Pitru Devathalu : శ్రాద్ధపక్షంలో పితరుల శాంతికోసం బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దీనివల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు. ఈ విషయమై కొన్ని సందేహాలు సహజంగా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్ధాం!.
మొదటిది- బ్రాహ్మణునికి ఇచ్చిన భోజనంతో Pitru Devathalu ఎలా తృప్తి చెందుతారు?. రెండు- పితృదేవతలు మానవయోనిలోనే ఉండాలనే నియం లేదు కదా!. విభిన్న ప్రాణి సంతతికి, విభిన్న ఆహారం ఉటుంది. ఆయా ప్రాణుల్లో జన్మించిన పితృదేవతలు అన్నం స్వీకరిస్తారా? ఈ ఈ ప్రశ్నలకు శాస్త్రాలు స్పష్టమైన వివరణ ఇచ్చాయి.
మృతునికి వంశీయులు భక్తిశ్రద్ధలతో బ్రాహ్మణులకు భోజనం సమర్పిస్తే, పితురులు ఏ లోకంలో, ఏ రూపంలో ఉన్నా శ్రాద్ధకర్త ఆహ్వానించి సత్కరించి బ్రాహ్మణుల్లో సూక్ష్మరూపంలో ప్రవేశించి, ఆహారంలోని సూక్ష్మకణాలను గ్రహిస్తారు. దీనికి కారణం పితృ దేవతలు సూక్ష్మరూపం కావడం. పితురులు దేవయోనిలోకి వెళ్లి ఉంటే, ఆ భోజనం అమృతరూపంలో అందుతుంది.
మనుష్య యోనిలోని పితరులకు అన్నంగా, పశుయోనిలోని పితురులకు గ్రాసంగా, నాగయోనిలోని పితురులకు వాయురూపంలో, యక్షయోని లోని పితురులకు జలంగా అందుతాయి. పేరు, గోత్రం ఉచ్చరించి భక్తి శ్రద్ధలతో అర్పించిన పదార్థం. మంత్రోచ్ఛారణ ద్వారా పితురులకు ఏ రూపంలో ఉన్నా, అందుతుందని వాయుపురాణం స్పష్టంగా చెప్పింది.
జీవుడు వందలాది యోనుల్లో నుండి వెళ్లి ఉండకపోవచ్చు. కానీ, వారు శ్రాద్ధకర్మ ఆహ్వానితులైన బ్రాహ్మణుల్లో గుప్తరూపంలో ఉంటారు. ప్రాణవాయువులా ఆ బ్రాహ్మణులు నడిస్తే వారు నడుస్తారు. కూర్చొంటే కూర్చొంటారు.
వారు శ్రద్ధకాలంలో బ్రాహ్మణులతోటే ఆహారం స్వీకరిస్తారు. మృతి చెందాక Pitru Devathalu సూక్ష్మశరీరం ధరిస్తారు. అందుచేత ఎవరికీ కనపడరు. అంతేగాక ఒక స్థలం నుంచి మరొకచోటికి, ఒక లోకం నుండి వేరొక లోకానికి వెళ్లడానికి పితృ దేవతలకు ఆటంకం ఉండదు.