podupu kathalu

Podupu Kathalu: తెలుగులో పొడుపు క‌థ‌లు

Telugu stories

Podupu Kathalu: పూర్వం మ‌న చిన్న వ‌య‌సులో మన తాత‌లు, నాయ‌న‌మ్మ‌లు, అమ్మ‌మ్మ‌లు పొడుపు క‌థ‌లు వేసేవారు.ఆ పొడుపు క‌థ‌లు వేసి విప్ప‌మ‌నేవారు. ఆ పొడుపు క‌థ (Podupu Kathalu) గురించి దీర్ఘంగా ఆలోచించి స‌మాధానం చెప్పేవాళ్లు. ఆ జ్ఞాప‌కాళ్లు ఎక్కువుగా ప‌ల్లెటూర్ల‌లో పెరిగిన వారికి గుర్తే ఉంటాయి. అలాంటి పొడుపు క‌థ‌లు ఇప్పుడు ఎవ్వ‌రూ చెప్ప‌డం లేదు. టెక్నాల‌జీ వ‌చ్చిన త‌ర్వాత ఒక‌రినొక‌రు మాట్లాడుకోవ‌డం, అప్యాయ‌త‌గా ప‌ల‌క‌రించుకోవ‌డం దూరం అయ్యాయి. అంతా ఫోన్‌తోనే కాలం గ‌డుస్తుంది.

Podupu Kathalu: తెలుగులో పొడుపు క‌థ‌లు

అడ‌విలో పుట్టాను అడ‌విలో పెరిగాను
వంటినిండా గాయాలు క‌డుపునిండా రాగాలు ఏమిట‌ది?

జ‌.ముర‌ళి

ఈ ప్ర‌పంచంలోని వారంద‌రూ నా బిడ్డ‌లే
కాని అమ్మా! అని న‌న్నెవ‌రు పిల‌వ‌రు
ఏం చేయాల‌న్నా ఏమి పొందాల‌న్నా
నాలోనే ఎటూ పోవాల‌న్నా ఎక్క‌డికి వెళ్లాల‌న్నా నామీదే నేనెవ‌ర్ని?

జ‌.భూమి

తెల్ల‌టి శ‌న‌గ‌ల‌లో ఒక‌టే రాయి
చేతిలో చ‌ల్ల‌డం నోటితో ఏరుకోవ‌డం!

జ‌. పుస్త‌కం

రాజుగారి తోట‌లో రోజాపూలు
చూసేవారే గాని లెక్క‌వేసేవారు కాదు ఏమిట‌వి?

జ‌.చుక్క‌లు

జీడివారి కోడ‌లు సిరిగ‌ల వారికి
ఆడ‌ప‌డుచు. వ‌య‌సులో కులికే వ‌య్యారి
వైశాఖ‌మాసంలో వ‌స్తుంది. ఏమిట‌ది?

జ‌. మామిడిపండు

ముక్కుమీద కెక్కు ముందర చెవులు నొక్కు
ట‌క్కు నొక్కుల సొక్కు జారిందంటే పుటుక్కు

జ‌.క‌ళ్ల‌జోడు

కిరు కిరు త‌లుపులు
కిటారు తలుపులు
వెయ్యంగ వెయ్య‌స్త‌వి గాని
తియ్యంగ తియ్య‌రావు ఏమిట‌ది?

జ‌.ముగ్గు

ఎగిరిన ఎగురును, పోయినా పోవును
న‌డిచినా న‌డుచును నోట మాట లేదు?

జ‌.నీడ‌

కిట‌కిట బండి కిటారు బండి
ఎద‌రు కూర్చున్న‌విర‌గ‌ని బండి

జ‌.రైలు బండి

ప‌ళ్లు ఉన్నా నోరు లేనిది ఏమిట‌ది?

జ‌. రంపం

చ‌క్క‌ని రెక్క‌లుండు కాని ప‌క్షికాదు
గిరగిర తిరుగును కాని గానుగ కాదు ఏమిట‌ది?

జ‌.ఫ్యాన్‌

చిట‌ప‌ట చినుకులు చిటారు చినుకులు
ఎంత‌రాలినా చ‌ప్పుడు కావు. ఏమిట‌వి?

జ‌.క‌న్నీళ్లు

ఆకాశంలో పాములు ఏమిట‌వి?

జ‌. పొట్ట కాయ‌లు

ఆకులు లేని అడ‌విలో జీవం లేని జంతువు
జీవాల‌ను వేటాడుతుంది. ఏమిట‌ది?

జ‌.దువ్వెన‌

ఆక‌లి ఉండ‌దు, దాహ‌ముండ‌దు,
నేల‌మీద పాక‌దు, ఆ తీగ ఏంట‌ది?

జ‌.విద్యుత్ తీగ‌

వీధిరాజుకి కొప్పుంది కానీ
జుట్టులేదు, క‌ళ్లున్నాయి కానీ
చూపులేదు. ఏమిట‌ది?

జ‌.కొబ్బ‌రికాయ‌

ఆరు ఆమ‌డ‌ల నుండి
అల్లుడు వ‌స్తే అత్త‌గారు వ‌డ్డించింది
విత్తులేని కూర. ఏమిటది?

జ‌. పుట్ట‌గొడుగుల కూర‌

తెల్ల‌టి పొలంలో న‌ల్ల‌టి విత్త‌నాలు.
చేతితో చ‌ల్లుతాం, నోటితో ఏరుతాం. ఏమిట‌వి?

జ‌.పుస్త‌కంలో అక్ష‌రాలు.

ముక్కు మీదికెక్కు, ముదురు
చెక్కుల నొక్కు, ట‌క్కునిక్కుల సొక్కు
జారిందో పుటుక్కు, ఏమిట‌ది?

జ‌.క‌ళ్ల‌జోడు

తోలు న‌లుపు, తింటే పులుపు,
ఏంటో అది?

జ‌.చింత పండు

కుడితి తాగ‌దు, మేత మెయ్య‌దు.
కానీ క‌డివెడు పాలు ఇస్తుంది. ఏంట‌ది?

జ‌.తాటి చెట్టు

స‌న్న‌టి స్తంభం, ఎవ్వ‌రూ
ఎక్క‌లేరు, దిగ‌లేరు. ఏమిట‌ది.

జ‌.సూది

అగ్గిపెట్టెలో ఇద్ద‌రు పోలీసులు?

జ‌.వేరుశ‌న‌గ కాయ‌

ఇంట్లో మొగ్గ బ‌య‌ట‌కొస్తే పువ్వు? ఏమిట‌ది?

జ‌.గొడుగు

కాళ్లున్నా పాదాలు లేనిది?

జ‌.కుర్చీ

చ‌క్క‌న‌మ్మ చిక్కీనా అందంగా ఉంటుంది?

జ‌.స‌బ్బు

ప‌చ్చ‌ని పాముకు తెల్ల‌ని చార‌లు?

జ‌.పొట్ల‌కాయ‌

నాలుగు కర్ర‌లు మ‌ధ్య న‌ల్ల‌రాయి ఏమిట‌ది?

జ‌.ప‌ల‌క‌

చెట్టుకు కాయ‌ని కాయ క‌ర‌క‌ర‌లాడే కాయ‌?

జ‌.క‌జ్జికాయ‌

చింకిరి చింకిరి గుడ్డ‌లు
ర‌త్నాల‌లాంటి బిడ్డ‌లు ఏమిట‌వి?

జ‌.మొక్క‌జొన్న‌

తండ్రిగ‌ర‌గ‌ర త‌ల్లి పీచు పీచు
బిడ్డ‌లు ర‌త్న‌మాణిక్యాలు
మ‌న‌మ‌లు బొమ్మ‌రాళ్లు ఏమిట‌ది?

జ‌.అనాస పండు

పొట్టి వాడికి పుట్టెడు అంగీలు ఏమిట‌ది?

జ‌.వెల్లుల్లి పాయ‌

మా తాత పొల‌ములో
మంచి ఎద్దుల మంద‌
ఎద్దులు పండుకొన‌
ప‌గ్గాలు మేయును.ఏమిట‌ది?

జ‌.గుమ్మ‌డి కాయ‌లు

ఆకాశంలో అర‌వై గ‌దులు
గ‌దిగ‌దికి సిపాయి ఒక‌డు
పిపాయికొక‌నికి తుపాకీ ఒక‌టి. ఏమిట‌ది?

జ‌.తేనె తొట్టి

చెయ్య‌ని కుండ‌
పొయ్య‌ని నీళ్లు
వెయ్య‌ని సున్నం
తియ్య‌గ నుండు

జ‌.కొబ్బ‌రి కాయ‌

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *