Piro Preman

Piro Preman: ఆమె క‌విత్వం ఓ తూటా! ఆమె తెగింపు సాటి మ‌హిళ‌కు స్పూర్తి! 200 ఏళ్ల క్రితం ఓ మ‌హిళ ఏం చేసింది?

Spread the love

Piro Preman: నేను హిందువు కాను, ముస్లీంనూ కాను, నాకు చ‌తుర్ణ‌వ‌ర్ణాలు, బ్రాహ్మ‌ణులు, వైశ్యులు, శూద్రులు వీటిపై న‌మ్మ‌కం లేదు. ఏదైనా ప్ర‌త్యేక మైన వ‌స్త్ర‌ధార‌ణను పాటించ‌డంపై కూడా నాకు న‌మ్మ‌కం లేదు. 200 ఏళ్ల క్రితం ఓ ద‌ళిత వేశ్య ఈ మాట‌లు రాశార‌ని చెబితే మీరు న‌మ్మగ‌ల‌రా?


Piro Preman: పితృస్వామ్యం, కుల వ్య‌వ‌స్థ‌, మ‌త ఆచారం బ‌లంగా ఉన్న ఆ రోజుల్లో ఆమె బాట‌లు ఓ బ‌హిరంగ స‌వాల్ విసిరాయి. 200 ఏళ్ల క్రిత‌మే ఓ మ‌హిళ ఇంత‌టి తెగువ చూపించారంటే? మీరు ఆశ్చ‌ర్య‌పోవ‌చ్చు. ఆమె ఎవ‌రో కాదు…పీరో ప్రేమ‌ణ్‌ (Piro Preman). పంజాబీ భాష‌లో మొద‌టి క‌వియిత్రి పీరో ప్రేమ‌ణ్ అని చాలా మంది నిపుణులు భావిస్తారు. పీరో అస‌లు పేరు ఆయూషా అని కూడా కొంద‌రు నిపుణులు చెబుతున్నారు. పీరో ప్రేమ‌ణ్ గురించి రాసిన సుర్‌పీరో అనే పుస్త‌కం ప్ర‌కారం…ఆమె 1810కి ఇంచుమించు ఆ సంవ‌త్స‌రాల్లో జ‌న్మించార‌ని తెలుస్తోంది.

వేశ్య గా ఆ త‌ర్వాత విప్ల‌వ క‌వియిత్రిగా!

పీరో ప్రేమ‌ణ్ చిన్న‌త‌నం నుంచే క‌ష్టాల‌ను ఎదుర్కొన్నారు. త‌న భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత చిన్న‌త‌నంలోనే ఆమెను వేశ్యా వృత్తిలోకి బ‌ల‌వంతంగా దింపారు. లాహోర్‌(lahore)లోని హీరామండి(Heera Mandi) లో ఆమెను అమ్మేశారు. కానీ ఆమె ఎలాగోలా అక్క‌డి నుంచి త‌ప్పించుకుంది. సాదు గులాబ్‌ద‌శ్ ఆశ్ర‌మానికి చేరుకున్నారు. ఆమె ఆశ్ర‌మంలో ఉండ‌టంపై కొంత కాలంగా వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ అది స‌ద్ధుమ‌ణిగిన త‌ర్వాత ఆమె అక్క‌డే నివ‌సించారు.

లాహోర్‌లోని హీరామండిల్ నుంచి ఆమె త‌ప్పించుకున్న త‌ర్వాత, మ‌త గురువు గులాబ్ దాస్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత ఆమెకు క‌విత్వంపై ఆస‌క్తి పెరిగింది. క‌విత్వం రాయ‌డం ప్రారంభించిన త‌ర్వాత ఆమె పేరు పీరో నుంచి పీరో ప్రేమ‌ణ్‌గా మారింది. గురువు గులాబ్ దాస్ ఆశ్ర‌మంకు వ‌చ్చిన త‌ర్వాత ఆమె చాలా తెలివైన వార‌ని, స‌న్మార్గురాల‌ని పేరు పొందారు.

పీర్ అన‌గా సెయింట్‌గా భావించారు. ఆమె మ‌హిళ కావ‌డంతో పీరోగా పిల‌వ‌బ‌డింది. ఆమె భ‌క్తికి అంకిత‌మై ఉండేవారు. కాబ‌ట్టి కొంద‌రు ఆమెను ప్రేమ‌ణ్ అని కూడా పిలిచేవారు. ఆమె గురువు సాదు గులాబ్ దాస్‌కు, దేవుడికి అంకిత‌మై పోయారు. పీరో విప్ల‌వ క‌విత్వం కూడా రాసేవార‌ట‌.

19వ శ‌తాబ్ధంలో పంజాబ్ రాష్ట్రంలో రాజ‌కీయ అస్థిర‌త‌ను ఎదుర్కొంటున్న రోజుల్లో మ‌హారాజు ర‌ణ‌జ‌త్ సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత రాష్ట్రం క్ర‌మ క్ర‌మంగా రాజ ప‌రిపాల‌న బ్రిటీష్ వారి చేతుల్లోకి వెళ్లింది. ఆ స‌మ‌యంలో కూడా పీరో త‌న విప్ల‌వ క‌విత్వంతో సామాన‌త, అస‌మాన‌త‌ల‌ను ప్ర‌శ్నించారు. స‌మాజాన్ని ఉన్న‌త వ‌ర్గాలు, నిమ్మ వ‌ర్గాల పేరుతో విభ‌జించి వివ‌క్ష చూపించ‌డం ప్ర‌కృతి విరుద్ధ‌మ‌ని పీరో న‌మ్మేవారు.

ఓ వ్య‌క్తి సిగ పెట్ట‌కున్నంత మాత్రాన బ్రాహ్మ‌ణుడు అవుతాడా? సున్తీ చేయించుకుని మీసాలు తీసివేస్తే ముస్లిం అవుతారా? అని పీరో త‌న క‌విత్వం ద్వారా ప్ర‌శ్నించారు. సిక్కు మ‌తంపై ఆమె ఇలానే వ్యాఖ్య‌లు చేశారు. మ‌హిళ‌ల‌కు త‌మ‌కు ఏ మ‌తంము ప‌ట్ల ఆస‌క్తి నిరూపించుకునేందుకు అవ‌కాశం లేకుండా పోయింద‌ని ఆమె చెప్పారు. దీంతో గుర్తులు, గుర్తింపుల మ‌త చాంద‌స్వాల‌ను ఆమె ప్ర‌శ్నించారు. అది అస‌లు మ‌త‌మే కాద‌ని భావించారు. మ‌త‌ము అనేది ఒక విస్తృత భావ‌న‌, త‌న‌ను తాను వేశ్య అని చెప్పుకునేవారు. వేశ్య అనే ప‌దం భ‌క్తి ప‌దంలో కూడా ఉంటుందనేవారు. త‌న‌ని తాను వేశ్య అని చెప్పుకోవ‌డానికి ఎప్పుడూ సంకోశించే వారు కాదు.

పీరో ప్రేమ‌ణ్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న స‌మాచారాన్ని బ‌ట్టి, ఆమె 160 క‌విత‌లు రాశారు. పీరో క‌విత్వం అంతా ఆమె ఎదుర్కొన్న బాధ‌లు, ఇబ్బందుల‌పై ఆధారం చేసుకునే ఉంటుంది. త‌న చుట్టూ ఉన్న స‌మాజాన్ని ప్ర‌శ్నించాలంటే ఆ రోజుల్లో ఓ విప్ల‌వాత్మ‌క ధైర్యంగానే భావిస్తుంటారు. పీరో సాహిత్యం చ‌దివిన‌వారు ఆమె పితృసాంఘ‌త్యానికి, మ‌త చాంద‌స‌వాదాల‌కు, కుల వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకంగా పోరాడిన మ‌హిళ‌గా చూస్తారు. చాలా మంది మ‌హిళా ర‌చ‌యిత‌లు త‌మ భావాల‌ను నిర్భ‌యంగా తెలియ‌జేశార‌ని కొంద‌రు చ‌రిత్ర కారులు చెబుతుంటారు. వారికి స్ఫూర్తి క‌లిగించిన వారిలో పీరో ప్రేమ‌ణ్ ఉన్నార‌ని తెలుపుతున్నారు.

Annamayya Keerthanalu: శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి వారి అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

Annamayya Keerthanalu | నానాదిక్కుల న‌రులెల్లావాన‌ల‌లోన‌నె వ‌త్తురు గ‌ద‌లి స‌తులు సుతులుబ‌రిస‌రులు బాంధవులుహితులు గొలువ‌గా నింద‌ర‌నుశ‌త‌స‌హ‌స్ర యోజ‌న‌వాసులునువ్ర‌త‌ముల‌తోడ‌నే వ‌త్తురు గ‌ద‌లి ముడుపులు జాళెలు మొగిద‌ల‌మూట‌లుక‌డ‌లేని ధ‌న‌ముగాంత‌లునుక‌డుమంచిమ‌ణులు క‌రులుదుర‌గ‌ములువ‌డిగొని Read more

Gandhiji quotes: మ‌న జీవితంలో ఉప‌యోగ‌ప‌డే మ‌హాత్మ గాంధీ చెప్పిన నీతి వాక్యాలు ఇవే!

Gandhiji quotes | మ‌హాత్ముని గురించి అంద‌రికీ తెలుసు. ఆయ‌న ప్ర‌బోధించిన అహింసా సిద్దాంతం దేశానికి స్వాతంత్య్రం సంపాదించ‌డ‌మే కాదు, విదేశాల్లోనూ ఖ్యాతిని పొందింది. Satyagraham అత్యంత Read more

Old Words Meaning: పాత ప‌దాలే కానీ అర్థాలు మాత్రం కొత్త‌వి మీరు కూడా చ‌ద‌వండి!

Old Words Meaning | తెలుగులో పాత కాలం పెద్ద‌లు కొన్ని ప‌దాలు వాడేవారు. అవి సూటిగా ఆ సంద‌ర్భానికి అనుగుణంగా ఇమిడిపోతుంటాయి. అవి సూక్తులు కావొచ్చు, Read more

Veda Vyasa: చీక‌టిని తొల‌గించే శ‌క్తి గురువు వేద‌వ్యాసుడు Guru Purnima గురించి చెప్పిన నీతి సూత్రం ఇదే!

Veda Vyasa | ఏక‌రాశిగా ఉన్న వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించి వ్యాసుడు Veda Vyasaడిగా పేరొందారు. అష్టాద‌శ పుర‌ణాల‌ను, 18 ఉప పురాణాల‌ను, విజ్ఞాన స‌ర్వ‌స్వ‌మైన Read more

Leave a Comment

Your email address will not be published.