Poor Peoples : New Delhi : భారత దేశంలో కరోనా మహమ్మారి ఇంకా విలయతాండవం చేస్తూనే ఉంది. ఈ కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది ప్రజలు(Poor Peoples) ఆర్థికంగా నష్టపోయారు. ఉద్యోగాలు కోల్పోయారు. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లారు. కరోనా మిగ్చిలిన చేదు జ్ఞాపకాలు కొందరి జీవితాల్లో ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా భారత్‌ను వదిలి వెళ్లిపోయేటట్టు కనిపించడం లేదు. దేశంలో అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుం డటంతో జనం మళ్లీ బెంబేలెత్తుతున్నారు. పరిస్థితులు చూస్తుంటే మళ్లీ గతేడాది 2020లో వచ్చిన లాక్డౌన్లు మళ్లీ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే భారత్‌లో కరోనా మిగిల్చిన ఒక చేదు ఘటనలు కూడా ఇప్పుడు ప్రపంచాన్ని నెవ్వెరపోయే పరిస్థితికి తీసుకొచ్చాయి. అదేమిటంటే పేదరికం. భారత్‌లో కరోనా మహమ్మారి మూలంగా 2020 సంవత్సరంలో మధ్యతరగతి జనాభా 3.2 కోట్లు తగ్గిందని ప్యూ రీసెర్చి సెంటర్ ఓ నివేదికలో వెల్లడించింది. మరో 7.5 కోట్ల మందిని దారిద్ర రేఖ దిగువకు నెట్టిందని పేర్కొంది. ఈ విషయంలో చైనా మెరుగైన స్థానంలో ఉందని తెలిపింది. ఆ దేశ మధ్యతరగతి జనాభా కోటి మాత్రమే తగ్గిందని పేర్కొంది. ఇక పేదల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.

కరోనా మహమ్మారి వెలుగులోకి రావడానికి ముందు భారత్‌లో 2020 సంవత్సరంలో 9.9 కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు ఉంటారని అంచనా వేశారు. కానీ, ఏడాది గడిచిన తర్వాత ఆ సంఖ్య 6.6 కోట్లకు చేరనున్నట్టు లెక్కగట్టారు. ఇక భారత్‌లో పేదల సంఖ్య 5.9 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తే ఆ సంఖ్య 13.4 కోట్లకు చేరనున్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోందని తెలిపారు. 2020 లో పేదరికం రేటు 9.7 శాతంగా ఉండనుందని తాజాగా అంచనా వేశారు. 2020 జనవరిలో దీన్ని 4.3 శాతంగా లెక్కగట్టారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!