

Police and Eff protestors clash outside Brackenefell school | ఆఫ్రికాలో పాఠశాలలో జాతి వివక్ష ఘర్షణ BRACKENFELL : ఆఫ్రికా దేశంలో బ్రాకెన్ ఫెల్(BRACKENFELL) నగరంలోని ఓ పాఠశాలలో జరిగిన ప్రైవేటు ఫంక్షన్ కార్యక్రమంలో ఘర్షణ చెలరేగింది. ఈ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమానికి కేవలం శ్వేతజాతీయుల(తెల్లవారు)ను మాత్రమే అనుమతించడంతో నల్లజాతీ యులకు ఈ విషయం తెలిసింది. ఇది కాస్త సామాజిక మాధ్యమాల ద్వారా ఘర్షణకు దారి తీసింది. ఈ విషయమై ఈఎఫ్ఎఫ్ పార్టీకి చెందిన ప్రధాన నాయకులు ఈ విషయమై ఆరా తీయడానికి పాఠశాలకు వెళ్లారు. ప్రైవేటు ఫంక్షన్‌కు కేవలం తెల్లజాతీయుల వారును అనుమతించారని, నల్లజాతీయులకు సంబంధించిన ఉపాధ్యాయులకు కనీసం ఆహ్వానం కూడా ఇవ్వలేదని వారు ప్రశ్నించారు. ఇది కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీసింది.
పాఠశాల ముందు శాంతియుతంగా నిరసన తెలిపి, స్కూలు యాజమాన్యానికి ఈఎఫ్ఎఫ్(EFF) పార్టీ నాయకులు, నిరసన కారులు వినతి పత్రం ఇవ్వాల నుకున్నారు. పోలీసులు వారి నిరసనకు కోవిడ్ -19 కారణం వల్ల 100 మందికే అనుమతి ఇచ్చారు. అంతే కాకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా భారీకేడ్లు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న నిరసనకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అప్పటికే శాంతియుతంగా చర్చలు జరిపేందుకు అక్కడ ఒక గుడారంలో సుమారు మూడు గంటలపాటు చర్చలు జరిపారు. ఆ చర్చకు ఒక తెల్లజాతీయుడు వచ్చాడు. ఈ గుంపును ఉద్ధేశించి మాట్లాడటంతో నిరసన కారుల్లో ఒకరు అతని పై దాడి చేశాడు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. వెంటనే పోలీసులు బ్రాకెన్ ఫెల్లో పెద్ద ఎత్తున మోహరించారు. సుమారు 2 వేల మంది నిరసన కారులు ఆ ప్రాంగణంలోకి చేరడంతో స్టన్ గ్రెనేడ్లను ఉపయోగించారు. రబ్బరు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘర్షణలో పలువురి నిరసన కారులకు గాయాలు అయ్యాయి.
ఈఎఫ్ఎఫ్ పార్టీ వారికి, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. నిరసన కారులపై పోలీసులు టియర్ గ్యాస్‌ను పిచికారీ చేశారు. ఈఎఫ్ఎఫ్(EFF) సెక్రెటరీ జనరల్ మార్షల్ డ్లామితో చర్చలు జరుపుతున్నారు. పాఠశాలలో కార్యక్రమానికి తమ నల్లజాతీయులను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. పాఠశాల చుట్టూ పహారా కాస్తున్నారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే తమపై పోలీసులు బల ప్రదర్శన చేసి తమ సభ్యులపై దాడులు చేశారని నిరసన కారుల్లో ఒకరు చెబుతున్నారు. పోలీసులు శాంతియుతను కోరుకోవడం లేదని, అన్యాయంగా ఇది పెద్దది చేయాలని చూస్తున్నారని అన్నారు. ఈఎఫ్ఎఫ్(EFF) ప్రాంతాయ అధ్యక్షురాలు మెళిఖాయా జెగో మాట్లాడుతూ… ఇక్కడ జరిగిన ఘటనను ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకిస్తూ మద్దతు తెలుపుతున్నాయని, తమ పార్టీ ఈఎఫ్ఎఫ్(EFF) ఉన్నత కాలం జాత్యంహకార ధోరణిని అణిచివేస్తామని అన్నారు.