adultery case: ఆగిరిపల్లి: కృష్ణా జిల్లా ఆగిరిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మండలంలోని గణపవరం శోభనాపురం గ్రామ శివారులో ఆరుబయట గుట్టు చప్పుడు కాకుండా ఓ ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న నూజివీడు స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ బి.అభిమన్యు తన సిబ్బందితో కలిసి బుధవారం దాడులు నిర్వహించారు. ఈ వ్యభిచార ముఠాతో సంబంధం ఉన్న మొత్తం 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ దాడుల్లో నిర్వాహకుడు ఆగిరిపల్లి మండలం, వడ్లమాను గ్రామానికి చెందిన టి.రంగారావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దాడిలో ఆరుగురు మహిళలు, ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిపై ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్