Remdesivir Injection

Remdesivir Injection : గ‌రిక‌పాడు చెక్‌పోస్టు వ‌ద్ద రెమిడిసివిర్ ఇంజ‌క్ష‌న్లు ప‌ట్టివేత‌

Spread the love

Remdesivir Injection : గ‌రిక‌పాడు చెక్‌పోస్టు వ‌ద్ద రెమిడిసివిర్ ఇంజ‌క్ష‌న్లు ప‌ట్టివేత‌


Remdesivir Injection : కృష్ణాజిల్లా జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం గ‌రిక‌పాడు ఆంధ్రా – తెలంగాణ స‌రిహ‌ద్దు వ‌ద్ద పోలీసులు త‌నిఖీలు చేస్తుండ‌గా హైద‌రాబాద్ నుంచి టిఎస్ ఆర్‌టిసి బ‌స్సులో త‌ర‌లిస్తున్న 100 రెమిడిసివిర్ ఇంజ‌క్ష‌న్ల‌ను గురువారం ప‌ట్ట‌కున్న‌ట్టు ఏఎస్పీ వ‌కూల్ జిందాల్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా మీడియా స‌మావేశంలో వారు మాట్లాడుతూ గ‌రిక‌పాడు చెక్‌పోస్టు వ‌ద్ద త‌నిఖీలు చేస్తుండ‌గా హైద‌రాబాద్ నుండి టిఎస్ ఆర్‌టిసి బ‌స్సులో త‌ర‌లిస్తున్న 100 రెమిడిసివిర్ ఇంజ‌క్ష‌న్ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్టు తెలిపారు. గుంటూరు జిల్లా య‌డ్ల‌పాడు గ్రామానికి చెందిన భూష‌య్య మెమోరియ‌ల్ న‌ర్సింగ్ హోంకి చెందిన డా.క‌రిక‌పాటి సుబ్బారావు తో పాటు సిబ్బంది అజ‌య్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న‌ట్టు ఏఎస్పీ వివ‌రించారు. హైద‌రాబాద్‌లోని లాండ్ మార్క్ హాస్ప‌ట‌ల్ లో గైన‌కాల‌జిస్ట్ గా ప‌నిచేస్తున్న డా.భ‌వ్య ద్వారా అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న‌ట్టు విచార‌ణ‌లో వెల్ల‌డైంద‌ని పేర్కొన్నారు. డా.భ‌వ్య‌ని అదుపులోకి తీసుకొని విచార‌ణ చేయాల్సి ఉంద‌ని తెలిపారు. ఈ ఇంజ‌క్ష‌న్ల విలువ బ‌హిరంగ మార్కెట్‌లో ఒక్కొక్క‌టి రూ.35 వేలు ఉంద‌ని, 100 ఇంజ‌క్ష‌న్లు విలువ రూ.40 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలిపారు.

Remdesivir Injection : రెమిడిసివిర్ ఇంజ‌క్ష‌న్ బ్లాక్ మార్కెట్ ముఠా అరెస్టు

Remdesivir Injection : ఆంధ్ర‌ప్రదేశ్‌లో క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న త‌రుణంలో రెమిడిసివిర్ ఇంజ‌క్ష‌న్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతూ దందా చేస్తున్న ముఠాను గుంటూరు Read more

Tiruvuru Revenue Division:తిరువూరు రెవెన్యూ డివిజ‌న‌ల్ స్వాగ‌తిస్తూ సంబురాలు!

Tiruvuru Revenue Division ఎ.కంభంపాడు: కృష్ణా జిల్లా నుండి విడిపోయిన ఎన్టీఆర్ జిల్లా (విజ‌య‌వాడ‌)లో తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా తిరువూరు రెవెన్యూ డివిజ‌న‌ల్‌ను ప్ర‌భుత్వం నిర్థారించింది. దీనిని Read more

Nuzvid Covid Cases: నూజివీడు డివిజన్ లో కొత్తగా 168 కోవిడ్ కేసులు

Nuzvid Covid Cases నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ లో 28వ తేదీన కోవిడ్ కేసులు పెద్దఎత్తున నమోదయ్యాయి. 28వ తేదీ ఒక్కరోజే 168 కోవిడ్ Read more

pushpa lorry scene: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక మాఫియా ఆగ‌డాలు

pushpa lorry scene గ‌రిక‌పాడు: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక‌మాఫియా ఆగ‌డాలు ఏపీలో వెలుగు చూశాయి. ఏకంగా 11 ఇసుక లారీల‌ను ఆంధ్రా - తెలంగాణ స‌రిహ‌ద్దు Read more

Leave a Comment

Your email address will not be published.