Pooja Bishnoi | ఈ అమ్మాయి రోజుకు పది గంటలు ట్రైనింగ్ చేస్తుంది. ఎలాగైనా సరే youth olympic games 2022లో చోటు దక్కించుకోవాలనేది ఆమె లక్ష్యం. 11 ఏళ్ల వయసు ఉన్న క్రీడాకారిణి అయిన ఈ అమ్మాయి పేరు పూజా బిష్ణోయ్ (Pooja Bishnoi). రాజస్థాన్‌లో Jodhpur జిల్లాలోని ఓ పల్లెటూరుకు చెందిన చెందిన అమ్మాయి ఇప్పుడు సిక్స్ ప్యాక్‌తో ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. పూజ ఉదయాన్నే 3 గంటలకు నిద్ర లేస్తోంది. 7 గంటల వరకు ప్రాక్టీసు చేస్తుంది. స్కూలుకు వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వస్తుంది.
ఆ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుంటుంది. మళ్లీ 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు Pooja ప్రాక్టీసు చేస్తుంది. యూత్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యం అంటోంది. ప్రస్తుతం పూజా 6వ తరగతి చదువుతుంది. ఆమె తండ్రి వ్యవసాయం చేస్తారు. Runner కావాలనే కోరికను ఆమెలో బలంగా నాటింది ఆమె మేనమామ అంట. ఒకప్పుడు అతడు కూడా క్రీడాకారుడిగా ఎదగాలని అనుకున్నాడు. కానీ అతని కలలు నెరవేరలేదు.
మేనమామ కలల సాధ్యం కోసం!
3 సంవత్సరాల వయసు నుంచే పూజా తన ట్రైనింగ్ (six pack girl)కు ప్రారంభించింది. తనకు కుటుంబం సపోర్టు ఉందంటోంది. తన ఆహారం కోసం కావాల్సిన అన్ని పదార్థాలను, సౌకర్యాలను తన కుటుంబం కల్పిస్తుందని మీడియాకు చెప్పింది. తన మేనమామ తనతో హార్డ్ Work చేయిస్తారంటోంది. నాలో కష్టపడాలి అనే తపన తప్ప మరొకటి ఏమీ లేదంటోంది. పూజా మామయ్య శ్రవణ్ Bishnoi మీడియాతో మాట్లాడుతూ పూజా కోసం 24 గంటలు కేటాయించాల్సి వస్తోందన్నారు. నా కాలేజీ, నా భవిష్యత్ అంతా పూజానే అంటున్నాడు. పూజా లాంటి చురుకైన అమ్మాయి లాంటి మరిఎంతో మంది ఆడపిల్లలను ప్రోత్సహిస్తే భారతదేశానికి ఎంతో మంది క్రీడాకారులు గోల్డు మెడళ్లు తీసుకొస్తారని చెప్పారు.
Rajasthanలో ఆడపిల్లలపై చాలా ఆంక్షలు ఉంటాయంటున్నాడు శ్రవణ్. జీవితంలో ఎదగాలంటే చాలా కష్టపడాలని పూజాకు బలమైన నమ్మకం ఉంది. పూజా Virat Kohli అభిమాని కూడా. అతన్ని ఫాకెట్ రాకెట్ అని పిలుస్తోంది. చాలా మంది అమ్మాయిల బయట ఆహారం తీసుకుంటారని, కానీ నేను అలా తీసుకోకుండా వాటిని విడిచిపెట్టి ముందుకు సాగుతున్నానని పూజా చెబుతోంది. నాకు ఒక లక్ష్యం ఉంది కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాను. అందువల్ల తోటి పిల్లలతో ఆడుకోవాలనిపించదని చెబుతోంది. Celebrities ను కలిసినప్పుడు చాలా జోష్ కలుగుతుందని పూజా అంటోంది. తాను ఇంకా కష్టపడి వారిలా ఎదగాలని కోరుకుంటానంటోంది.
ప్రస్తుతానికి పూజా పెద్దగా రికార్డులు ఏమీ సాధించలేదు. ఆమె తమ పేరు నిలబెడుతుందని తల్లి మీనా బిష్ణోయ్ నమ్ముతున్నారు. తన కూతురు గోల్డు మెడల్ సాధించాలని కలలు కంటోందని, అందుకు పూజా చాలా కష్టపడుతుందని చెబుతోంది. గోల్డు మెడల్ కచ్చితంగా సాధిస్తుందని ఆమె తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.