Power Diet

Power Diet:అతి త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గించే ప‌వ‌ర్ డైట్.. ఇవి పాటిస్తే జిమ్ కూడా అవ‌స‌రం లేదండోయ్‌!

Health Tips

Power Diet సాధార‌ణంగా ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం అంటుంటారు క‌దా చాలా మంది. అది నిజ‌మే. ఎంతో ఆరోగ్యంగా ఉంటే అంత ఆయుష్షును పెంచుకోవ‌చ్చు. ఆరోగ్య‌క‌ర‌మైన మ‌న‌స్సు ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని అందిస్తుంది. అయితే ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండ‌టం కోసం నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. జిమ్ సెంట‌ర్ల చుట్టూ తిరుగుతూ వేల‌కు వేలు డ‌బ్బు ఖ‌ర్చు చేస్తున్నారు. త‌ప్ప స‌హజ ప‌ద్ధ‌తులతో నిత్య ఆరోగ్యాన్ని సంపాదించు కోలేక‌పో తున్నారు. మారుతున్న జీవ‌న శైలితో పాటు శ‌రీరాలు కూడా (Power Diet)మారుతున్నాయి.

ఇప్పుడు నాజ్జుకు అనేది మరుగై బొద్దుగా క‌న‌బడేది ఫ్యాష‌న్ అయిపోయింది. అయితే ఆ అధిక బ‌రువు ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుంది. అనేక అనారోగ్యాల‌కు కార‌ణం అవుతుంది. ర‌క్త‌పోటు, గుండె సంబంధిత వ్యాధులు మ‌రియు మ‌ధుమేహం ఇలాంటి మ‌రెన్నీ ర‌కాల జ‌బ్బులు రావ‌డానికి అవ‌కాశాలున్నాయి. కాబ‌ట్టి ఈ ఉరుకుల ప‌రుగుల జీవితంలో శారీర‌క వ్యాయామానికి స‌మ‌యాన్ని కేటాయించ‌లేక‌పోతున్నాం. అటువంటి ప‌రిస్థితుల్లో ఆరోగ్య‌క‌ర‌మైన పోష‌కాహార‌మే ప్ర‌యోజ‌న‌క‌రం మ‌రి అటువంటి పోష‌కారాన్ని డైట్‌లో ఏ విధంగా తీసుకుంటే అతి త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారో చూద్ధాం.

ఉద‌యాన్నే లేవ‌గానే..!

ఉద‌యాన్నే కొద్దిగా నిమ్మ‌ర‌సం మ‌రియు గ్లాసు గోరు వెచ్చ‌ని నీటిలో తేనె క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో విష మ‌లిన‌ము బ‌య‌ట‌కు పంపివేయ బ‌డు తుంది. బ్రేక్‌ఫాస్ట్‌(అల్పాహారం) లో అల్పాహారానికి క్రింది వాటిలో ఏదైనా ఒక‌టి లేదా రెండింటిని ఎంపిక చేసుకోండి. ఎగ్‌వైట్ ఆమ్లెట్స్‌(2) బ్రౌన్‌బ్రెడ్ రెండు స్లైస్‌లు పాలు (బాగా కాచి వెన్న తీసిన పాలు ఒక గ్లాసు) + కార్న్‌ప్లేక్స్‌/ ఓట్స్‌/ గోధుమ పొట్టు, ఫ్రూట్ స‌లాడ్ / మొల‌కెత్తిన ధాన్యాలు / వెజిటేబుల్ పోహా / ఉప్మా/ వెన్న తీసిన పాల నుండి త‌యారు చేసిన కాటేజ్ చీజ్ / బ్రైన్ బ్రెడ్‌. ఫ్రీ లంచ్ (భోజానికి ముందు) మ‌ధ్యాహ్న భోజ‌నానికి ముందు బ్లాక్ టీ తాగ‌డం వ‌ల్ల జీవ‌క్రియ మెరుగుప‌డుతుంది.

మ‌ధ్యాహ్నా భోజ‌నంలో బాయిల్ / రోస్టెడ్ చికెన్ సోయాబీన్స్ (200 గ్రా) + బ్రౌన్ రైస్ (1/2 ప్లేట్), / చ‌పాతి (1) ఉడికించిన ప‌ప్పు + బ్రౌన్ రైస్ (1/2 ప్లేట్‌) చ‌పాతి (1-2) మితంగా పెరుగు (100 గ్రా) ఇది జీర్ణ‌శ‌క్తిని పెంచుతుంది. సాయంత్రం స‌మ‌యంలో సిట్ర‌స్ పండ్లు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. సిట్ర‌స్ పండ్ల‌ను (నిమ్మ‌జాతికి చెందిన పండ్లు, ఆరెంజ్‌, బ‌త్తాయి, జామ‌) బెర్రీస్‌, ఆపిల్ తీసుకోవ‌డం వ‌ల్ల సాయంత్రంలో క‌లిగే ఆక‌లిని కంట్రోల్ చేస్తుంది. వీటితో పాటు గ్రీన్ టీతో రెండు మారీ లైట్ బిస్కెట్స్‌, ఉడికించిన శ‌న‌గ‌లు. రాత్రి భోజ‌నం స‌మ‌యంలో ఉడికించిన సోయాబీన్ న్యూట్రెలా / సూప్ + స‌లాడ్‌, ఉడికించిన ఎగ్‌వైట్ (3) + వెజిటెబుల్ సూప్‌, చికెన్ లేదా తునా స‌లాడ్‌, ఉడికించిన ప‌ప్పుతో చేసిన ఏదేని కూర‌లు తింటే మంచిది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *