Postmaster Couple: అప్పుల బాధతో ఓ పోస్ట్‌మాన్ కుటుంబం బలవర్మణానికి పాల్పడింది. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు..
Postmaster Couple: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య యాత్నానికి పాల్పడిన దంపతులిద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పొట్టిపాడు పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న దోమ రఘుబాబు దంపతులు కుటుంబ అవసరాల దృష్ట్యా స్వగ్రామమైన పొట్టిపాడులో పలువురి నుంచి తీసుకున్న అప్పు తీర్చేందుకు రఘుబాబు గడువు కోరారు. అయినప్పటికీ సత్వరమే చెల్లించాలని వడ్డీదారులు ఒత్తిడి చేశారు. ఒత్తడి తట్టుకోలేక మనస్తాపం చెందిన రఘుబాబు దంపతులు పెద్దఅవుటపల్లిలో జోసఫ్ తంబి గుడిలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో బాధితులను ఆత్కూరు పోలీసులు ఆసుపత్రికి తరలించారు. విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దంపతులిద్దరూ మృతి చెందారు. ఇటీవల పలు ఆరోపణలపై పోస్ట్ మాస్టర్ రఘుబాబు సస్పెండ్ అయ్యారు. ఈ నెలలో రఘుబాబు తిరిగి విధుల్లోకి చేరాల్సిన రఘుబాబు ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడటంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్