దైర్యమన్నది కంటికి కనబడని ఆయుధం. అలాంటి ఆయుధం మనలో ఉంటే ఎలాంటి శత్రువునైనా ఓడించవచ్చు. నువ్వు, నేను, నీది నీవాళ్లు పరాయి వాళ్లు.. అనే భావన నీ మనసులో నుంచి తీసివేయి. అప్పుడు అందరూ నీవాళ్లే. నువ్వూ అందరివాడివే. చాలా మంది మోక్షం కావాల అంటే కావాలి అంటారు. కానీ మోక్షం కొందరికే లభిస్తుంది. దృఢసంకల్పం అనే అమ్ముల పొది నుంచి ప్రయత్నమనే బాణాన్ని సంధించు. జీవితంలో ఓడిపోయి సర్వం కోల్పోయినా కూడా, గెలుస్తా అనే ఆత్మవిశ్వాసాన్ని ఉంచుకో. నిప్పు, అప్పు, పగ తమంతట తాము తరగవు. పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి. అప్పును తీర్చాలి. పగను సమూలంగా తుంచేయ్యాలి.


- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started