Poonam Mala Kondaiah Case : వైద్య అవినీతిపై సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆరా?
Poonam Mala Kondaiah Case : వైద్య అవినీతిపై
సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆరా?
Amaravathi: సీనియర్ మహిళా ఐఎఎస్ అధికారి పూనం మాల కొండయ్య చంద్రబాబు హయాంలో వైద్య ఆరోగ్య శాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలను ఒక కాంట్రాక్టరుకు చెల్లించిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించినది తెలిసినదే. అయితే అవినీతి నిరోధక శాఖతో పాటు మిగిలిన శాఖాధికారులు కూడా ప్రాథమిక విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేసినా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పట్టించుకోలేదు. ఈ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మౌనంగా వహించారు.
కొత్త సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఫోకస్!
తాజా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ దృష్టికి ఈ అవినీతి స్టోరీ ఎవరో తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఒక వైపు ముఖ్యమంత్రి మౌనం వహించారు. ఇలాంటి పరిస్థితులున్ననేపథ్యంలో పూనం మాలకొండయ్యకు సంబంధించిన ఫైళ్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెప్పించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైద్య ఆరోగ్యశాఖాధిపతిగా గతంలో బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఎఎస్ అధికారి జవహార్ రెడ్డి అందుకు సంబంధించిన ఫైలును అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా సీఎం దృష్టికి పంపారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ, ఆ ఫైలు ఎక్కడికి వెళ్లి ఆగిపోయిందో, అక్కడే భద్రంగా ఉన్నట్టు సమాచారం. తాజా ఆరోగ్యశాఖాధిపతి అనీల్ కుమార్ సింఘాల్ కూడా ఆ ఫైలుకు సంబంధించిన విషయాలు పూర్తిగా తెలుసుకున్నా, తనకు ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఫైలును తెరిచిన సీఎస్ ఆధిత్యనాథ్ దాస్?
పూనం మాలకొండయ్య నిధులు దుర్వినియోగానికి సంబంధించిన ఫైలును సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ తెప్పించుకుని చదివారని సమాచారం. ముఖ్యమంత్రితో ఆయన స్వయంగా మాట్లాడే అవకాశాలున్నాయని సచివాలయంలో అధికారులు చెప్పుకుంటున్నారు. నిత్యం ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పూనం మాలకొండయ్యపై చర్యలు తీసుకోవాలని ఆదిత్యనాథ్ దాస్ సిపార్స్ చేయగలరా? అంతే కాకుండా ముఖ్యమంత్రి కార్యాలయ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణ్ ప్రకాష్‌కు పూనం మాలకొండయ్య ఫైలుకు సంబంధించిన వివరాలు తెలిసినప్పటికీ, ఆమె కూడా ఆయనను పదేపదే కలుస్తున్నారని సీఎస్ కు కూడా తెలుసనేది వాస్తవం. ఇలాంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో పూనం వ్యవహారంలో సీఎస్ తలదూర్చి కఠినంగా వ్యవహరించాలనుకుంటున్నారా? ఈ నిధుల దుర్వినయోగం ఇప్పుడు జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగింది. అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రికే వదిలేద్ధామనుకుంటున్నారా?
తానే స్వయంగా టేకప్ చేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే?
ఇది చదవండి: 7న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాక
ఇది చదవండి:యూనివర్శిటీ వైస్ చాన్సలర్ పోస్టులను భర్తీ చేయాండి: గవర్నర్
ఇది చదవండి:తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్
ఇది చదవండి:నందిగామ నియోజకవర్గంలో టిడిపి ఖాతాలోకి గోకరాజుపల్లి
ఇది చదవండి:భవనంపై నుంచి పసిపాపతో దూకి తల్లి ఆత్మహత్య
ఇది చదవండి:మొట్ట మొదటి సారి మెట్రోలో గుండె తరలింపు!
ఇది చదవండి: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ (మెడిక్లాసిక్) పాలసీ గురించి తెలుసుకోండి!
ఇది చదవండి: టిడిపి నేత పట్టాభిపై కారుదాడి, గాయాలు
ఇది చదవండి: అచ్చెన్నాయుడు అరెస్టు | నిమ్మాడలో ఉద్రిక్తత