Police officers suspended హైదరాబాద్: చిక్కడపల్లి సీఐ పాలడుగు శివశంకర్‌రావు, అశోక్‌నగర్ సెక్టార్ ఎస్సై పి.నర్సింగరావు సస్పెండ్ అయ్యారు. నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వీరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. భార్యభర్తల కేసు విషయంలో వీరిని సీపీ సస్పెండ్ చేసినట్టు తెలిసింది. సీసీఎస్‌లో ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న పి.నాగరాజుగౌడ్‌ను కూడా సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దుష్ప్రవర్తన, అవినీతి, నైతిక, అస్థిరత, ఫిర్యాదు దారుడిని బెదిరించినందుకు గాను చిక్కడపల్లి సీఐని, ఎస్సైని సస్పెండ్ చేసినట్టు (Police officers suspended)తెలుస్తోంది.
ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వచ్చిన వారికి సీసీఎస్‌కు వెళ్లాల్సిందిగా సూచించినట్టు సమాచారం. కేసు నమోదు చేయకుండా తాత్సారం చేయడంతో పాటు, సీసీఎస్‌కు వెళ్లాలని బాధితులకు చెప్పినట్టు తెలిసింది. దీంతో బాధితులు నేరుగా సీపీని కలిసి తమ బాధను వెళ్లగక్కడంతో పాటు నిందితులను కాపాడేందుకు మీ డిపార్ట్మెంట్ వారే సహకరిస్తున్నారు. అని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. సీపీ ఈ కేసుపై అంతర్గత విచారణ జరిపినట్టు సమాచారం. విచారణలో బాధితుల ఫిర్యాదు నిజమేనని తేలడంతో ముగ్గుర్నీ సస్పెండ్ చేసినట్టు తెలిసింది.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?