bangladesh people: బెజ‌వాడ‌లో బంగ్లాదేశ్ యువ‌కులు

Spread the love

bangladesh people: ఒక ప‌క్క ద‌ర్భంగా ఘ‌ట‌న మ‌రువక‌ ముందే ఏపీలో బంగ్లాదేశీ యువ‌కులు తార‌స‌ప‌డ‌టం పోలీసులు అలెర్ట్ అయిన ప‌రిస్థితి నెల‌కొంది. అక్ర‌మంగా భార‌త్‌లోకి ప్ర‌వేశించిన బంగ్లాదేశీ యువ‌కుల‌ను బెజ‌వాడ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


bangladesh people: విజ‌య‌వాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మ‌హా న‌గ‌రం బెడ‌వాడ‌లో బంగ్లాదేశ్ యువ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ‌నివారం న‌లుగురు యువ‌కుల‌ను విచారించారు. తుల్లానా జిల్లా నుండి భార‌త్‌లోకి బంగ్లాదేశీయులు ప్ర‌వేశించిన‌ట్టు తెలుస్తోంది. హావ్ డా – వాస్కోడిగామా రైలులో వెళ్తుండ‌గా బెజ‌వాడ లో రైల్వే పోలీసులు ప‌ట్టుకున్నారు. పాస్ పోర్ట్ లేకుండా న‌ల్లాల ద్వారా భార‌త్‌లోకి ప్ర‌వేశించిన‌ట్టు గుర్తించారు. ఒక ప్ర‌క్క దేశంలో ద‌ర్భంగా ఘ‌ట‌న‌తో పోలీసులు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ ఈ న‌లుగురు బంగ్లాదేశీయులు ఏపీలోకి రావ‌డానికి గ‌ల కార‌ణాల‌పై లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరు ఉపాధి కోసం భార‌త్‌లోకి అక్ర‌మంగా వ‌చ్చిన‌ట్టు ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో వెళ్ల‌డి అయ్యింది. వీరితో పాటు మ‌రికొంద‌రు బంగ్లాదేశీయులు భార‌త్‌లోకి ప్ర‌వేశించిన‌ట్టు పోలీసులు నిర్థారించారు. ప‌లు రాష్ట్రాల్లో అక్ర‌మంగా చొర‌బ‌డి నివాసాలు ఏర్పాటు చేసుకున్న‌ట్టు గుర్తించారు. వీరి వ‌ద్ద నుండి న‌కిలీ పాన్‌, ఆధార్ ప‌త్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

Doctor Couple : న‌డిరోడ్డుపైన కాల్చేశాడు! ఎక్క‌డంటే?

Doctor Couple : కారులో ప్ర‌యాణిస్తున్న డాక్ట‌ర్ దంపతుల‌ను ఓ ఇద్ద‌రు యువ‌కులు అడ్డ‌గించి తుపాకీతో కాల్పిన సంఘ‌ట‌న రాజ‌స్థాన్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. కాల్పుల్లో డాక్ట‌ర్ దంప‌తులు Read more

Cyclone Yaas : తీరం దాటిన య‌స్ తుపాను పొంచి ఉన్న ముప్పు!

Cyclone Yaas : య‌స్ తుపాను ఎట్ట‌కేల‌కు తీరం దాటింది. తీవ్ర గాలులు, వ‌ర్షం దాటికి ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిస్సా లో ప‌లు జిల్లాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. Read more

Covid Second wave : ఆరు రాష్ట్రాల్లో ఆందోళ‌న క‌లిగిస్తున్న క‌రోనా కేసులు

Covid Second wave : దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అంత‌కంత‌కూ విజృంభిస్తోంది. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టికీ కేసులు ఏ మాత్ర‌మూ త‌గ్గ‌డం లేదు. తాజా Read more

Lockdown News : Haryanaలో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌

Lockdown News : దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల‌న్నీ కొన్ని వారాల పాటు Read more

Leave a Comment

Your email address will not be published.