fake currency printingపెడన: కృష్ణా జిల్లాలో నకిలీ నోట్ల చలామణి కలకలం రేపుతోంది. ఈ దొంగ నోట్లను చలామణి చేస్తున్నముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వివరాల్లో వెళితే.. పెడనకు చెందిన కాసా వెంకటేశ్వరరావు , మరో మైనర్‌తో సహా మొత్తం ఎనిమిది మందిని ఈ నకిలీ నోట్ల వ్యవహారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 లక్షల నకిలీ నోట్లు, అసలు నోట్లు 35,000, ఒక స్కానర్, కలర్ ఫ్రింటర్, పేపర్ కట్టర్ స్వాధీనం(fake currency printing) చేసుకున్నారు.
పట్టణంలోని వీరభద్రపురంకు చెందిన ఓ తండ్రికొడుకులు కాసా నాగరాజు, కొడుకు చందు నకిలీ నోట్లను ముద్రించి చాలామందికి చలామణి చేస్తున్నారు. పట్టణంలోని 20 వార్డు రామలక్ష్మి కాలనీకి చెందిన వ్యక్తి కాసా వెంకటేశ్వరరావు మీడియేటర్‌గా వ్యవహరిస్తూ ఈ నోట్లను చలామణి చేస్తున్నారు. అసలు నోట్లు లక్ష ఇస్తే నాలుగు లక్షల నకిలీ నోట్లు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నాడు.
ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పెడన ఎస్సై మురళి అప్రమత్తమై తెల్లవారుజామున దాడులు ప్రారంభించారు. వీరభద్రపురంలో ఓ ఇంటిపై దాడి చేసి జిరాక్స్ మిషన్ ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లను ముద్రించుతున్న తండ్రికొడుకులతో సహా 9 మందిని అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నట్టు తెలిపారు. వారిపై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు బందర్ డిఎస్పీ షేక్ మాసుం బాషా మీడియాకు వివరించారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?